Temperature Increase: తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. మే నెల చివరిదాకా ఎండలు దంచికొట్టే అవకాశం ఉందని ఐక్యరాజ్యసమితి వాతావరణ సంస్థ వెల్లడించింది. ఈ మూడు నెలలు ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువే నమోదు కానున్నాయని తెలిపింది. పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల జలాలు వేడెక్కడంతో పాటు వాతావరణ మార్పుల ప్రభావం వల్ల ఈసారి ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరగనున్నాయి. ఇటీవల విడుదల చేసిన నివేదికలో ఐక్యరాజ్యసమితి వాతావరణ సంస్థ వేసవి తాపంపై హెచ్చరికలు జారీచేసింది. ఎల్‌నినో ప్రస్తుతం క్రమంగా వీక్ అయిపోతున్నా…దాని ప్రభావం మాత్రం ఇంకో మూడు నెలలపాటు కొనసాగనుంది.
Read Also: AP BJP Key Meeting: రెండో రోజు ఏపీ బీజేపీ నేతలతో అధిష్టానం కీలక భేటీ.. పొత్తులపై నేడు క్లారిటీ..!
మధ్య పసిఫిక్ మహాసముద్రంతో పాటు తూర్పు పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితలాల జలాలు వేడెక్కడాన్నే ఎల్‌నినో పేరుతో పిలుస్తుంటారు. ఇది ఏర్పడిన సంవత్సరాల్లో టెంపరేచర్లు పెరుగుతాయి. ఎల్ నినో సగటున 2 నుంచి 7 ఏళ్లకు ఓసారి ఏర్పడుతుంటుంది. దాదాపు 9 నుంచి 12 నెలలపాటు కొనసాగుతుంది. ఈసారి ఎల్ నినో కారణంగా సముద్ర జలాలు సాధారణం కంటే 2 డిగ్రీలు ఎక్కువగా వేడెక్కాయి. ఇప్పటివరకు ఏర్పడిన అతి బలమైన ఎల్ నినోల్లో ఇది ఐదోది.
Read Also: Congress List: రాహుల్, ప్రియాంక అక్కడి నుంచే పోటీ!
అయితే, గత కొన్ని నెలలపాటు రికార్డు స్థాయిలో టెంపరేచర్లు నమోదు కావడానికి ఒక్క ఎల్ నినో ప్రభావమే కారణమని చెప్పడం సరికాదంటున్నారు వాతావరణ నిపుణులు. మానవ కార్యకలాపాల కారణంగా ఏర్పడిన క్లైమేట్ చేంజ్ సమస్య పాత్ర కూడా ఇందులో ఉందంటున్నారు. ప్రధానంగా వాతావరణంలో సీఓటూ, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్‌లు పెరగడం వల్లే వేడి పెరుగుతోంది. ప్రస్తుత ఎల్ నినో 2023 జూన్‌లో ఏర్పడింది. అప్పటి నుంచి ప్రతినెలలోనూ గతంతో పోలిస్తే రికార్డు స్థాయి టెంపరేచర్లు నమోదయ్యాయి. 2023వ ఏడాది రికార్డు స్థాయిలో అత్యధిక వేడి సంవత్సరంగా నిలిచింది. వీటికి ఎల్ నినో కారణమే అయినా.. గ్రీన్ హౌస్ వాయువులు పెరగడం కూడా మరో కారణమంటున్నారు నిపుణులు. ఎల్ నినో ఎఫెక్ట్ ఉండే ప్రాంతాలే కాకుండా ఇతర ప్రాంతాల్లోనూ టెంపరేచర్లు పెరుగుతుండటమే దీనికి నిదర్శనంగా చెబుతున్నారు. ఇప్పటికైనా గ్రీన్ హౌస్ వాయువులను కట్టడి చేయకపోతే భవిష్యత్తులో విపత్తులు తప్పవని హెచ్చరిస్తున్నారు.