వైసీపీ ప్రభుత్వంపై మరోసారి విరుచుకుపడ్డారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. మణిపూర్ లో ఉన్న తెలుగు విద్యార్థులను ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దుర్మార్గం. ప్రతిపక్షాలపై అక్రమ కేసులు పెట్టడంపై ఉన్న శ్రద్ధ విద్యార్థులను కాపాడటంపై లేదా ?టీడీపీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్న తెలుగు వారి సంక్షేమం కోసం కృషి చేస్తుంది.జగనుకి తెలుగు విద్యార్థుల సమస్యలు పట్టవా ?రంగులు వేయటం కోసం, మీ ప్రచారం కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు గానీ.. ఆపదలో ఉన్న విద్యార్థులను ఆదుకోరా ? అని ఆయన ప్రశ్నించారు.
ప్రత్యేక విమానాల్లో తిరిగే సీఎం.. మణిపూర్ లో ఉన్న తెలుగు విద్యార్థులను తీసుకొచ్చేందుకు ఒక విమానం కూడా ఏర్పాటు చేయకపోవడం సిగ్గుచేటు అన్నారు. మణిపూర్ లో చిక్కుకున్న తెలుగు విద్యార్థుల్ని వెంటనే తీసుకురావాలని ఏపీ ప్రభుత్వాన్ని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. మరోవైపు తెలంగాణ రాష్ట్ర విద్యార్థులను మణిపూర్ రాష్ట్రం నుంచి హైదరాబాద్ కు తీసుకువచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రత్యేక విమానంలో అధికారులు విద్యార్ధులను తరలిస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం బేగంపేట ఎయిర్ పోర్టు కు ఆ విమానం చేరుకోనుంది.
చంద్రబాబు ట్వీట్
మణిపూర్ అల్లర్లల్లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులను క్షేమంగా రాష్ట్రానికి తీసుకు వచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నా. విద్యార్థుల రక్షణకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి.
మణిపూర్‌లో నివసిస్తున్న ప్రజల భద్రతకు తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. మణిపూర్ రాష్ట్రంలోని పరిస్థితిని పర్యవేక్షించడానికి, మణిపూర్‌లోని తెలంగాణ ప్రజల ప్రయోజనాలను పరిరక్షించడానికి ప్రత్యేక సెల్ తెరవబడింది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, తెలంగాణ రాష్ట్రానికి చెందిన సుమారు 250 మంది విద్యార్థులు ఇంఫాల్ మరియు పరిసర ప్రాంతాల్లోని వివిధ విద్యాసంస్థల్లో చదువుతున్నారు. తెలంగాణ విద్యార్థులను ఇంఫాల్ నుంచి హైదరాబాద్‌కు తక్షణమే ప్రత్యేక విమానంలో తరలించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందు కోసం 07-05-2023 ఉదయం ఇంఫాల్ నుండి హైదరాబాద్‌కు ప్రత్యేక విమానం ఏర్పాటు చేశారు. ఇంఫాల్ నుండి హైదరాబాద్‌కు తెలంగాణ విద్యార్థులు సురక్షితంగా తరలించేందుకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మణిపూర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సంప్రదించి తగు చర్యలు తీసుకుంటున్నారు. మణిపూర్ రాష్ట్రంలోని తెలంగాణా ప్రజలు/విద్యార్థుల భద్రత కోసం మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మరియు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారు.
Read Also: Varshini : వర్షిణి అక్కా.. దయ చేసి నువ్వు స్టేడియంకు రాకే..