అయోధ్యలో సరయూ నది తీరాన దీపోత్సవం కన్నులపండగగా సాగింది. సరయూ నది తీరాన భక్తులు 14 లక్షల దీపాలు వెలిగించారు. దేశీయంగా తయారు చేసిన మట్టి ప్రమిదలతో దీపాలంకరణ చేశారు. అటు.. జనక్‌పూర్ ధామ్‌లోని జానకి ఆలయంలో కూడా దీపోత్సవం నిర్వహించారు. ఆ సమయంలోనే.. అయోధ్యలోని హనుమాన్‌గర్హి ఆలయంలో దీపోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
Read Also: Arun Yogiraj: భూమ్మీద అత్యంత అదృష్టవంతుడిని నేనే..
అయోధ్యలో రామ్‌లల్లా ప్రాణప్రతిష్ట సందర్భంగా నేడు దేశవ్యాప్తంగా దీపాలను వెలిగించారు. ఢిల్లీలోని ప్రధాని నివాసంలో దీపావళి తరహా సంబరాలు జరుపుకున్నారు. ప్రధాని నివాసం మొత్తం దీపాలతో వెలిగిపోయింది. ప్రధాని మోదీ కూడా దీపం వెలిగించారు. కాగా.. ఇటీవల, ప్రధాని మోదీ దేశ ప్రజలకు “ప్రాణ ప్రతిష్ట రోజు తమ తమ ఇళ్లలో రామజ్యోతిని వెలిగించాలని చెప్పారు. ఈ క్రమంలో.. దేశ వ్యాప్తంగా ఉన్న హిందువులు దీపాలను వెలిగించి రామభక్తిని చాటుకున్నారు.
Read Also: Ram Temple Inauguration: రామ మందిర ప్రారంభోత్సవం.. బిడ్డకు ‘రామ్ రహీమ్’ పేరు పెట్టిన ముస్లిం మహిళ..
మరోవైపు.. మంత్రులందరూ తమ నివాసాలలో దీపాలు వెలిగించాలని ప్రధాని కోరారు. అంతేకాకుండా.. రామ్ లల్లా ప్రాణప్రతిష్ట సందర్భంగా తమ ఇళ్లలో దీపాలు వెలిగించి పేదలకు భోజనం పెట్టాలని అన్నారురు. అంతేకాకుండా.. జనవరి 22 తర్వాత సంబంధిత పార్లమెంటరీ నియోజకవర్గాల నుండి ప్రజలను రైళ్లలో అయోధ్యకు తీసుకురావాలని ప్రధాని మోదీ అన్నారు.