మధ్య ప్రదేశ్ లో పీడిత్ అధికార్ యాత్రను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రారంభించారు. కేసీఆర్ ఉద్యమాలు అందరికీ స్పూర్తిదాయకమన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఉండాలన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఓబీసీలకు కాంగ్రెస్ ఎందుకు న్యాయం చేయలేదని, కేంద్రంలో బీసీలకు ప్రత్యే మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలన్నారు ఎమ్మెల్సీ కవిత. బీసీల కులగణనను వెంటనే చేపట్టాలన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాలు సీఎంగా ఉండి అన్ని వర్గాల…
రాజకీయాల నుంచి గుంటూరు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ తప్పుకున్నారు. 2024 ఎన్నికల్లో పోటీ చేయట్లేదని ఆయన ప్రకటించారు. కొన్ని పరిస్థితుల నేపథ్యంలో తప్పుకుంటున్నట్లు జయదేవ్ వెల్లడించారు. తాజాగా ఇదే అంశంపై తల్లి గల్లా అరుణకుమారి స్పందించారు. పార్లమెంట్ను గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు, కనకమేడల శాసించే వారని తెలిపారు. నీతి, నియమాలతో పెరిగిన కుటుంబం తమదని పేర్కొన్నారు. గతంలో కాంగ్రెస్లో సీటు కోసం ప్రయత్నం చేస్తే రాలేదని.. అప్పుడు టీడీపీలో జాయిన్ అయినట్లు గుర్తుచేశారు. కేవలం…
రేపు(సోమవారం) స్పీకర్ ముందుకు అనర్హత పిటిషన్లు అంశం రానుంది. కాగా.. వైసీపీ, టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు హాజరు పై ఉత్కంఠ నెలకొంది. రేపటి విచారణకు ముగ్గురు టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు హాజరుకానుండగా.. గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్దాల గిరి విదేశీ పర్యటనలో ఉన్నారు. ఈ క్రమంలో.. రేపటి విచారణకు హాజరు కాలేనని స్పీకర్ కార్యాలయంకు సమాచారం ఇచ్చారు. ఫిబ్రవరి రెండో తేదీన విచారణకు హాజరు అవుతానని ఎమ్మెల్యే గిరి తెలిపారు.
మెదక్లో నిర్వహించిన బీఆర్ఎస్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డికి సీఎం పదవి కేసీఆర్ పెట్టిన భిక్ష అని వ్యాఖ్యానించారు. కేసీఆర్ తెలంగాణ తేకపోతే రేవంత్ రెడ్డి సీఎం అయ్యేవాడా..? అని హరీష్ రావు ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ చేతులు ఎత్తేసేటట్టు కనిపిస్తుందని, కాంగ్రెస్ వచ్చింది..మార్పు మొదలైంది..ట్రాన్స్ ఫార్మర్లు, మోటార్లు కాలిపోతున్నాయన్నారు హరీష్ రావు. కాంగ్రెస్ వచ్చాక మోటర్…
ఉప్పల్ వేదికగా జరుగుతున్న ఇండియా-ఇంగ్లాడ్ తొలి టెస్ట్ మ్యాచ్ లో భారత్ ఓటమిపాలైంది. ఇండియా 202 పరుగులకు ఆలౌటైంది. 28 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ విజయం సాధించింది. 5 టెస్టుల సిరీస్ లో మొదటి టెస్ట్ లో ఇంగ్లాండ్ గెలుపొందింది. ఇంగ్లాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ 246 పరుగులకు ఆలౌట్ కాగా.. భారత్ ఫస్ట్ ఇన్నింగ్స్ 436 పరుగులకు ఆలౌటైంది. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 420 పరుగులు చేసి ఆలౌట్ కాగా.. భారత్ రెండో ఇన్నింగ్స్…
తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ప్రొఫెసర్ కోదండరామ్ ఎమ్మెల్సీగా గెలుపొందారు. కోదండరామ్ ఎమ్మెల్సీగా బాధ్యతలు స్వీకరించిన తరువాత కరీంనగర్ జిల్లా హుజురాబాద్లో తొలిసారి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పీవీ జిల్లా కోసం ఎనిమిదేళ్లుగా పోరాటం చేస్తున్నారని, భూసంస్కరణలకు ఆద్యుడు పీవీ అని ఆయన కొనియాడారు. పీవీ జిల్లాపై ఒక నిర్ణయం తీసుకోవాలన్నారు ఎమ్మెల్సీ కోదండరామ్. ప్రభుత్వంపై బీఆర్స్ అసహనం వ్యక్తం చేస్తోందన్నారు. పైసలతో ఏమైనా చేస్తాం…
కేరళ సీఎం పినరయి విజయన్-గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ మధ్య నెలకొన్న వైరం మరింత ముదురుతోంది. శనివారం రోడ్డుపై వెళ్తుండగా ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు అడ్డుకోవడంతో ఆరిఫ్ మహ్మద్ ఖాన్ మరింత అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. వెంటనే కారులో నుంచి కిందికి దిగి గవర్నర్ నిరసన వ్యక్తం చేశారు. తక్షణమే ఎస్ఎఫ్ఐ కార్యకర్తలను అరెస్ట్ చేయాలని గవర్నర్ డిమాండ్ చేశారు. ఈ వ్యవహారం రాజకీయంగా పెద్ద దుమారమే చెలరేగింది.
బీహార్ లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. 9వసారి ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణస్వీకారం చేశారు. ఆయన చేత గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరయ్యారు. తొమ్మిదోసారి సీఎంగా ప్రమాణం చేసి దేశంలోనే నితీష్ సరికొత్త రికార్డ్ సృష్టించారు.
విజయనగరం జిల్లాకి పూర్వవైభవం తీసుకురావడానికి తన శాయశక్తులా కృషి చేస్తానని పల్సస్ సీఈవో డాక్టర్ గేదెల శ్రీనుబాబు భరోసా ఇచ్చారు. విజయనగరం జిల్లా కేంద్రంలో 10 వేల మంది రైతులతో నిర్వహించిన సదస్సుకి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. సదస్సుకి ముందు భారీ ర్యాలీ నిర్వహించారు. ఒకప్పుడు గలగలా పారే నదులు.. పచ్చని పంట పొలాలతో ఆంధ్రప్రదేశ్ కే మణిహారంగా విలసిల్లేది విజయనగరం. కాల ప్రవాహంలో విజయనగరం తన ప్రభావం కోల్పోయిందని అన్నారు. సహజవనరులు నిరుపయోగం…
ఉత్తరాంధ్రలో కనీసం నాలుగు సీట్లయిన గెలవగలనని చెప్పగలరా…? రాష్ట్రంలో అన్ని వర్గాలు కోపంతో, ఉక్రోషంతో వున్నారని మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని వంద అడుగుల లోతులో పాతి పెట్టేయడం ఖాయమని ఆయన అన్నారు. శ్రీలంకలో రాజపక్సే ప్రభుత్వాన్ని తరిమి కొట్టినట్టే ఏపీలో జగన్మోహన్ రెడ్డి పార్టీని బంగాళాఖాతంలో కలిపేయడానికి జనం సిద్ధంగా ఉన్నారన్నారు. జగన్మోహన్ రెడ్డికి మిగిలింది దింపుడు కళ్లెం ఆశలే.. అద్భుతాలు జరుతుగుతాయనే భ్రమలు వీడితే మంచిదన్నారు. మూడు రాజధానుల…