రోహిత్ శర్మ కెప్టెన్సీలో చారిత్రాత్మక విజయం.. సిరీస్ సమం ఇప్పటి వరకు ఏ ఆసియా జట్టు చేయలేని పనిని భారత జట్టు చేసింది. కేప్టౌన్లో టెస్టు మ్యాచ్ గెలిచిన తొలి జట్టుగా రికార్డులకెక్కడంతో పాటు రోహిత్ శర్మ తొలి కెప్టెన్గా కూడా నిలిచాడు. దక్షిణాఫ్రికాను తొలి ఇన్నింగ్స్లో 55 పరుగులకు ఆలౌట్ చేసిన భారత జట్టు, రెండో ఇన్నింగ్స్లో 176 పరుగులకు ఆలౌట్ చేసింది. తొలి ఇన్నింగ్స్లో మహ్మద్ సిరాజ్ 6 వికెట్లు తీయగా, రెండో ఇన్నింగ్స్లో…
పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖపై మంత్రి సీతక్క సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్ర్తీ, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ద్వారా చేపడుతున్న కార్యక్రమాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రికి తెలియజేసారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ అందరం కలిసి పనిచేస్తూ శాఖను బలోపేతం చేయాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లోని అణగారిన ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందజేయడంలో, వారి జీవన ప్రమాణాలు పెంపొందించడంలో గ్రామీణ రహదారులు కీలక పాత్ర పోషిస్తాయని మంత్రి అన్నారు. ఈ రోడ్ల నిర్మాణంలో…
రాష్ట్ర విద్యాశాఖ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం హైదరాబాద్ లోని రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ సంస్థ (State Council for Education Research and Training) కార్యాలయం లో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు విద్యా పరిశోధన, శిక్షణ లో సంస్కరణలు తేవాలన్నారు. విద్యా శిక్షణ, పరిశోధన సంస్థ ప్రమాణాలు ఉన్నత స్థాయిలో ఉండాలన్నారు. ఉపాధ్యాయుల గౌరవాన్ని పెంచేలా మంచి శిక్షణ, పరిశోధన కేంద్రంగా…
ముఖ్యమంత్రి జగన్ మాటే తమకు వేదమని, ఆయన ఆదేశాలు సిరసావహిస్తామని కోడమూరు ఎమ్మెల్యే సుధాకర్ అన్నారు. జగన్ హీరోయిజం చూసి రాజకీయాల్లోకి వచ్చానని ఎమ్మెల్యే వెల్లడించారు.
2023 అక్టోబర్ 21న కాళేశ్వరంకు చెందిన మేడిగడ్డ ప్రాజెక్టు ఏడవ బ్లాక్లోని 19-21 పియర్స్ కుంగిపోయాయన్నారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. అదే సమయంలో అన్నారం ప్రాజెక్టు ముందుభాగంలో కూడా బుంగపడి నీరు బయటకు వచ్చిందని, ఈ రెండు ప్రమాద ఘటనలతో అత్యంత ప్రతిష్టాత్మకమైన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై రాష్ట్రంలో సర్వత్రా అనేక అనుమానాలు, ఆందోళనలు వ్యక్తమయ్యాయన్నారు తమ్మినేని వీరభద్రం. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం అవకతవకలపై న్యాయ విచారణకు…
రాజకీయ మనుగడ కోసమే షర్మిల కాంగ్రెస్లో చేరారని మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ రిజెక్టెడ్ పార్టీ, ఏపీకి ద్రోహం చేసిన పార్టీ అంటూ ఆయన తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ తిరిగి కోలుకునే పరిస్థితి ఏపీలో లేదన్నారు.
15,644 పోలీసు కానిస్టేబుల్ ఖాళీల భర్తీకి ఎంపిక ప్రక్రియను నాలుగు వారాల్లోగా ప్రారంభించాలని, త్వరితగతిన ఎంపికలు పూర్తి చేయాలని తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు రిక్రూట్మెంట్ బోర్డును హైకోర్టు డివిజన్ బెంచ్ గురువారం ఆదేశించింది. జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి మరియు జస్టిస్ ఎన్. రాజేశ్వర్ రావుతో కూడిన ధర్మాసనం, ‘తప్పు ప్రశ్నల’ వివాదాన్ని తొలగించాలని కోరిన స్వతంత్ర నిపుణుల సంఘానికి మళ్లీ సూచించింది. స్వతంత్ర నిపుణుల సంఘం నుంచి రెండో అభిప్రాయాన్ని తీసుకున్న తర్వాతే ఎంపిక…
ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరితో జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ భేటీ అయ్యారు. పొత్తులపై ఏపీ బీజేపీ నేతల అభిప్రాయ సేకరణ జరిగిన కొద్ది సేపటికే పురందేశ్వరి-నాదెండ్ల భేటీ కావడం గమనార్హం.
ఏపీలో ఎన్నికల రాజకీయాలు వేడెక్కాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీ వేగంగా పావులు కదుపుతోంది. ఏపీలో బీజేపీ నేడు కీలక సమావేశం నిర్వహించింది. సార్వత్రిక ఎన్నికల యోజన భైఠక్ పేరుతో జరిగిన కీలక భేటీలో.. ఎన్నికల్లో పొత్తులు, ఎన్నికల వ్యూహంపై చర్చించారు.
అధికారం పోయిందనే అక్కసు.. బీఆర్ఎస్లో కనిపిస్తుందన్నారు మంత్రి సీతక్క. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. గడిలా పాలన కాదు..గల్లీ బిడ్డల పాలన కావాలని ప్రజలు కోరుకున్నారని, ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేయించడానికే 35 రోజులు తీసుకుంది బీఆర్ఎస్ ప్రభుత్వమన్నారు. ప్రజలు ధైర్యంగా ఉన్నారని, ధైర్యం కోల్పోయింది బీఆర్ఎస్ నేతలేనని ఆమె విమర్శించారు. ప్రమాణ స్వీకారం చేసింది డిసెంబరు 7న అని, 9వ తేదీనే రెండు పథకాలు అమలు చేశామన్నారు మంత్రి సీతక్క. ఒకే సారి రుణమాఫీ అన్నారు..…