ఎమ్మెల్యే రోజాకు భక్తి ఎక్కువే. తీరిక దొరికితే ఆలయాలు సందర్శిస్తారు. ఈ మధ్య ఆ దైవభక్తి మరీ ఎక్కువైందని టాక్. ప్రముఖ దేవస్థానాలే కాదు.. మారుమూల ప్రాంతాల్లో అమ్మవారు ఆవహిస్తారని.. అక్కడ ప్రశ్నకు తిరుగులేదని తెలిస్తే చాలు వెంటనే వాలిపోతున్నారు. ఇదంతా అంబను పలికించి.. అధిష్ఠానం ఆశీసులు పొందేందుకేనా? కేబినెట్‌లో చోటు కోసం రోజా ఆశలు రెట్టింపుఅధికారపార్టీ వైసీపీలో ఫైర్‌బ్రాండ్ ఎమ్మెల్యే రోజా. చిత్తూరు జిల్లా నగరి నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. శాసనసభ్యురాలిగా మొదటి టర్మ్…