తెలుగు రాష్ట్రాలను పద్మ పురస్కారాలు వరించాయి. గురువారం కేంద్రం ప్రకటించిన అవార్డుల్లో ఏపీకి రెండు పద్మవిభూషణ్‌లతో పాటు ఒక పద్మశ్రీ, తెలంగాణకు ఐదు పద్మశ్రీలు లభించాయి. ఈ సందర్భంగా పద్మశ్రీ గ్రహీతలు తమ సంతోషాన్ని ఎన్టీవీతో పంచుకున్నారు.
అసెంబ్లీ ప్రాంగణంలో మహాత్మ జ్యోతిరావు బాపూలే విగ్రహ ప్రతిష్టాపన కోసం భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. తెలంగాణ జాగృతి పలు సమస్యలపై నిరంతర పోరాటం చేస్తోందని తెలిపారు. పార్లమెంట్ లో మహిళా బిల్లు పాస్ చేయాలని ఉద్యమం చేశామని అన్నారు. అసెంబ్లీ ఆవరణలో జ్యోతిరావు బాపూలే విగ్రహం ఏర్పాటు చేయాలని ఆమె కోరారు. పూలే విగ్రహం పెడితే బీసీలకు న్యాయం జరుగుతుందా…
ఎమ్మెల్సీ కవిత కామెంట్స్‌కు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. నిరుపేద నిరుద్యోగ యువకుడి బలవన్మరణానికి కారణమైన వ్యక్తి జైల్లో ఉంటే వాస్తవాలు తెలియకుండా కవిత ఆరోపణలు చేయడం విడ్డూరమని ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలను కాంగ్రెస్ ప్రభుత్వం భయపెడుతుందని భావించడం వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నామని పేర్కొన్నారు. గతంలో వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసినట్టే చేస్తారనుకోవడం విచారకరమని తెలిపారు. సారంగాపూర్ మండలం బట్టపల్లిలో శివ నాగేశ్వర్ అనే యువకుడు ఉరి వేసుకొని చనిపోతే A4 గా ఉన్న…
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కర్తవ్యపథ్‌లో జరిగిన దళాల పరేడ్ ఆకట్టుకుంది. అనంతరం ఆయా రాష్ట్రాలకు సంబంధించిన శకటాల ప్రదర్శన వీక్షకులను అబ్బురపరిచింది. ఇక తెలుగు రాష్ట్రాలకు చెందిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ శకటాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి చప్పట్లు కొట్టి ప్రశంసించారు.
లోక్‌సభ ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చేలోపు తమ ఆరు హామీల కింద మొత్తం 13 హామీల అమలుకు అధికారిక ఉత్తర్వులు జారీ చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. ఆరు హామీల నుంచి దృష్టి మళ్లించడం, వాగ్దానం చేసిన 100 రోజులకు మించి అమలు చేయడంలో జాప్యం చేయడంతో బీఆర్ఎస్ పాలనపై కాంగ్రెస్ నేతలు నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. హామీలపై రాష్ట్ర ప్రభుత్వానికి…
జనవరి 31తో ముగియనున్న రాష్ట్రంలో సర్పంచ్ల పదవీకాలాన్ని పొడిగించాలని భారత రాష్ట్ర సమితి ( బీఆర్ఎస్ ) కోరుతుందని మాజీ మంత్రి టీ హరీశ్‌రావు తెలిపారు . గత ఐదేళ్లలో వారు చేస్తున్న కృషిని పురస్కరించుకుని హరీశ్‌రావు గురువారం సిద్దిపేటలో తన నియోజకవర్గంలోని సర్పంచ్‌లకు సన్మాన సభ నిర్వహించారు . సర్పంచ్‌లను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు . ఈ సందర్భంగా రావు మాట్లాడుతూ.. ప్రజలతో నేరుగా మమేకమై గ్రామస్థాయిలో ఎమ్మెల్యే కంటే సర్పంచ్‌లకు సవాళ్లు…
కేంద్రం పద్మ అవార్డులను ప్రకటించింది. మొత్తం 34 మందికి పద్మశ్రీ అవార్డులు ప్రకటించింది. తెలంగాణలో ఇద్దరికి పద్మ శ్రీ అవార్డులు దక్కాయి. అందులో యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య, నారాయణపేట జిల్లా దామరగిద్ద వాసి బుర్ర వీణ వాయిద్యకారుడు దాసరి కొండప్ప ఉన్నారు. ఏపీకి చెందిన హరికథ కళాకారిణి ఉమామహేశ్వరికి పద్మ శ్రీ లభించింది.
తమ్ముడూ అంటూ శ్రీశైలం ఎమ్మెల్యే పై మాజీ మంత్రి భూమా అఖిలప్రియ మండిపడ్డారు. తనకు ఎమ్మెల్సీ పదవి వచ్చింది, రాజకీయ అరగ్రేటం చేసింది తన వల్లేనని భూమా అఖిలప్రియ అన్నారు. నువ్వు, నీ రహస్య మిత్రుడు, మా కోవర్ట్ కుమ్మక్కై నన్ను జైలుకు పంపారని అఖిలప్రియ ఆరోపించారు. 2014లో చక్రపాణి రెడ్డిని జగన్ కొత్తపల్లె వద్ద కారులో నుంచి దింపేశారు, కోవర్టు కూడా అక్కడే తన్నులు తిన్నాడని భూమా అఖిలప్రియ అన్నారు.
సంగీత స్వరకర్త ఇళయరాజా కుమార్తె భవథరణి (47) అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. ఆమె గత కొన్ని రోజులుగా క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. అయితే.. ఆమె ఇటీవల వైద్యం కోసం శ్రీలంకకు వెళ్లారు. 5 నెలలుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె శ్రీలంకలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ఈరోజు సాయంత్రం 5:20 గంటలకు చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇళయరాజా సంగీతం అందించిన రాసయ్య చిత్రంతో ఆమె తమిళంలో గాయనిగా అరంగేట్రం చేసింది. ఆమె తన సోదరులు కార్తీక్…
ప్రజాస్వామిక పాలన ద్వారానే రాజ్యాంగం ఆశించిన లక్ష్యాలు అన్ని వర్గాల ప్రజలకు అందుతాయని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అన్నారు. స్వేచ్ఛా స్వాతంత్ర్యం, సౌభ్రాతృత్వంతో పాటు అందరికీ న్యాయం అందాలనే మన భారత రాజ్యాంగ స్ఫూర్తి ఇప్పటికీ, ఎప్పటికీ ప్రపంచ దేశాలకు మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు. 75వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజున జరుపుకునే ఈ పండుగను ప్రజలందరూ సగర్వంగా జరుపుకోవాలని అన్నారు. రాజ్యాంగ నిర్మాతలను,…