రాష్ట్ర ప్రభుత్వం కుల గణన కార్యక్రమాన్ని సాహసోపేతంగా నిర్వహిస్తోంది.. కేంద్రం సుముఖంగా లేకపోయినా.. రాష్ట్ర ప్రభుత్వం కుల గణన కార్యక్రమాన్ని సాహసోపేతంగా నిర్వహిస్తోందని బీసీ సంక్షేమ, సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణు తెలిపారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో గుడ్ మార్నింగ్ కార్యక్రమంలో భాగంగా సచివాలయ సిబ్బందితో కలిసి కులగనన జరుగుతున్న తీరును మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై విమర్శల జల్లు కురిపించారు. ఏపీలో కులాల స్థితిగతులపై చంద్రబాబుకు ఏమాత్రం అవగాహన లేదని విమర్శించారు. ఈ…
తన రాజీనామా ఆమోదంపై గంటా శ్రీనివాస్ హైకోర్టును ఆశ్రయించారు. మూడేళ్ల కింద చేసిన రాజీనామాను ఇప్పుడు ఆమోదించడంపై గంటా అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజీనామా ఆమోదంలో ప్రొసీజర్ ఫాలో కాలేదంటూ గంటా పిటిషన్ వేశారు. అంతేకాకుండా.. స్పీకర్ నిర్ణయాన్ని హైకోర్టులో సవాల్ చేశారు. ఈ క్రమంలో గంటా శ్రీనివాస్ పిటిషన్ ఈనెల 29న విచారణకు రానుంది.
జెండా భుజాన పెట్టుకుని పార్టీని అధికారంలోకి తెచ్చింది కార్యకర్తలే అని తెలంగాణ డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క అన్నారు. గురువారం ఎల్బీస్టేడియంలో నిర్వహించిన తెలంగాణ కాంగ్రెస్ బహిరంగ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విచ్చేశారు. అయితే.. ఈ బహిరంగ సభలో పాల్గొన్న భట్టి విక్రమార్క ప్రసంగిస్తూ.. విద్వేషాలు చిమ్ముతున్న బీజేపీ కి వ్యతిరేకంగా యాత్ర చేస్తున్నారు రాహుల్ అని ఆయన కొనియాడారు. ఇబ్బందులు ఉన్నా.. ఆరు గ్యారెంటీ లు అమలు చేస్తామని…
విశాఖలో బీజేపి ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆధ్వర్యంలో రేపు ఘనతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేపు(శుక్రవారం) ఉదయం ఆరు గంటలకు ఆర్కే బీచ్ రోడ్డులో రిప్లబిక్ ఫ్రీడమ్ కలర్ వాక్ నిర్వహిస్తున్నామని తెలిపారు. నాలుగు వందల మీటర్లు పొడువైన జాతీయ జెండాతో వాక్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రేపు మధ్యాహ్నం 3 గంటల నుండి 5 గంటల వరకు పిల్లలకు వివిధ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. అలాగే.. సాయంత్రం టాలీవుడ్ సింగర్ అరుణ్ కౌండిన్య,…
ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో ఎమ్మిగనూరు పంచాయతీ సద్దుమణిగిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి రచ్చకెక్కింది. ఇంతకుముందు ఎమ్మిగనూరు ఇంచార్జిగా మాచాని వెంకటేశ్వర్లను ప్రకటించిన వైసీపీ అధిష్టానం.. అతన్ని తప్పించబోతున్నారు. అయితే వైసీపీ క్యాడర్ లో వ్యతిరేకత రావడంతో మరోసారి మాచాని పై సర్వే చేయించింది అధిష్టానం. కాగా.. సర్వేలో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో అధిష్టానం బుట్టా రేణుకను నియమించనున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే చెన్న కేశవరెడ్డి అంగీకారంతో బుట్టా రేణుక నియామకం జరుగనుంది. ఈ…
కార్యకర్తలు రక్తం చెమటగా మార్చడం తోనే నేను సీఎం గా గౌరవం దక్కిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇవాళ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన కాంగ్రెస్ బహిరంగ సభలో ముఖ్య అతిథిగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ పాదయాత్ర ప్రారంభం అయ్యాకా.. కర్ణాటక.. హిమాచల్ ప్రదేశ్.. మూడో విజయం తెలంగాణ అని ఆయన వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే కాగానే ఆరు నెలలు కాకముందే…
కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వర్ రావు నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్ రావుపై అవిశ్వాసం పెట్టి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారన్నారు. జమ్మికుంట గడ్డపై మళ్లీ గులాభి జెండా ఎగురవేశామని ఆయన అన్నారు. బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు పాడి కౌశిక్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ…
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ గురువారం సాయంత్రం జైపూర్‌కు చేరుకున్నారు. ఆయనకు జంతర్ మంతర్ వద్ద ప్రధానమంత్రి మోడీ స్వాగతం పలికారు. ప్రధాని మోదీ, అధ్యక్షుడు మాక్రాన్ కరచాలనం చేసి ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. అనంతరం ఇరువురు నేతలు చారిత్రక జంతర్‌మంతర్‌ను సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. కాగా.. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొననున్నారు. రెండ్రోజుల పాటు భారత్ లో పర్యటించనున్నారు.
రేపు ఏపీ సీఎం జగన్ విజయవాడలో పర్యటించనున్నారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొననున్నారు. అందుకోసం.. ఉదయం 8.50 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి సీఎం జగన్ బయలుదేరనున్నారు. రిపబ్లిక్ డే వేడుకలలో గవర్నర్ అబ్దుల్ నజీర్ తో కలిసి సీఎం పాల్గొననున్నారు. అనంతరం అక్కడి నుంచి తాడేపల్లికి తిరుగు పయనం కానున్నారు. సాయంత్రం 4.15 గంటలకు రాజ్‌భవన్‌లో గవర్నర్ ఆథిద్యం ఇచ్చే హై టీ కార్యక్రమంలో సీఎం జగన్…
హైదరాబాద్: తెలంగాణను 2050 నాటికి పారిశ్రామికంగా గణనీయంగా అభివృద్ధి చేయడానికి గానూ సమగ్ర మెగా మాస్టర్ ప్లాన్ ఆవిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. అందులో భాగంగా 55 కిలోమీటర్ల మేర మూసీ నది రివర్ ఫ్రంట్ అభివృద్ధి బాధ్యతలను హైదరాబాద్ మెట్రోపాలిటెన్ డెవలప్మెంట్ అథారిటీకి అప్పగించామని తెలిపారు. ప్రతిపాదిత రివర్ ఫ్రంట్ లో అమ్యూజ్ మెంట్ పార్కులు, జతపాతాలు, వాటర్ స్పోర్ట్స్, వీధి విక్రేత…