జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం రెండో దశ రేపటి నుంచి ప్రారంభం కాబోతోంది. ప్రజారోగ్య పరిరక్షణ కోసం ప్రజలకు సూపర్‌స్పెషాలిటీ వైద్య సేవలందించేందుకు ఈ కార్యక్రమం ప్రారంభమైన సంగతి తెలిసిందే. రెండో దశలో మొదటి గ్రామీణ ప్రాంతాల్లో, 3వ తేదీ నుంచి పట్టణ ప్రాంతాలలో హెల్త్ క్యాంపులు ప్రారంభం కానున్నాయి.
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో సోమవారం భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. అయితే ఈ ఘటనలో ఓ ఆరు నెలల చిన్నారి మరణించింది. అంతేకాకుండా తల్లికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గాయపడిన తల్లి ముట్వాండి గ్రామానికి చెందిన నివాసి. ఇదిలా ఉంటే.. ఈ కాల్పుల్లో ఇద్దరు జిల్లా రిజర్వ్ గార్డ్ జవాన్లు కూడా గాయపడ్డారని పోలీసు అధికారి తెలిపారు.
Top Headlines @9PM on 1st January 2024, Top Headlines @9PM, telugu news, top news, new year celebrations, Telangana, Andhrpradesh, National News, Tollywood Sports
భారతదేశంలో తీవ్రమైన చలి కారణంగా ఇంధనానికి డిమాండ్ తగ్గింది. దీంతో డిసెంబర్లో పెట్రోల్, డీజిల్ అమ్మకాలు తగ్గినట్లు ప్రభుత్వ రంగ పెట్రోలియం కంపెనీల ప్రారంభ విక్రయాల డేటా నుండి ఈ సమాచారం అందింది. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే.. 2023 డిసెంబర్లో 1.4 శాతం తగ్గి 27.2 లక్షల టన్నులకు చేరుకోగా, డీజిల్ డిమాండ్ 7.8 శాతం తగ్గి 67.3 లక్షల టన్నులకు చేరుకుంది.
ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ అమ్మవారి కరుణ కటాక్షం కోసం భక్తులు అమ్మవారి దీక్షను చేపడతారనే సంగతి తెలిసిందే. నియమ నిష్టలతో అమ్మవారిని పూజించడానికి భవానీ దీక్షను తీసుకుంటారు. మండల, అర్ధ మండల దీక్ష చేపట్టి.. తమ భవానీ దీక్ష విరమణ కోసం ఇంద్రకీలాద్రికి చేరుకుంటారు.
2024 సంవత్సరం మొదటి రోజున సీమా హైదర్ మళ్లీ వార్తల్లో నిలిచింది. ఈసారి సీమా తమకు సంబంధించి గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది సచిన్ బిడ్డకు సీమా హైదర్ తల్లి కాబోతోంది. ఓ ప్రైవేట్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సీమా, సచిన్ ఈ విషయాన్ని వెల్లడించారు. త్వరలోనే శుభవార్త అందిస్తాం’’ అని సీమా హైదర్ అన్నారు. పాకిస్థాన్ నుంచి భారత్‌కు పారిపోయి వచ్చిన సీమకు ఇది ఐదవ సంతానం. అంతకు ముందు.. ఆమెకు తన మొదటి…
రేపు(మంగళవారం) మున్సిపల్ కార్మిక సంఘాలను ఏపీ ప్రభుత్వం మరోసారి చర్చలకు పిలిచింది. రేపు మధ్యాహ్నం 12 గంటలకు కార్మిక సంఘాలతో మంత్రులు భేటీ కానున్నారు. ఏపీ సచివాలయంలో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఆదిమూలపు సురేష్ నేతృత్వంలో చర్చలు జరగనున్నాయి.
ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజినీకి చెందిన గుంటూరు కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు 30 మందిని అరెస్ట్ చేశారు. నిందితులను వైద్య పరీక్షల అనంతరం కోర్టుకు తరలించారు. మంత్రి కార్యాలయంపై దాడి చేసిన వారు టీడీపీ-జనసేన కార్యకర్తలు అని పోలీసులు తెలిపారు.
బంగ్లాదేశ్‌కు చెందిన నోబెల్ గ్రహీత ఆర్థికవేత్త డాక్టర్ ముహమ్మద్ యూనస్‌కు న్యాయస్థానం సోమవారం ఆరు నెలల జైలు శిక్ష విధించింది. యూనస్ మద్దతుదారులు ఈ సంఘటనను "రాజకీయ ప్రేరణ"గా అభివర్ణించారు. ఇదిలా ఉంటే.. 83 ఏళ్ల ఆర్థికవేత్త ముహమ్మద్ యూనస్ తన పేదరిక వ్యతిరేక ప్రచారానికి 2006లో నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకున్నారు. ఈ ప్రచారం బంగ్లాదేశ్‌కు 1983లో స్థాపించిన గ్రామీణ బ్యాంకు ద్వారా మైక్రోక్రెడిట్‌కు నిలయంగా పేరు తెచ్చుకుంది.
పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లో ఉన్న కిష్త్వార్ జిల్లాకు చెందిన 23 మంది ఉగ్రవాదులను పరారీలో ఉన్న నేరస్థులుగా ప్రకటించింది జమ్మూ కాశ్మీర్ కోర్టు. అందుకు సంబంధించి పోలీసులు సమాచారం ఇచ్చారు. దోడాలోని ప్రత్యేక UAPA (చట్టవిరుద్ధమైన కార్యకలాపాల నిరోధక చట్టం) కోర్టు ఈ ఉగ్రవాదులపై నమోదైన కేసులకు సంబంధించి తమ ముందు హాజరు కావడానికి ఒక నెల సమయం ఇచ్చిందని, లేకపోతే వారి ఆస్తులను అటాచ్ చేస్తామని అధికారులు తెలిపారు.