జనవరి 22న రామ విగ్రహ ప్రాణ ప్రతిష్ట సందర్భంగా.. అయోధ్యలో భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రాణ ప్రతిష్టకు ఆహ్వానించిన వీవీఐపీల భద్రత కోసం 45 ప్రత్యేక బృందాలు గస్తీ కాస్తోంది. ప్రధాని మోదీ, పలువురు ప్రముఖులు రాక సందర్భంగా ముందే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అయోధ్య చేరుకుంది. ఈ క్రమంలో ఈరోజు సాయంత్రం నుంచి ఆలయంలోకి సామాన్య భక్తులను ఎవరిని అనుమతించరు. ప్రాణ ప్రతిష్ట జరిగిన మరుసటి రోజు నుంచి భక్తులకు రాముడి దర్శనం ఉంటుందని…
అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం సందర్భంగా ఈనెల 22న సెలవు ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బండి సంజయ్ కోరారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు సెలవు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. శ్రీరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం కోసం ప్రపంచమంతా ఎదురు చూస్తోందని, దైవ కార్యాన్ని రాజకీయం చేయొద్దన్నారు. రాముడు BJPకి మాత్రమే దేవుడు కాదని, ఈ అంశాన్ని తమ పార్టీకి ఆపాదించి వివాదాస్పదం చేయొద్దని అన్నారు. తాజాగా- బీజేపీ రాష్ట్రశాఖ మాజీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ ఈ కార్యక్రమంలో…
పీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు కూడా శరవేగంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా, కీలక నేతలు తమ పట్టును నిలబెట్టుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఇందులోభాగంగా, ఇతర పార్టీల్లో చేరేందుకు అమితాసక్తి చూపుతున్నారు.
ప్రధాని మోదీ శుక్రవారం మహారాష్ట్రలోని షోలాపూర్ లో పర్యటించారు. అక్కడ.. ప్రధానమంత్రి ఆవాస్ యోజన-అర్బన్ పథకం కింద పేద ప్రజలకు ఆయన చేతుల మీదుగా ఇళ్లను అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. దేశంలోనే పీఎం ఆవాస్ యోజన కింద నిర్మించిన అతిపెద్ద సొసైటీని నేడు ప్రారంభించామని తెలిపారు. 2014లో హామీ ఇచ్చానని.. ఆ వాగ్దానం నెరవేరడం, దాన్ని చూడటానికి రావడం.. ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. మరోవైపు.. ఈ ఇళ్లను చూడగానే తనకు బాల్యం గుర్తొచ్చిందని పేర్కొన్నారు. చిన్నతనంలో…
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని పవన్‌కళ్యాణ్ నివాసంలో ఈ భేటీ జరిగింది. వైసీపీకి రాజీనామా చేసిన బాలశౌరి జనసేనలో చేరనున్నట్లు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.
స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కేసు విచారణ జరిగింది. చంద్రబాబుకు స్కిల్ కేసులో ఏపీ హైకోర్టు ఇచ్చిన బెయిల్ ను సుప్రీం కోర్టులో సవాలు చేసింది ప్రభుత్వం. ఈ క్రమంలో విచారణ చేపట్టగా, ధర్మాసనం ఫిబ్రవరి 12కు వాయిదా వేసింది. అంతేకాకుండా.. కౌంటర్ దాఖలు చేసేందుకు బాబు తరపు న్యాయవాదులు సమయం కోరారు. దీంతో కేసును వాయిదా వేశారు. ఇదిలా ఉంటే.. ఈ కేసులో జస్టిస్ బేలా ఎం త్రివేదీ,…
కేశినేని నానిపై టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తీవ్ర విమర్శలు చేశారు. కేశినేని నాని పార్టీ మారి ఇష్టం వచ్చినట్లు మాట్లడటం సరికాదని మండిపడ్డారు. అవినాష్ తో కలిసి తన మీద రెండుసార్లు కామెంట్ చేశారని ఆరోపించారు. టీడీపీలో ఉన్నపుడు చంద్రబాబు, లోకేష్ గురించి నాని మాట్లాడితే తాను ఖండించే వాడినని తెలిపారు. తాను సమర్థుడు కాదని కేశినేని నానీ అంటున్నారు.. సమర్థుడు అంటే పార్టీలు మారడమా అని విమర్శించారు. తాను అనేక మార్లు ఎమ్మెల్యే, ఎంపీగా…
ఎన్విరాన్మెంట్ మేనేజ్ మెంట్ యాప్స్‌ను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తమ చేతుల మీదుగా లాంఛ్ చేశారు. నాలుగు ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ యాప్స్‌ను మంత్రి ఆవిష్కరించారు.
ప్రజలపై భారం మోపకుండ అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు ప్రత్యామ్నాయ వనరుల సమీకరణపై దృష్టి సారించి రాష్ట్ర అభివృద్ధికి పాటుపడుదామని డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క అన్నారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి 2024-25 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి వార్షిక బడ్జెట్ ప్రతిపాదనల తయారీపై రెవెన్యూ, గృహ నిర్మాణం, ఐ అండ్ పిఆర్, ఉన్నత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆస్తులు సృష్టించి, సృష్టించిన ఆస్తులతో వచ్చిన ఆదాయం…
గుజరాత్‌లోని వడోదర హర్ని సరస్సులో పడవ బోల్తా పడిన ఘటనలో మృతుల సంఖ్య 16కు చేరింది. అందులో 14 మంది చిన్నారులతో పాటు ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నారు. పడవలో మొత్తం 27 మంది విద్యార్థులు ప్రయాణిస్తున్నారని, వారిలో ఎవరూ లైఫ్ జాకెట్లు ధరించకపోవడం వల్ల ప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు అంటున్నారు. విహారయాత్ర కోసమని పాఠశాల విద్యార్థులు ఇక్కడికి వచ్చారు. ఈ ఘటనలో అగ్నిమాపక సిబ్బంది ఇప్పటి వరకు ఏడుగురు విద్యార్థులను రక్షించగా, తప్పిపోయిన వారికోసం గాలింపు…