ఉన్నత చదువుల కోసం ఎన్నో ఆశలతో అమెరికాకు వెళ్లిన తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు యువకులు అక్కడ అనుమానాస్పద రీతిలో ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణలోని వనపర్తికి చెందిన ఒకరు, ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళానికి చెందిన మరొక విద్యార్థి అమెరికాలోని వారి కనెక్టికట్ వసతి గృహంలో చనిపోయారని కుటుంబసభ్యులు సోమవారం వెల్లడించారు. విద్యార్థులను తెలంగాణలోని వనపర్తికి చెందిన జి దినేష్ (22), ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళానికి చెందిన నికేష్ (21)గా గుర్తించారు.
మణిపూర్‌లో చిక్కుకున్న ఏపీ విద్యార్ధులను సురక్షితంగా స్వస్ధలాలకు పంపించేందుకు మరింత ముమ్మరంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేసింది. మణిపూర్‌లోని తెలుగు విద్యార్ధులున్న కాలేజీల్లో ఒక్కో విద్యార్థిని నోడల్ పాయింట్‌గా ఎంపిక చేసి, మిగిలిన ఏపీ విద్యార్థుల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు.
బీజేపీ కార్యాలయంలో ఫొటోగ్రాఫర్ల రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. ముఖ్య అతిధిగా హాజరయ్యారు బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. వివిధ జిల్లాల నుంచి సమావేశానికి హాజరయ్యారు ఫొటో గ్రాఫర్లు. ఫొటోగ్రాఫర్లకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం లేదు. ఆత్మనిర్భర్ భారత్ లో చేతి వృత్తుల వారిని ప్రోత్సహించాలని మోడీ చెప్పారు. ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూసేందుకు మోడీ పాలనే కారణం. రష్యా, ఉక్రెయిన్ యుద్దం పెద్ద ఎత్తున జరుగుతుంది. వారి మధ్యలో మధ్యవర్తిత్వం నిర్వహించే…
ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్ధం.. ప్రపంచ దేశాలను టెన్షన్ పెడుతోంది… భారత్‌కు చెందిన వారు దాదాపు 20 వేల మంది ఉన్నారని కేంద్రం తేల్చింది.. అందులో 4 వేల మంది వరకు ఇప్పటికే భారత్‌కు చేరుకోగా.. మిగతావారిని రప్పించే ప్రయత్నాల్లో ఉంది.. భారత ప్రభుత్వం.. తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు కూడా వందల సంఖ్యలో ఉండడంతో.. ప్రత్యేకం హెల్ప్‌లైన్ సెంటర్లు ఏర్పాటు చేశారు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు.. ఇక, ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్థుల భద్రతపై సీఎం…
రష్యా తమపై దాడులు చేస్తోందని, కాపాడాలని ఉక్రెయిన్ భారత్ ని కోరుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ అత్యంత ప్రాధాన్యత ఉన్న వ్యక్తి. రష్యా అధ్యక్షుడు పుతిన్ తో భారత ప్రధాని మాట్లాడాలి. శాంతి నెలకొనేందుకు ప్రయత్నం చెయ్యాలి. భారత్ సపోర్ట్ మాకు కావాలంటున్నారు ఉక్రెయిన్ రాయబారి. ఉక్రెయిన్‌కు నాటో సంఘీభావంగా నిలుస్తోంది. ఉక్రెయిన్‌పై నిర్లక్ష్యపూరిత దాడికి పాల్పడినందుకు రష్యాపై నాటో మిత్రదేశాలు తీవ్ర ఆంక్షలు విధిస్తుంది. EU మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర భాగస్వాములతో సన్నిహిత సమన్వయంతో…
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం చేస్తున్న వేళ భారతీయులు ఆందోళన పడుతున్నారు. ఎందుకంటే ఉక్రెయిన్‌లో మన భారతీయులు ఎంతో మంది చిక్కుకున్నారు. వారిలో 350 మంది తెలుగు విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తోంది. వీళ్లంతా ఉన్నత చదువుల కోసం ఉక్రెయిన్ వెళ్లి అక్కడ చిక్కుకుపోయినట్లు సమాచారం అందుతోంది. దీంతో ఇటీవల భారతీయులను తీసుకొచ్చేందుకు ఎయిరిండియా విమానం వెళ్లగా.. ఉక్రెయిన్ ఎయిర్‌స్పేస్ మూసేయడంతో విమానం ఖాళీగా తిరిగొచ్చేసింది. దీంతో తమ వాళ్ల సమాచారం తెలియకపోవడంతో ఢిల్లీలోని ఉక్రెయిన్ ఎంబసీ దగ్గర విద్యార్థుల…