విశాఖలో 14వ ఆల్ ఇండియా పోలీస్ కమాండో పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీలను నిర్వహించడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు. తన కెరియర్ కూడా గ్రేహౌండ్స్ నుండే ప్రారంభమైందని సీపీ రవిశంకర్ వెల్లడించారు.
500 సంవత్సరాల హిందువుల కల నెరవేరిందని అన్నారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. అన్ని దారులూ రామ మందిరం వైపే చూపిస్తున్నాయని తెలిపారు. మనం త్రేతాయుగంలోకి వచ్చినట్లుంది.. ఈ క్షణం కోసం 500 ఏళ్లుగా ఎదురు చూశామని ఆయన చెప్పారు. ప్రాణ ప్రాతిష్ఠకు హాజరైన వారి జీవితం ధన్యమైందని పేర్కొన్నారు. అనుకున్న చోటే రామాలయం నిర్మించాం.. అయోధ్యకు పూర్వ వైభవం వచ్చిందని సీఎం యోగి తెలిపారు. బాలరాముడి రూపాన్ని చెక్కిన శిల్పి జీవితం ధన్యమైందని అన్నారు.
యాగగిరిగుట్ట మండలం మల్లాపురంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని సోమవారం తెల్లవారుజామున 2 గంటలకు రెవెన్యూ అధికారులు పోలీసుల సహకారంతో కూల్చివేశారు. 100 మంది పోలీసులతో పాటు రెవెన్యూ అధికారులు అర్ధరాత్రి దాటిన తర్వాత బీఆర్ఎస్ కార్యాలయానికి చేరుకుని బుల్డోజర్తో కూల్చివేశారు. ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తూ బీఆర్ఎస్ యాదగిరిగుట్ట మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య మాట్లాడుతూ రెండేళ్ల క్రితం మల్లాపురంలో 150 గజాల్లో పార్టీ మండల కార్యాలయాన్ని నిర్మించారన్నారు. తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే దేవాదాయ శాఖ…
శ్రీరామచంద్రమూర్తికి జై అంటూ ప్రధాని ప్రసంగం ప్రారంభించారు. ఎన్నో ఏళ్లుగా నిరిక్షిస్తున్న రాముడు వచ్చేశాడు.. ఈ క్షణం ఎంతో ప్రత్యేకమన్నారు. మన రామ్‌లల్లా ఇప్పటి నుంచి టెంట్ లో ఉండడు.. దివ్యమందిరంలో ఉంటాడు.. మీ అందరి ఆశీస్సుల వల్లే జరిగిందని మోడీ తెలిపారు. ఎన్నో ఏళ్ల పోరాటాలు, బలిదానాలు, నిష్ట తర్వాత అద్భుత ఘట్టం ఆవిష్కృతమైందని తెలిపారు. ఇది సామాన్యమైన సమయం కాదు.. కాలచక్రంలో ఎప్పటికి నిలిచిపోయే అద్భుత సమయమని పేర్కొన్నారు. ఎక్కడ రాముడి కార్యక్రమం జరుగుతుందో..…
పాకిస్థాన్ లో దేశవ్యాప్త ఎన్నికలకు ముందు ఇమ్రాన్ ఖాన్ కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) అభ్యర్థి మెహర్ ముహమ్మద్ వాసిం పిఎంఎల్-ఎన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మర్యమ్ నవాజ్‌కు అనుకూలంగా ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు.
నెల్లూరు జిల్లా నాయుడుపేటలో వైసీపీ సామాజిక సాధికార చైతన్య యాత్ర బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభలో వైసీపీ రీజినల్ కో ఆర్డినేటర్ విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో సూళ్లూరు పేట నుంచి వైసీపీ అభ్యర్థిగా సంజీవయ్యను పార్టీ నిర్ణయించిందని తెలిపారు. అత్యధిక మెజారిటీతో ఆయనను గెలిపించాలని ఆయన కోరారు. ఆయన గెలుపు కోసం అందరూ కలిసి పని చేయాలన్నారు.
ఐదు శతాబ్దాల కల నెరవేరబోతోంది. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. మరికొద్ది గంటల్లోనే జన్మభూమిలో రామయ్య కొలువుదీరబోతున్నాడు. 150కిపైగా దేశాల్లో నివసిస్తున్న హిందూ బంధువులంతా అయోధ్యలో మరికొద్ది గంటల్లో జరగబోయే శ్రీరామచంద్రుడి విగ్రహ ప్రాణ: ప్రతిష్ట కార్యక్రమ మహోత్సవాన్ని వీక్షించేందుకు బిలియన్ కన్నులతో ఆసక్తితో ఎదురు చూస్తున్నరు. ఆ క్షణం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కరీంనగర్ హిందూ బంధువులంతా మరి కొద్ది గంటల్లో తరలివచ్చేందుకు నగరంలోని చైతన్యపురి మహాశక్తి ఆలయం వేదిక…
రేపు (సోమవారం) అంగన్వాడీ కార్యకర్తలు చలో విజయవాడకు పిలుపునిచ్చారు. సుమారు 41 రోజుల నుంచి అంగన్వాడీలు రిలే నిరాహార దీక్షలు చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా.. గత ఐదు రోజులుగా విజయవాడలో అంగన్వాడీలు నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు ముందస్తు అరెస్ట్ లు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వామ పక్ష నేతలు, కార్మిక సంఘాల నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే సీపీఎం నేత బాబురావును హౌస్ అరెస్ట్ చేశారు. కాగా.. నగరంలోకి…
సీఎం రేవంత్ రెడ్డి లండన్ మాట్లాడిన మాటల్లో తప్పేముంది..? అని ప్రశ్నించారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాళోజి నారాయణ రావు మాటలను.. ప్రాంతం వాడు ద్రోహం చేస్తే అనే మాటలను బి. ఆర్. ఎస్ నేతలకు వర్తిస్తుంది ..అందుకే సీఎం మాట్లాడాడని ఆయన అన్నారు. కేసీఆర్ పదేళ్లు రాష్టాన్ని కమీషన్ లకు కక్కుర్తి పడి అప్పులకుప్పగా మార్చారని ఆయన మండిపడ్డారు. కాళేశ్వరం.. మీ ధన దాహానికి ప్రత్యక్ష ఉదాహరణ అని…
నెల్లూరు జిల్లా నాయుడుపేటలో వైసీపీ సామాజిక సాధికార చైతన్య యాత్ర బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగన్ వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాలకు అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు రాజకీయ పదవులను ఇచ్చారని తెలిపారు. మరోవైపు.. చంద్రబాబు ఎస్సీలను అవమానించారని, ఎస్సీలుగా ఎవరైనా పుడతారా అని అన్నారని పేర్కొన్నారు.