2024 జనవరి 22న "ప్రాణ్ ప్రతిష్ఠ" విగ్రహ ప్రతిష్ఠాపన జరగనుంది. అయితే.. ఈ కార్యక్రమానికి ఆహ్వానించబడిన విశిష్ట అతిథులందరికీ ప్రత్యేక బహుమతులు ఇవ్వనున్నట్లు ఆలయ ట్రస్ట్ బుధవారం ప్రకటించింది. అయోధ్యలో రామమందిర నిర్మాణం, నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన ట్రస్ట్ శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రం, హాజరైనవారికి పవిత్ర ప్రసాదంతో పాటు, గీతా ప్రెస్ నుండి 'అయోధ్య దర్శన్' పుస్తకం కాపీలను అందించనున్నట్లు చెప్పారు.
వైసీపీకి గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు షాక్.. వైసీపీకి గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు షాక్ ఇచ్చారు. అనారోగ్య వల్ల వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటున్నానని మీడియాసమావేశంలో వెల్లడించారు. 2009లో ప్రజారాజ్యం తరఫున తొలిసారి ఆయన పోటీ చేశారు. అనంతరం ఆ పార్టీ కాంగ్రెస్ లో విలీనంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కొనసాగి 2014లో టీడీపీలో చేరారు.. అనంతరం భారీ బహిరంగ సభ పెట్టి టీడీపీని వీడుతున్నట్లు ప్రకటించారు.. ఇక, 2019లో వైఎస్ఆర్సీపీలో చేరి సీఎం జగన్…
రాజస్థాన్ ప్రభుత్వం నూతన సంవత్సర కానుక ఇచ్చింది. జనవరి 1 నుండి ఉజ్వల గ్యాస్ సిలిండర్ రూ.450కు అందించనుంది. రాజస్థాన్‌లో ఎన్నికల ప్రచారం సందర్భంగా.. బిజెపి మేనిఫెస్టోలోని అన్ని హామీలలో ఉజ్వల పథకం లబ్ధిదారులకు 450 రూపాయలకే గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పారు. పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచిన వాగ్దానాలన్నింటినీ మోడీ హామీలుగా ప్రచారం చేసింది. ఇప్పుడు దీనిని నెరవేరుస్తూ ఉజ్వల పథకం లబ్ధిదారుల కోసం బీజేపీ ఈ ప్రకటన చేసింది.
ఐపీఎల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కర్ణాటక క్రికెటర్ కేసీ కరియప్ప.. ప్రస్తుతం తీవ్ర వివాదంలో ఇరుక్కున్నాడు. అతని మాజీ ప్రియురాలు అతనిపై తీవ్ర ఆరోపణలు చేసింది. కరియప్ప తన మాజీ ప్రియురాలు మాదకద్రవ్యాల వినియోగంలో ఉన్నట్లు ఆరోపించిన వీడియోను విడుదల చేయడంతో వివాదం సంచలనంగా మారింది. దీనిపై కర్ణాటక పోలీసులు విచారణ ప్రారంభించారు.
గర్భధారణ సమయంలో మార్నింగ్ సిక్నెస్ అనేది ఒక సాధారణ సమస్య, ఇది దాదాపు 70 శాతం మంది స్త్రీలను ప్రభావితం చేస్తుంది. మార్నింగ్ సిక్నెస్ యొక్క లక్షణాలు వాంతులు, వికారం, అలసట, తలనొప్పి మరియు నోటిలో పుల్లని ప్రభావం కలిగి ఉంటాయి. చాలా సందర్భాలలో, మార్నింగ్ సిక్నెస్ గర్భం దాల్చిన మొదటి 12 వారాలలో సంభవిస్తుంది మరియు ఆ తర్వాత తగ్గిపోతుంది. అయినప్పటికీ, కొంతమంది స్త్రీలలో, గర్భధారణ సమయంలో ఉదయం అనారోగ్యం కొనసాగుతుంది. మార్నింగ్ సిక్ నెస్…
అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవానికి ఇంకా నెల రోజుల సమయం కూడా లేదు. దీంతో.. రామ మందిర పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. కాగా.. ఈ పనులు కొద్ది రోజుల్లో పూర్తవనుండగా, తర్వాత డెకరేషన్ వర్క్ ప్రారంభం కానుంది. ఇదిలా ఉంటే.. వేడుకకు సంబంధించి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్రం అలంకరణ పనులు మరికొద్ది రోజుల్లో ప్రారంభమవుతాయని ఆలయ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు.
మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యడియూరప్పపై బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కోవిడ్ సమయంలో తన పదవీకాలంలో రూ. 40,000 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు. అంతేకాకుండా.. ఏ నాయకుడు ఏ విధంగా ఎంత డబ్బు సంపాదించాడో తనకు తెలుసన్నారు. ప్రభుత్వం కేవలం రూ.45 విలువ చేసే మాస్క్‌ను రూ.485కి కొనుగోలు చేసిందని అన్నారు. కోవిడ్ కేర్ సెంటర్ల కోసం 10,000 పడకలు అవసరమని యడియూరప్ప నేతృత్వంలోని ప్రభుత్వం తెలిపింది. పడకలను అద్దెకు…
కొబ్బరి రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కొప్రా ఎంఎస్పిని క్వింటాల్‌కు రూ. 300 పెంచుతూ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. మిల్లింగ్ కొప్రా ఎంఎస్పి క్వింటాల్‌కు రూ.10860 నుంచి రూ.11160కి పెరిగింది. మరోవైపు.. బాల్ కొప్రా ఎంఎస్పి క్వింటాల్‌కు రూ.11750 నుంచి రూ.12000కి పెంచారు. పెంచిన ధరల ద్వారా కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇదిలా ఉంటే, ఈరోజు జరిగిన సమావేశంలో.. బీహార్‌లోని దిఘా నుండి సోన్పూర్ మధ్య గంగా…