MLA ROJA: బెర్తే టార్గెట్.. ఏ దేవత కరుణిస్తుందో?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎమ్మెల్యే రోజాకు భక్తి ఎక్కువే. తీరిక దొరికితే ఆలయాలు సందర్శిస్తారు. ఈ మధ్య ఆ దైవభక్తి మరీ ఎక్కువైందని టాక్. ప్రముఖ దేవస్థానాలే కాదు.. మారుమూల ప్రాంతాల్లో అమ్మవారు ఆవహిస్తారని.. అక్కడ ప్రశ్నకు తిరుగులేదని తెలిస్తే చాలు వెంటనే వాలిపోతున్నారు. ఇదంతా అంబను పలికించి.. అధిష్ఠానం ఆశీసులు పొందేందుకేనా?
కేబినెట్‌లో చోటు కోసం రోజా ఆశలు రెట్టింపు
అధికారపార్టీ వైసీపీలో ఫైర్‌బ్రాండ్ ఎమ్మెల్యే రోజా. చిత్తూరు జిల్లా నగరి నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. శాసనసభ్యురాలిగా మొదటి టర్మ్ విపక్షంలోనే గడిచిపోయింది. గత ఎన్నికలలో వైసీపీ పవర్‌లోకి రావడంతో అధికారపక్షంలో ఉన్నారు. రోజా ది ఫైర్‌బ్రాండ్ అనే ట్యాగ్ లైన్ చూసి తప్పకుండా కేబినెట్‌లోకి తీసుకుంటారని 2019లోనే ఆశించారు. సామాజిక, జిల్లా రాజకీయ సమీకరణాల వల్లో ఏమో మంత్రివర్గంలో చోటు దక్కలేదు. రెండున్నరేళ్ల తర్వాత కేబినెట్ ప్రక్షాళన ఉంటుందని సీఎం జగన్ చెప్పడంతో ఆ మాట పట్టుకుని ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు సీఎం జగన్ ఆ దిశగా కసరత్తు ఉంటుందని స్పష్టం చేయడంతో రోజా ఆశలు రెట్టింపు అయ్యాయట.
Also Read
- IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు కొత్త పోస్టింగ్‌లు..
- AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
- AP Municipal Elections: ఎస్టీలకు మంగళగిరి, తాడేపల్లి మేయర్.. 8 మంది మహిళలకు మేయర్లుగా అవకాశం?
- Big Rain Alert: ఏపీకి మరో వాయుగుండం ముప్పు.. అలర్ట్ జారీ చేసిన అధికారులు..
దైవబలం.. దేవుళ్ల ఆశీసుల కోసం తాపత్రయం
మంత్రి కావాలన్నది రోజా బలమైన ఆశగా చెబుతారు ఆమె సన్నిహితులు. అది దక్కకపోవడం వల్లే అప్పట్లో ఫైర్ తగ్గింది. తర్వాత సర్దుకుని గాడిలో పడ్డారు. APIIC ఛైర్‌పర్సన్ పదవి వరించింది. గడువు తీరడంతో ఆ పదవిలోకీ ఇంకొకరు వచ్చేశారు. ప్రస్తుతం ఎమ్మెల్యే తప్ప చేతిలో ఇంకే పదవీ లేదు. కేబినెట్‌లోకి తీసుకొనే ఆలోచన ఉండటం వల్లే మరో నామినేటెడ్ పదవి ఇవ్వలేదన్నది రోజా అనుచరుల మాట. ఈ సందర్భంగా అధిష్ఠానం ఆశీసులు దక్కాలని మునుపటిలా టీడీపీపై విరుచుకుపడుతున్నారు రోజా. దైవబలం కూడా ఉండాలని రోజా తిరగని గుడి లేదు.. మొక్కని దేవుడూ లేడు. నగరి ఎమ్మెల్యే రోజాకు దైవభక్తి ఎక్కువే. తరచూ తిరుమల వెళ్తారు. ఈ మధ్య కాలంలో తిరుమల మరిన్ని ఎక్కువసార్లు వెళ్తూ… మనసులో కోరికను స్వామివారికి నివేదిస్తున్నారట.
మారుమూల గ్రామాలకు పయనం
రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలన్నింటినీ చుట్టేశారు రోజా. ఒక్క గుళ్లే కాదు.. మారుమూల గ్రామాల్లో కొందరికి అమ్మవారు ఆవహిస్తారని.. ఆ సమయంలో ఆశీసులు తీసుకుంటే మేలు జరుగుతుందని తెలిస్తే అక్కడికి వెళ్లిపోతున్నారు. అలా విజయనగరం జిల్లా మక్కువ మండలం పాపయ్యవలస గ్రామంలోనూ తళుక్కుమన్నారు. అక్కడ దుర్గమ్మను దర్శించుకుని అంబ పలికేతే చాలు.. అధిష్ఠానం ఆశీసులు అందితే చాలన్నట్టుగా పూజలు నిర్వహించారు రోజా.
ఇటీవల హైదరాబాద్ ముచ్చింతల్‌లో సమతామూర్తి విగ్రహావిష్కరణలో పాల్గొని ఆథ్యాత్మిక తన్మయత్వంలో మునిగి తేలారు ఎమ్మెల్యే రోజా.
మొర ఆలకించేనా?
ఏదో ఒక దేవుడు లేక దేవత తన మొర ఆలకించక పోతారా.. ఆశ నెరవేరకపోతుందా అని భావించి తెలంగాణలోని మరో పుణ్యక్షేత్రం యాదాద్రిలోనూ ప్రత్యక్షం అయ్యారు రోజా. ఇటీవలే తూర్పుగోదావరిలోని పంచారామ క్షేత్రాలను దర్శించి.. భోళాశంకరుడికి తన కోరికను నివేదించి వచ్చారు రోజా. సామర్లకోట, ద్రాక్షారామాల్లో పూజలు చేశారు. ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలోని త్రిపురాంకేశ్వర స్వామి, త్రిపుర సుందరీ సన్నిధిలో కనిపించారు రోజా. కేబినెట్‌లో చోటు దక్కితే అదే పదివేలన్నట్టుగా ఆదిదంపతులకు ప్రత్యేక పూజలు చేశారు.
పూజల్లో లోటు లేదు.. భక్తిలో తగ్గేదే లేదు
పూజల్లో లోటు లేదు.. భక్తిలో తగ్గేదే లేదన్నట్టుగా రోజా ఆలయాల యాత్ర సాగుతోంది. కేబినెట్ ప్రక్షాళన గడువు సమీపించేలోపు మేడమ్ జాబితాలో మరిన్ని ఆలయాలు చేరే అవకాశం లేకపోలేదు. మరి.. అధిష్ఠానం ఆశీసులు లభించేలా ఏ దేవీదేవతలు రోజాను కరుణిస్తారో చూడాలి.
తాజావార్తలు
-
Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
-
Sanju Samson: 3 పరుగులకే సంజు శాంసన్ అవుట్.. ఆశ్చర్యం ఏముంది.. కామెంటేటర్ సంచలన వ్యాఖ్యలు!
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
ట్రెండింగ్
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!