Singareni CMD Balaram : లక్ష్య సాధనకు సమష్టిగా ముందుకెళ్దాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సింగరేణి కాలరీస్ ఈ ఏడాది నిర్దేశించుకున్న 70 మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్య సాధనలో ప్రతీ రోజూ విలువైనదేనని.. ఇందుకోసం ప్రతీ ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని సంస్థ ఛైర్మన్ మరియు ఎండీ ఎన్. బలరామ్ స్పష్టం చేశారు. దేశ ఇంధన అవసరాలు, రానున్న వేసవి కాలంలో థర్మల్ విద్యుత్ కేంద్రాల వద్ద 21 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉండేందుకు వీలుగా రోజుకు 2.24 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, రవాణా చేయాలని, రోజుకు 15 లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ ను తొలగించాలని ఆదేశించారు. సింగరేణి కాలరీస్ ఛైర్మన్ మరియు ఎండీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా అన్ని ఏరియాల జీఎంలతోపాటు వివిధ విభాగాల జీఎంలు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన ఉత్పత్తి, అడ్రియాలా లాంగ్ వాల్ ప్రాజెక్టు సహా కంటిన్యూయస్ మైనర్లు, సీహెచ్పీలపై సమీక్ష చేయడంతోపాటు సంస్థ పురోభివృద్ధిపై దిశా నిర్దేశం చేశారు.
అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ఈ ఏడాది మొదటి 9 నెలల కాలంలో బొగ్గు ఉత్పత్తి, రవాణా, ఓవర్ బర్డెన్ తొలగింపు ఆశాజనకంగా ఉన్నాయని పేర్కొన్నారు. గత ఏడాదితో పోల్చితే బొగ్గు ఉత్పత్తిలో 5.15 శాతం వృద్ధితో 49.66 మిలియన్ టన్నులు, రవాణాలో 8 శాతం వృద్ధి తో 51 మిలియన్ టన్నులు, ఓవర్ బర్డెన్ తొలగింపులో 6 శాతం వృద్ధితో 306.6 మిలియన్ క్యూబిక్ మీటర్ల మేరకు లక్ష్యాలను సాధించినట్లు తెలిపారు. ఇదే స్ఫూర్తితో రానున్న మూడు నెలల్లోనూ సమష్టిగా లక్ష్య సాధనకు కృషి చేయాలన్నారు. ఒక జట్టుగా ముందుకు సాగాలని, ప్రతీ ఒక్కరి పనితీరును పరిశీలిస్తానన్నారు. అలాగే నూతన ప్రాజెక్టులను ప్రారంభించడంలో ఎదురవుతున్న అవాంతరాలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి భూ సేకరణ, ఇతర అనుమతులపై ప్రత్యేక చొరవ తీసుకుంటానన్నారు.
సింగరేణి సంస్థ ఒడిశాలోని నైనీలో చేపట్టిన బొగ్గు బ్లాక్ నుంచి ఉత్పత్తిని సాధ్యమైనంత త్వరగా ప్రారంభించేందుకు ఆ రాష్ట్ర ఉన్నతాధికారులతో మాట్లాడతానని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు విషయంలో ఒడిశా రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి శ్రీ భట్టి విక్రమార్క పేర్కొన్నారని, త్వరలో ఆయన నేతృత్వంలో సింగరేణి ఉన్నతాధికారుల బృందం ఆ రాష్ట్రంలో పర్యటిస్తుందని వెల్లడించారు.
Also Read
- SIR row: CEC జ్ఞానేశ్ కుమార్‌పై అభిశంసన తీర్మానం.!
- Trump-Jinping: జిన్‌పింగ్‌కు ట్రంప్ దంపతులు స్వాగతం పలకడం వెనుక ఇంత మతలబు ఉందా?
- Fuel Prices: రోజుకు రూ. 530 కోట్ల నష్టాల్లో ఆయిల్ కంపెనీలు.. పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రం కీలక నిర్ణయం
- Afghanistan: ‘ఇన్షా అల్లాహ్.. తగిన సమాధానం ఇస్తాం’.. పాక్‌కు తాలిబన్ల హెచ్చరిక
పని సంస్కృతిని మరింత మెరుగు పరచాలి..
సింగరేణిని దేశంలోనే అగ్రస్థాయి కంపెనీగా నిలపడంలో ప్రతీ ఒక్క ఉద్యోగి, అధికారి తమవంతు బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాల్సి ఉంటుందని సీఎండీ శ్రీ ఎన్.బలరామ్ అన్నారు. . సింగరేణి పని సంస్కృతిని మరింత పెంచేందుకు అందరూ కృషి చేయాలన్నారు. సృజనాత్మకంగా పనిచేసే ప్రతీ ఒక్కరి ప్రతిభను గుర్తిస్తామని పేర్కొన్నారు. నూతన సాంకేతికతను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటూ ఉత్పత్తి, ఉత్పాదకతను పెంచాలన్నారు. సింగరేణిలో అనుభవజ్ఞులైన జీఎంలు ఒకేసారిగా పెద్ద సంఖ్యలో రిటైర్ అవుతున్నారని, ఈ నేపథ్యంలో యువ అధికారులను ప్రోత్సహించి సంస్థ భవిష్యత్కు బలమైన పునాదులు వేయాలన్నారు.
సమీక్షా సమావేశంలో సంస్థ డైరెక్టర్లు శ్రీ డి.సత్యనారాయణరావు(ఈ అండ్ ఎం), శ్రీ ఎన్.వి.కె.శ్రీనివాస్(ఆపరేషన్స్), శ్రీ జి.వెంకటేశ్వరరెడ్డి(ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్), ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(కోల్ మూమెంట్) శ్రీ జె.అల్విన్, జీఎం(కో ఆర్డినేషన్) శ్రీ ఎం.సురేశ్, జీం(సీపీపీ) శ్రీ జక్కం రమేశ్, జీఎం(ఎంపీ) శ్రీ మల్లెల సుబ్బారావు, జీఎం(మార్కెటింగ్) శ్రీ జి.దేవేందర్, జీఎం(సివిల్) శ్రీ సూర్యనారాయణ, అన్ని ఏరియాల జీఎంలు, కార్పోరేట్ జీఎంలు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
SIR row: CEC జ్ఞానేశ్ కుమార్‌పై అభిశంసన తీర్మానం.!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Trump-Jinping: జిన్‌పింగ్‌కు ట్రంప్ దంపతులు స్వాగతం పలకడం వెనుక ఇంత మతలబు ఉందా?
-
Fuel Prices: రోజుకు రూ. 530 కోట్ల నష్టాల్లో ఆయిల్ కంపెనీలు.. పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రం కీలక నిర్ణయం
-
Faria :దళపతి విజయ్ వారసుడు ‘ఫ్యూచర్ సీఎం’ .. సంజయ్‌పై నటి ఫరియా అబ్దుల్లా క్రేజీ కామెంట్స్!
ట్రెండింగ్
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!