Sunstroke: వడదెబ్బకు ఇద్దరు మృతి.. కొమురం భీంలో ఒకరు, మంచిర్యాలలో మరొకరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sunstroke: వడదెబ్బకు ఇద్దరు మరణించిన ఘటన తెలంగాణలో చోటుచేసుకుంది. గత కొద్ది రోజులుగా తెలంగాణలో ఎండ తీవ్రత అధికమయింది. దీంతో ఉష్ణోగ్రతలు కూడా అత్యధికంగా నమోదవుతున్నాయి. ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతుండటంతో వడదెబ్బ మృత్యువాత పడుతున్నవారు కూడా ఎక్కువవుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వడదెబ్బతో వేర్వేరు చోట్ల ఇద్దరు మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది.
కొమురం భీం జిల్లాలో ఒకరు మృతి చెందగా.. మంచిర్యాల జిల్లాలో మరొకరు మృత్యువాత పడ్డారు. కొమరంభీం జిల్లా కాగజ్‌నగర్ రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫారమ్.2 లో వడదెబ్బతో గుర్తుతెలియని వృద్దుడు మృతి. మంచిర్యాల జిల్లా జన్నారం పట్టణం వినాయక్ నగర్ కు చెందిన మేడిశెట్టి మహేష్ అనే వ్యక్తి వడదెబ్బతో మృతి చెందారు. దీంతో ఇరు కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
Also Read
- Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
- Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
- Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
- Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
Read also: Road Accident: బర్త్‌డే పార్టీ చేసుకుని వస్తుండగా ప్రమాదం.. స్పాట్‌లోనే నలుగురు యువకులు మృతి
వడదెబ్బకు తాజాగా ఇద్దరు మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీహార్‌కు చెందిన ఓ కూలీ, నల్గొండ జిల్లాలో ఓ ప్రైవేట్ టీచర్ మృతి చెందారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం అచ్చన్నపల్లి గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో బీహార్ కు చెందిన శంకర్ సదా అనే కూలీ పనిచేస్తున్నాడు. శుక్రవారం వడదెబ్బ తగిలి అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు.
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వేములవాడ రూరల్ ఎస్‌ఐ మారుతి తెలిపారు. నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం లాం అడ్లూరు గ్రామానికి చెందిన బోడ అశ్రిత నకిరేకల్ పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. ఇటీవల బంధువు ఓ ఫంక్షన్‌కు వెళ్లి వడదెబ్బకు గురయ్యాడు. తీవ్ర అస్వస్థతకు గురై శుక్రవారం మృతి చెందారు. ఓ ఫంక్షన్‌కు వెళ్లిన తన భార్య వడదెబ్బకు గురై తీవ్ర అస్వస్థతకు గురై చనిపోయిందని అశ్రిత భర్త పేర్కొన్నాడు.
Road Accident: బర్త్‌డే పార్టీ చేసుకుని వస్తుండగా ప్రమాదం.. స్పాట్‌లోనే నలుగురు యువకులు మృతి
తాజావార్తలు
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!