15 ఎంపీ స్థానాలు టార్గెట్ గా పెట్టుకున్నామని, నేను ఎంపిగా పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి. ఇవాళ ఆయన ఎన్టీవీతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నుంచి 15 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. పార్టీ వద్దని చెబుతుంది… పార్టీ ఇమేజ్ దెబ్బతింటుందని, అసెంబ్లీ ఎన్నికలప్పుడే కాంగ్రెస్ లో చేరేందుకు సోయం బాపు రావు చర్చలు జరిపారన్నారు. పార్లమెంట్…
తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి ఉపాధ్యాయ సంఘాల నేతలు వచ్చారు. ఈ సందర్భంగా సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. ఉపాధ్యాయ సంఘాల్లో అతిపెద్ద సంఘం పీఆర్టీయూ.. గత ప్రభుత్వంలో రెండుగా విడిపోయాయని తెలిపారు. అంతేకాకుండా.. రెండు ఎమ్మెల్సీలను గెలుచుకున్న గొప్ప సంఘం పీఆర్టీయూ అని అన్నారు. విడిపోయిన నేతలతో మాట్లాడి రెండు సంఘాలు కలిసేలా చూశామని.. ఒప్పందం ప్రకారం విడిపోయిన రెండు సంఘాలు ఏకమయ్యాయని పేర్కొన్నారు. రెండు సంఘాలు కలవడం వల్ల బలం పెరిగింది..…
రాష్ట్రీయ రాజ్పుత్ కర్ణి సేన అధ్యక్షుడు సుఖ్దేవ్ సింగ్ గోగమేడిపై కాల్పులు జరిపిన నిందితుల్లో ఒకరైన రోహిత్ రాథోడ్ ఇంటిని అధికారులు గురువారం కూల్చివేశారు. ఖతీపురాలోని రోహిత్ రాథోడ్ ఇంటిని అక్రమంగా నిర్మించారని జైపూర్ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ బుల్డోజర్తో కొట్టివేసింది.
సెంచురియన్ లో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియాపై ఆతిథ్య దక్షిణాఫ్రికా మొదటి ఇన్నింగ్స్ లో భారీ స్కోరు చేసింది. డీన్ ఎల్గార్ (185) సెంచరీ చేయగా.. మార్కో యన్సెన్ (84 నాటౌట్), డేవిడ్ బెడింగ్ హామ్ (56) అర్ధసెంచరీలతో దక్షిణాఫ్రికా మొదటి ఇన్నింగ్స్ లో 9 వికెట్లు కోల్పోయి 408 పరుగులు చేసింది. అయితే ఈ మ్యాచ్ లో కెప్టెన్ టెంబా బవుమా గాయం కారణంగా బ్యాటింగ్ చేయలేదు.
యూరప్కు ముఖద్వారమైన ఇటలీ భారతీయులకు తలుపులు తెరిచింది. భారత్, ఇటలీ ఇటీవల 'మైగ్రేషన్ అండ్ మొబిలిటీ' ఒప్పందంపై సంతకం చేశాయి. ఈ ఒప్పందానికి భారత మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. ఇటలీతో ఈ ఒప్పందం ద్వైపాక్షిక ఒప్పందాలను బలోపేతం చేయడమే కాకుండా అక్రమ వలసలను కూడా నిరోధించనుంది.
శ్రీ సత్యసాయి జిల్లాలో వైసీపీ అధిష్టానం చేపట్టిన మార్పులు, చేర్పులు ఎఫెక్ట్ స్పష్టంగా కనబడుతోంది. సిట్టింగ్ లను మార్చొందంటూ ఎమ్మెల్యేల మద్దతుదారులు రోడ్డెక్కి తమ అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు.
ఫిబ్రవరి 8న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పోటీ చేయగలరా.. అనే ప్రశ్న చాలా మందికి వచ్చింది. దానికి కారణం కూడా లేకపోలేదు. వాస్తవానికి ఎన్నికల్లో పోటీ చేయకుండా నవాజ్ షరీఫ్పై సుప్రీంకోర్టు జీవితకాల నిషేధం విధించింది.
కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా రేపు (శుక్రవారం) విజయవాడ, గుంటూరు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈరోజు సాయంత్రం ఢిల్లీ నుండి విజయవాడ చేరుకుని.. రాత్రికి విజయవాడలో బస చేయనున్నారు. శుక్రవారం ఉదయం 9.15 కు విజయవాడలో పాత ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో క్రిటికల్ కేర్ బ్లాక్, BSL-3 ల్యాబ్ నిర్మాణానికి కేంద్రమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం అక్కడ కొత్తగా నిర్మించిన IPHL ల్యాబ్స్ ను ప్రారంభించనున్నారు.
ప్రారంభోత్సవానికి ముస్తాబవుతోన్న రామాలయం.. మారిపోయిన అయోధ్య రైల్వే స్టేషన్ పేరు అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవానికి ముందు రైల్వే శాఖ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. పవిత్ర నగరమైన అయోధ్య జంక్షన్లోని రైల్వే స్టేషన్ పేరును మార్చేసింది. అయోధ్యలో కొత్తగా నిర్మించిన ఈ రైల్వే స్టేషన్కు ‘అయోధ్య ధామ్ జంక్షన్’గా నామా కరణం చేసింది. రైల్వే స్టేషన్ పేరు మార్పు ప్రతిపాదనను ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సర్కార్ రైల్వే శాఖ ముందుకు తీసుకుపోగా..…