రామనగరి అయోధ్య నుంచి తిరిగివచ్చిన వెంటనే ప్రధాని నరేంద్ర మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ ప్రభుత్వం కోటి ఇళ్లకు సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఇందుకోసం ‘ప్రధానమంత్రి సూర్యోదయ యోజన’ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ప్రధాని మోదీ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలియజేశారు. కాగా.. ఈ పథకం కింద పేద, మధ్యతరగతి ప్రజల కరెంటు బిల్లు తగ్గుతుందని ప్రధాని మోదీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. దీనితో పాటు ఇంధన రంగంలో కూడా భారతదేశం స్వావలంబన సాధిస్తుందని తెలిపారు.
Read Also: ICC: ఐసీసీ టీ20 జట్టు ప్రకటన.. కోహ్లీ, రోహిత్ శర్మకు దక్కని చోటు
ఇదిలా ఉంటే.. శతాబ్దాలుగా ఎదురుచూస్తున్న మహోత్తర ఘట్టం ముగిసింది. అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ట జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ సమక్షంలో పవిత్రోత్సవం నిర్వహించారు. రామమందిరం ప్రాణ్ ప్రతిష్ఠా కార్యక్రమం ముగిసిన తర్వాత తన ట్వీట్ లో “ప్రపంచంలోని భక్తులందరూ ఎల్లప్పుడూ సూర్యవంశ భగవంతుడు శ్రీరాముని కాంతి నుండి శక్తిని పొందుతారు. ఈ రోజు అయోధ్యలో పవిత్ర ప్రతిష్ఠాపన సందర్భంగా.. భారతదేశంలోని ప్రజలు తమ ఇళ్ల పైకప్పుపై వారి స్వంత సోలార్ రూఫ్ టాప్ సిస్టమ్‌ను కలిగి ఉండాలనే నా సంకల్పం మరింత బలపడింది”. అని ప్రధాని మోదీ ట్వీట్‌లో తెలిపారు.