ఏపీలో విధుల్లో చేరని అంగన్వాడీల తొలగింపునకు ప్రభుత్వం రంగం సిద్దం చేస్తోంది. జిల్లాల్లో అంగన్వాడీల టెర్మినేషన్ ఆర్డర్ల జారీకి సర్కారు ఆదేశాలు ఇచ్చింది. దాదాపు 80 వేల మందికి పైగా అంగన్వాడీల టెర్మినేషన్కు ఏపీ ప్రభుత్వం సిద్దమవుతోంది. సోమవారం ఉదయం 9.30 గంటలలోపు విధుల్లో చేరనివారిని తొలగించాలని ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది.
ఎమ్మెల్సీలుగా మహేష్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్ లు ఏకగ్రీవ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నేడు మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో ఎమ్మెల్సీ ఎన్నిక ధ్రువీకర పత్రం తీసుకున్నారు వెంకట్..మహేష్ గౌడ్. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. మహేష్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్ ఏకగ్రీవంగా ఎమ్మెల్సీలు కావడం సంతోషంగా ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మహేష్ కుమార్ గౌడ్ ఎలాంటి పదవి ఆశించకుండా పార్టీ గెలుపుకోసం కృషి చేశాడని, బల్మూరి వెంకట్…
అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఈరోజు తాను భావోద్వేగానికి గురయ్యానని.. ప్రాణప్రతిష్ఠ వేడుకల్లో తన కళ్ల నుంచి నీళ్ళు వచ్చాయని అన్నారు. రామాలయ ప్రారంభోత్సవం దేశంలో ఐక్యతను మరింతగా పెంచిందని తెలిపారు. అయోధ్యలో రాముడి మందిరం కోసం కొన్ని తరాలుగా, కొన్ని శతాబ్దాలుగా పోరాటాలు జరుగుతున్నాయని, ఇప్పుడు వారందరికీ ఆశయం నెరవేరిందని తెలిపారు. ఇది ఒక రకంగా దేశాన్ని మరింత బలోపేతం…
రేపటి నుంచి నీల మేఘ శ్యాముడు భక్త జన కోటికి దర్శనం ఇవ్వనున్నారు. మంగళవారం నుంచి సామాన్య భక్తులకు బాలరాముడు దర్శనం ఇవ్వనున్నారు. బాలరాముడి దర్శించుకునేందుకు ఆలయ ట్రస్ట్ రెండు స్లాట్స్ ఖరారు చేసింది. ఉదయం 7 గంటల నుంచి 11: 30 గంటల వరకు.. మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 7 గంటల వరకు దర్శనం చేసుకునేందుకు అనుమతించనున్నారు.
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సన్నద్ధతపై సచివాలయంలో సీఎస్ జవహర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. జనవరి 31వ తేదీలోగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల విధులతో సంబంధం ఉన్న అధికారులు, సిబ్బంది బదిలీలపై సమీక్ష చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్లో 2024 ఓటర్ల తుది జాబితాను జిల్లాల వారీగా కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. జిల్లాల వారీగా 2024 తుది ఓటర్ల జాబితాలను సీఈఓ ఆంధ్రా వెబ్ సైట్లో అందుబాటులోకి తీసుకొచ్చిట్లు పేర్కొంది.
2018లో ధరణి సర్క్యులర్, 2020లో చట్టం తీసుకు వచ్చారని, తర్వాత మంత్రుల కమిటీ కూడా వేశారన్నారు ధరణి కమిటీ సభ్యులు కోదండ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సమస్య పరిష్కారం కాకపోగా ఒకదాని కు మరొదనికి సంబందం లేదని, ధరణి చట్టంలోనే చాలా లోపాలు ఉన్నాయన్నారు. భూమి హక్కు విషయంలో గతంలో సమర్థవంతంగా ఉన్నాయని, 2014 నుంచి ఇప్పటి వరకు రెవెన్యూ హక్కు హరించి పోయిందన్నారు. రెవెన్యూ వ్యవస్థలో చిన్న చిన్న ఇబ్బందులు తప్ప గతంలో…
అయోధ్యలో అపురూప రామ మందిరం ఆవిష్కృతమైంది. జయజయ ధ్వానాల మధ్య బాలరాముడు ఆలయంలో కొలువుదీరారు. ప్రధాని మోడీ చేతుల మీదుగా అభిజిత్ లఘ్నంలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా కొనసాగింది. కాగా.. రామమందిర ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించిన బీజేపీ సీనియర్ నేతలు ఉమాభారతి, సాధ్వి రితంభరరు రామ మందిర ప్రాంగణంలో కలుసుకున్నారు. అంతేకాదు.. మందిర ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే భావోద్వేగానికి గురయ్యారు. తమ కల నిజమైందని భావోద్వేగంతో కౌగిలించుకున్నారు. కాగా.. వారు భావోద్వేగానికి లోనైన ఫొటోలు సోషల్…
అయోధ్యలోని రామ్లల్లా విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ మహోత్సవానికి దేశ నలుమూలల నుంచి వేలాది మంది ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. "మేము గాంధీ రాముడిని పూజిస్తాము, బీజేపీకి చెందిన రాముడిని కాదు" అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
‘రామ్ కే నామ్’ డాక్యుమెంటరీని ప్రదర్శించినందుకు ముగ్గురిని అరెస్ట్ చేసిన తెలంగాణ పోలీసులపై ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. రామ్కే నామ్ డాక్యుమెంటరీ ప్రదర్శనను మధ్యలోనే ఎందుకు నిలిపివేసి ముగ్గురిని అరెస్టు చేశారో వివరించాలని రాచకొండ పోలీస్ కమిషనర్ను హైదరాబాద్ ఎంపీ కోరారు. “అవార్డ్ విన్నింగ్ డాక్యుమెంటరీని ప్రదర్శించడం ఎలా నేరం? అలా అయితే, సినిమాకు అవార్డు ఇచ్చినందుకు భారత ప్రభుత్వం & ఫిల్మ్ఫేర్ను కూడా జైలులో పెట్టాలి. సినిమా చూసే ముందు పోలీసుల నుంచి…