Weather Department: నేటి నుంచి దంచికొట్టనున్న ఎండలు.. 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Weather Department: వేసవి ప్రారంభం అయింది. మార్చి ప్రారంభంలోనే ఎండలు దంచికొడుతున్నాయి. మొదటి వారంలోనే వేడి విపరీతంగా పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో రోజువారీ ఉష్ణోగ్రతలు దాదాపు 5 డిగ్రీల వరకు పెరిగాయి. శివరాత్రి నాడు చలి తగ్గుతుందని చెబుతున్నప్పటికీ భూమిపై పెరుగుతున్న కాలుష్యం కారణంగా గ్లోబల్ వార్మింగ్ జరుగుతోంది. దీంతో ఎండాకాలం ప్రారంభం కాకముందే ఎండలు మొదలయ్యాయి.
ఉదయం, సాయంత్రం వాతావరణం చల్లగా ఉన్నప్పటికీ 10 గంటల లోపే ఎండలు మండిపోతున్నాయి. ఏప్రిల్, మే నెలలకు ముందే సూర్యభగవానుడు ప్రజలపై నిప్పులు కురిపిస్తాడు. దీంతో మార్చి నెలలోనే ఇలా ఉంటే ఎండాకాలం మొత్తం ఎలా ఉంటుందోనని వాతావరణ శాఖ, ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్చి నెల వచ్చిందో లేదో ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి.
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
Read also: Srileela: శ్రీలీలా సినిమాలకు అందుకే గ్యాప్ తీసుకుందా?
తెలంగాణలో సగటు ఉష్ణోగ్రత 39 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా ఉంది. ఇప్పటికే ఎండల కారణంగా వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు హెచ్చరికలు ప్రకటిస్తోంది. తాజాగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం మరోసారి కీలక హెచ్చరికలు జారీ చేసింది. నేటి నుంచి రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతాయని స్పష్టం చేశారు.
నేటి నుంచి రానున్న 5 రోజుల పాటు ఎండలు (ఉష్ణోగ్రత) గరిష్ట స్థాయికి చేరుకునే అవకాశం ఉందని పేర్కొంది. దక్షిణం వైపు నుంచి రాష్ట్రంలోకి తక్కువ స్థాయిలో గాలులు వీస్తున్నాయని తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రజలు అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని హెచ్చరించారు.
ఈ 5 రోజుల పాటు ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌కు పైగా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. రాత్రిపూట కూడా సాధారణం కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండల తీవ్రత పెరుగుతున్న తరుణంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. మధ్యాహ్నం బయటకు వెళ్లవద్దు. ఉదయం 12 గంటలలోపు తిరిగి వచ్చి 4 తర్వాత ఏదైనా పని చూసుకోండి.అంతేకాకుండా ఎండలో నడిచేవారు తప్పనిసరిగా నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరినీళ్లు తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల శరీరం హైడ్రేట్ అవుతుంది.
Aravind Kejriwal : జైలు నుంచే కేజ్రీవాల్ పరిపాలన.. మొదటి ఆదేశం జారీ
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్‌డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!