రష్యా తమపై దాడులు చేస్తోందని, కాపాడాలని ఉక్రెయిన్ భారత్ ని కోరుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ అత్యంత ప్రాధాన్యత ఉన్న వ్యక్తి. రష్యా అధ్యక్షుడు పుతిన్ తో భారత ప్రధాని మాట్లాడాలి. శాంతి నెలకొనేందుకు ప్రయత్నం చెయ్యాలి. భారత్ సపోర్ట్ మాకు కావాలంటున్నారు ఉక్రెయిన్ రాయబారి. ఉక్రెయిన్‌కు నాటో సంఘీభావంగా నిలుస్తోంది. ఉక్రెయిన్‌పై నిర్లక్ష్యపూరిత దాడికి పాల్పడినందుకు రష్యాపై నాటో మిత్రదేశాలు తీవ్ర ఆంక్షలు విధిస్తుంది. EU మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర భాగస్వాములతో సన్నిహిత సమన్వయంతో NATO మిత్రపక్షాలు ఇప్పుడు రష్యాపై తీవ్రమైన ఆర్థిక ఆంక్షలు విధిస్తున్నాయని NATO పేర్కొది.
ష్యా సైన్యం అధీనంలో ఉక్రెయిన్ రాజధాని కీవ్ ఎయిర్ పోర్ట్. ఉక్రెయిన్ గగనతలం తెరుచుకోగానే “ఇండియన్ ఎయిర్ ఫోర్స్” రవాణా విమానాలను పంపాలని కేంద్రం నిర్ణయం. ఐఏఎఫ్ విమానాల ద్వారా భారతీయుల తరలింపునకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు విదేశీవ్యవహారాల సహాయమంత్రి వి.మురళీధరన్. ఉక్రెయిన్‌లోని విద్యార్థులతో సహా, దాదాపు 18వేలమంది భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి విదేశాంగశాఖ చర్యలు చేపట్టిందన్నారు. ఉక్రెయిన్‌లోని గగనతలం మూసివేశారు. భారతీయ పౌరుల తరలింపు కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. భారతీయులందరి భద్రతకు కేంద్ర ప్రభుత్వం భరోసా ఇస్తుందన్నారు కేంద్ర విదేశీవ్యవహారాల సహాయమంత్రి వి.మురళీధరన్.