హిమాచల్‌ప్రదేశ్‌లోని హమీర్‌పూర్‌లో పౌల్టీఫారంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఇక్కడి పౌల్ట్రీ ఫామ్‌లోని సుమారు 5 వేల కోళ్లు బుధవారం రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో అగ్నికి ఆహతైనట్లు అధికారులు గురువారం వెల్లడించారు.
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్ కు పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు హాజరుకాలేదు. మంగళగిరిలోని సెక్రటేరియట్ నుంచి సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో.. జనవరి నెలలో అమలు చేసే పథకాలకి సంబంధించి సమావేశం నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి దాడిశెట్టి రాజాతో సహా జిల్లా ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అయితే ఈ భేటీకి మాత్రం పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు డుమ్మా కొట్టారు.
గూఢచర్యం ఆరోపణలకు సంబంధించి అక్టోబర్ నెలలో ఎనిమిది మంది భారత నేవీ మాజీ సిబ్బందికి ఖతార్ కోర్టు విధించిన మరణ శిక్షలను తగ్గించిందని భారత ప్రభుత్వం గురువారం వెల్లడించింది. దహ్రా గ్లోబల్ కేసులో ఖతార్ అప్పీల్ కోర్టు శిక్షలను తగ్గించిందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
మున్సిపాల్టీల్లో సమ్మెలో ఉన్న సీఐటీయూతో మంత్రి ఆదిమూలపు సురేష్ చర్చలు ముగిశాయి. రెండున్నర గంటల పాటు మంత్రి, యూనియన్ నేతల మధ్య చర్చలు కొనసాగాయి. అయితే.. సీఐటీయూతో మంత్రి సురేష్ చర్చలు అసంపూర్తిగా ముగిసినట్లు తెలుస్తోంది. మరోవైపు.. సమ్మె విరమించాలని మంత్రి సురేష్ వారిని కోరారు. ఈ క్రమంలో.. చర్చల సారాంశాన్ని కార్మికులకు చెప్పి సమ్మె కొనసాగింపా..? విరమణా..? అనే విషయం తెలియచేస్తామని సీఐటీయూ చెప్పింది. కార్మికుల నుంచి క్లారిటీ తీసుకున్నంత వరకు సమ్మె కొనసాగిస్తామని సీఐటీయూ…
ఇచ్చిన మాట ప్రకారం ఒకటో తేదీ నుంచి 3 వేల పెన్షన్ అమలు చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. సీఎం జగన్ మాటిస్తే అమలు చేసి తీరుతారమని అన్నారు. మూడో తేదీన పెన్షన్ ల పంపిణీ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొంటారని చెప్పారు. వచ్చేనెల 4 ముఖ్యమైన కార్యక్రమాలు జరగనున్నాయని.. అంతేకాకుండా, వైయస్సార్ ఆసరా చేయూత లబ్ధిదారులకు సీఎం జగన్ నగదు జమ చేయమన్నారని అన్నారు. 404 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేస్తున్న డాక్టర్ బి.ఆర్…
కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయనున్న ఐదు హామీల కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రజాపాలన కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా గురువారం ప్రారంభమైంది. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్‌మెట్‌లో ప్రజాపాలన కార్యక్రమాన్ని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరు హామీల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామసభల ద్వారా పారదర్శకంగా అర్హులైన లబ్ధిదారుల గుర్తింపునకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఇది ఫ్యూడల్ ప్రభుత్వం కాదు, ప్రజల ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు…
మధ్యప్రదేశ్‌లోని గుణాలో బుధవారం జరిగిన ప్రమాదంలో మంటల్లో చిక్కుకున్న ప్రైవేట్ బస్సులో 'ఫిట్నెస్ సర్టిఫికేట్' లేదని గుర్తించారు. ఇక, ఆ బస్సు బీజేపీ నేతకు చెందినదని తెలిసింది.