డీఎంకే నేత, పల్లవరం ఎమ్మెల్యే ఐ.కరుణానిధి కోడలుపై పనిమనిషి పోలీసులకు ఫిర్యాదు చేసింది. 18 ఏళ్ల పని మనిషి చెన్నైలోని ఎమ్మెల్యే కోడలు దగ్గర పని చేస్తుంది. అయితే తనను వేధింపులకు గురి చేసిందని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ పని మనిషి తమిళనాడులోని కళ్లకురిచ్చి జిల్లా ఉలుందూర్‌పేటకు చెందినదిగా గుర్తించారు. తనను ఎమ్మెల్యే కోడలు మార్లీనా పదే పదే వేధించిందని, అంతేకాకుండా కొన్నిసార్లు కొట్టేదని ఉలుందూరుపేట పోలీసులకు తెలిపింది.
రాష్ట్రంలోని 50 ఐటీఐలలో అధునాతన సాంకేతిక నైపుణ్య శిక్షణ కేంద్రాల (స్కిల్లింగ్ సెంటర్లు) ఏర్పాటుకు టాటా గ్రూప్ కంపెనీ ఒప్పందం చేసుకుంది. వీటిలో కొత్త కోర్సులు, మాస్టర్ ట్రైనర్ల నియామకానికి రూ.1500 కోట్ల పెట్టబడులు పెట్టనుంది. దావోస్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సదస్సులో టాటా సన్స్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. ఇప్పటికే వివిధ రంగాల్లో విస్తరించిన టాటా గ్రూప్ తెలంగాణలో చేపట్టబోయే భవిష్యత్తు వ్యాపార ప్రణాళికలపై చర్చించారు. ఐటీ…
రామ మందిరంపై స్మారక తపాలా స్టాంపును ప్రధాని నరేంద్ర మోదీ గురువారం విడుదల చేశారు. దాంతో పాటు.. ప్రపంచవ్యాప్తంగా శ్రీరాముడిపై విడుదల చేసిన స్టాంపుల పుస్తకాన్ని కూడా ప్రారంభించారు. తపాలా స్టాంపు రూపకల్పనలో రామాలయం, చౌపాయి 'మంగల్ భవన్ అమంగల్ హరి', సూర్య, సరయూ నది, ఆలయం చుట్టూ ఉన్న విగ్రహాలు ఉన్నాయి. ఇవి.. భారతదేశం, అమెరికాతో సహా మొత్తం 21 దేశాలలో విడుదలయ్యాయి.
జల్లికట్టు ఎద్దుకు బలవంతంగా తినిపిస్తున్నట్లు చూపించిన వీడియోపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. అంతేాకాకుండా ఆ వీడియోను పోస్ట్ చేసిన యూట్యూబర్‌పై తమిళనాడు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వీడియోను సేలం జిల్లా చిన్నప్పంపట్టిలో చిత్రీకరించారు. కాగా ఈ వీడియోలో ఒక ఎద్దుకు నోటిలో కోడిని పెట్టి నమలమని బలవంతం చేశారు. అంతేకాకుండా.. ముగ్గురు వ్యక్తులు ఎద్దును గట్టిగా పట్టుకోగా, ఒకరు కోడిని నోటిలో పెట్టడం లాంటివి చేశారు.
ఏది ఏమైనా సరే… ఈ నెల 31వ తేదీలోగా గత ఏడాది వానాకాలం సీజన్‌కు సంబంధించిన కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)ను మిల్లర్ల నుంచి పూర్తిస్థాయిలో సేకరించేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకో వాలని పౌరసరఫరాల శాఖ కమీషనర్ డి.ఎస్.చౌహాన్ అధికారులను ఆదేశించారు. రైసు మిల్లర్ల నుంచి బియ్యాన్ని సేకరించి ఎఫ్ సిఐకి అప్పగించడానికి కేవలం 13 రోజుల సమయం మాత్రమే ఉందని ఈ సమయంలో అందరం సమిష్టిగా, సమన్వయంతో పనిచేసి లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. కస్టమ్ మిల్లింగ్ రైస్,…
బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధులు, జిల్లా అధికార ప్రతినిధులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ వర్క్ షాప్ కి కేంద్ర మంత్రి జ్యోతి రాదిత్య సింధియా హజరయ్యారు. ఈ సందర్భంగా పలు జిల్లాల బీజేపీ అధ్యక్షుల మార్పులు జరిగాయి. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మాట్లాడుతూ.. పదేళ్లలో మోడీ నేతృత్వంలో సివిల్ ఏవియేషన్ లో ఎన్నో మార్పులు వచ్చాయన్నారు. సామాన్య వ్యక్తి విమానాల్లో ప్రయాణిస్తున్నాడని, 76 కొత్త ఎయిర్ పోర్టులు నిర్మించామన్నారు. అంతేకాకుండా.. 570…
బుధవారం పాట్నా నుంచి పుణె వెళ్లే ఇండిగో విమానం టేకాఫ్‌కు సిద్ధంగా ఉంది. ఇంతలో తన అమ్మమ్మ చనిపోయిందని పైలట్‌కు సమాచారం అందింది. అమ్మమ్మ మృతితో మనస్తాపానికి గురైన పైలట్ విమానాన్ని నడపలేదు. దీని తర్వాత విమానయాన సంస్థ ప్రత్యామ్నాయ సిబ్బందిని పిలిచింది. ఈ క్రమంలో విమానం దాదాపు మూడు గంటల తర్వాత ఆలస్యంగా బయలు దేరింది.
ఇటీవల గుండెపోటు మరణాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. పెద్ద, చిన్న అని తేడా లేకుండా గుండెపోటుతో మరణిస్తున్నారు. తాజాగా.. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో కోచింగ్ క్లాస్‌లో 18 ఏళ్ల విద్యార్థి గుండెపోటుతో మరణించాడు. ఈ హృదయ విదారకమైన సంఘటన బుధవారం జరిగింది. మృతి చెందిన విద్యార్థి మాధవ్ గా గుర్తించారు. అయితే.. క్లాస్ మధ్యలో ఛాతిలో నొప్పిరావడంతో కుప్పకూలిపోయాడు. గమనించిన తోటి విద్యార్థులు ఆస్పత్రికి తరలించగా.. యువకుడు మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటన అక్కడ ఏర్పాటు చేసిన సీసీటీవీలో…
రాత్రులు తిరగటం సిగరెట్లు కాలుస్తూ ఊరంతా బలాదూర్‌గా తిరగటం చేస్తున్న యువత. యువతను సరైన దారిలో పెట్టాల్సిన బాధ్యత సమాజం పని. ఇలాంటి కోవలో హైదరాబాద్ పాతబస్తీ కి చెందిన అయిదుగురు యువకులు అందులో ఇద్దరు మైనర్లు కలిసి ద్విచక్ర వాహనాలను దొంగలించటం వాటిని విక్రయించి వచ్చిన డబ్బులతో జల్సాలు చేయటం వీరి పని. చాంద్రాయగుట్ట పోలీసులు వాహనాల తనిఖీల సమయంలో అనుమానస్పదంగా ఉన్న మైనర్ బాలుడిన్ని అదుపులోకి తీసుకొని విచారించగా.. మొత్తం చైన్ బయట పడ్డది.…
చలికాలంలో ఆరోగ్య సంబంధిత సమస్యలు పెరుగుతాయి. ఉష్ణోగ్రత తగ్గడం వల్ల మన శరీరంలో జరిగే మార్పుల వల్ల ఇది సాధారణంగా జరుగుతుంది. చలి కారణంగా, శరీర ఉష్ణోగ్రతను నిర్వహించడానికి మన ధమనులు సంకోచించబడతాయి, దీనిని వాసోకాన్స్ట్రిక్షన్ అంటారు. దీని కారణంగా రక్త ప్రసరణలో సమస్యలు ఉండవచ్చు