కేటీఆర్ మతిభ్రమించి బీజేపి కాంగ్రెస్ ఒక్కటే అంటున్నారన్నారు ఎంపీ డాక్టర్ లక్ష్మణ్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్ డిప్రెషన్ లో ఎం మాట్లాడుతున్నారో తెలియడం లేదన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు ఎలా నిర్వహించాలి అనేది.. ఎన్నికల కమిషన్ పరిధిలోని అంశమని ఆయన పేర్కొన్నారు. బీజేపీ ఎప్పుడు నితీష్ కుమార్ పై వ్యక్తిగత విమర్శలు చేయలేదన్నారు. కుల గణన పై కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాన్ని ఆహ్వానిస్తున్నామన్నారు. తెలంగాణ, కర్ణాటక లో కాంగ్రెస్ హ్యాక్ చేసే గెలిచిందా? దిగ్విజయ్ సింగ్…
పదేళ్ల తర్వాత ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు కొత్త ఛాంపియన్ అవతరించాడు. ఇటాలియన్ యువ టెన్నిస్ ప్లేయర్ జానిక్ సిన్నర్ ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ విజేతగా నిలిచాడు. ఈరోజు జరిగిన టైటిల్ మ్యాచ్‌లో రష్యా ఆటగాడు డానియల్ మెద్వెదేవ్‌ను ఐదు సెట్లలో ఓడించాడు. ఈ మ్యాచ్‌లో సిన్నర్ 3-6, 3-6, 6-4, 6-4, 6-3 తేడాతో విజయం సాధించాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పురుషుల సింగిల్స్ ఫైనల్ గెలిచిన తొలి ఇటాలియన్ ప్లేయర్‌గా సిన్నర్ నిలిచాడు.
ఏపీలో మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ క్రమంలో అన్ని రాజకీయ పార్టీలు ప్రచారంలో దూసుకెళ్లేందుకు సన్నద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 4న జనసేన ఎన్నికల శంఖారావం పూరించనుంది. అందుకోసం అనకాపల్లిలో జనసేన భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ సభకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరుకానున్నారు. నూకాలమ్మ తల్లి అమ్మవారి దీవెనలతో ఎన్నికల శంఖారావం పూరించనున్నారు జనసేనాని.
హిందూ మతం గురించి మాట్లాడే బండి సంజయ్ కు రాజకీయాలెందుకని, మఠం పెట్టుకుంటే చాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై బండి సంజయ్ తీవ్రస్థాయిలో స్పందించారు. ‘‘24 గంటలు తాగి పండే మీ అయ్యకు సీఎం పదవెందుకు? బార్ పెట్టుకుంటే చాలదా? నిత్యం మసీదులు, ముస్లింలని మాట్లాడే నీకు రాజకీయాలెందుకు మసీదు ఏర్పాటు చేసుకుంటే సరిపోదా?’’ అంటూ ఎద్దేవా చేశారు. కేటీఆర్ కు కండకావరమెక్కి మాట్లాడుతున్నారని, అధికారం పోయినా అహంకారం తగ్గలేదన్నారు. ఈరోజు సాయంత్రం…
తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గం కోటలో వైసీపీ ఆధ్వర్యంలో సామాజిక సాధికార యాత్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ యాత్రలో నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ పాల్గొని మాట్లాడారు. సంక్షేమము, రాజకీయ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు జగన్ అధిక ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. జగన్ ను కాపాడుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజల మీదే ఉందని అన్నారు. మంచి జరిగి ఉంటేనే ఓటు వెయ్యమని అడిగే దమ్ము జగన్ కి మాత్రమే ఉందని పేర్కొన్నారు. జగన్ ని…
నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ను వైసీపి అధిష్టానం ప్రతిపాదించిన సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో నరసరావు పేటకు అనిల్ కుమార్ వెళితే.. నెల్లూరు సిటీ వైసీపీ అభ్యర్థిపై రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణి ప్రశాంతి రెడ్డి పేరును తెరపైకి తెస్తున్నారు వైసీపీ నేతలు.
సీఎం రేవంత్ రెడ్డి పై ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఫైర్ అయ్యారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి నోటికి హద్దు, అదుపు లేదని ఆయన మండిపడ్డారు. రాష్ట్రానికి సీఎం ను అనే విషయాన్ని మర్చిపోయి మాట్లాడుతున్నాడని ఆయన మండిపడ్డారు. సీఎంకు ఉండవలసిన హుందాతనం రేవంత్ రెడ్డిలో లోపిస్తుందన్నారు. ఇప్పటికీ కాంగ్రెస్ కార్యకర్త లాగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని, రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నా తీరు చూస్తుంటే చాలా భాద అనిపిస్తుందన్నారు కడియం శ్రీహరి.…
ఏపీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కృష్ణానదిలో మునిగి ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. ఈ ఘటన గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కృష్ణానదిలో చోటు చేసుకుంది. సరదాగా స్నానానికి దిగడం కోసమని నదిలో దిగడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతులు పటమటకు చెందిన నడుపల్లి నాగ సాయి కార్తికేయ, కత్తి ప్రశాంత్ (13), ఇంటర్మీడియెట్ విద్యార్ది గగన్ గా గుర్తించారు. కాగా నదిలో స్నానానికి నలుగురు వెళ్లగా.. ఒకరు ప్రాణాలతో బయటపడ్డాడు. ముగ్గురు…
వచ్చే నెల 2, 3 తేదీల్లో తెలంగాణలో జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించనున్నట్లు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తెలిపారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికలు, దేశ రాజకీయ పరిస్థితులు పరిగణనలోకి తీసుకొని చర్చిస్తామన్నారు. దేశంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయని ఆయన పేర్కొన్నారు. కక్కిన కూడును తినేందుకు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆశపడ్డాడని, కక్కిన కూడు కుక్కలు కూడా తినవ్ అని ఆయన వ్యాఖ్యానించారు. ఇండియా కూటమిని బలహీన పర్చేందుకు బీజేపీ…
ఏపీలో పలువురు ఐఏఎస్‌ల బదిలీలు అయ్యారు. మొత్తంగా 21 మంది ఐఏఎస్‌లకు స్థాన చలనం కలిగింది. ఎన్నికల నేపథ్యంలో పలువురు ఐఏఎస్‌లు బదిలీలు అయ్యారు. బదిలీల్లో పలు జిల్లాల కలెక్టర్లు ఉన్నారు. అల్లూరి సీతారామరాజు, విశాఖ జిల్లాల జాయింట్ కలెక్టర్లు బదిలీ అయ్యారు. జీవీఎంసీ అడిషనల్ కమిషనర్ గా వైజాగ్ జేసీ విశ్వనాథ్ నియామకం అయ్యారు. కాకినాడ జాయింట్ కలెక్టర్ ఇలక్కియ పోలవరం ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్ గా బదిలీ అయ్యారు. కాకినాడ జాయింట్ కలెక్టర్ గా పోలవరం…