Bandi Sanjay : కేటీఆర్ వ్యాఖ్యలపై బండి సంజయ్ కౌంటర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హిందూ మతం గురించి మాట్లాడే బండి సంజయ్ కు రాజకీయాలెందుకని, మఠం పెట్టుకుంటే చాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై బండి సంజయ్ తీవ్రస్థాయిలో స్పందించారు. ‘‘24 గంటలు తాగి పండే మీ అయ్యకు సీఎం పదవెందుకు? బార్ పెట్టుకుంటే చాలదా? నిత్యం మసీదులు, ముస్లింలని మాట్లాడే నీకు రాజకీయాలెందుకు మసీదు ఏర్పాటు చేసుకుంటే సరిపోదా?’’ అంటూ ఎద్దేవా చేశారు. కేటీఆర్ కు కండకావరమెక్కి మాట్లాడుతున్నారని, అధికారం పోయినా అహంకారం తగ్గలేదన్నారు. ఈరోజు సాయంత్రం ఉప్పల్ ఆర్వోబీని పరిశీలించేందుకు వచ్చిన బండి సంజయ్ ను కేటీఆర్, వినోద్ కుమార్ చేసిన వ్యాఖ్యలను మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా పై విధంగా స్పందించారు. ఆయనేమన్నారంటే…
కేటీఆర్ కు కండకావరం తలకెక్కింది. నేను హిందూ ధర్మం కోసం మాట్లాడితే మఠం పెట్టుకోవాలట… సిగ్గు లేకుండా మాట్లాడుతున్నడు… మీ అయ్య 24 గంటలు తాగి పండుకుంటున్నడు కదా… మీ అయ్యకు సీఎం పదవి ఎందుకు? బార్ పెట్టుకుంటే సరిపోతుంది కదా? నువ్వు మాట్లాడితే ముస్లింల గురించి మాట్లాడుతున్నవ్ కదా.. హిందూ ధర్మమంటే నీకు గిట్టదు కదా.. మసీదు పెట్టుకో.. నీకు రాజకీయాలెందుకు? రాష్ట్రంలో 99 శాతం మంది దేవుడిని నమ్మేవాళ్లున్నారు. నేనడుగుతున్న. కేటీఆర్ దేవుడిని నమ్మని నాస్తికుడు… దేవుడిని నమ్మేవాళ్లు నాస్తికుడి ఎందుకు ఓటేయాలో ఆలోచించాలి. కోట్ల రూపాయల ఆదాయం సంపాదించడానికే యాదగిరిగుట్టను నిర్మించామని చెప్పిన మూర్ఖుడు కేటీఆర్. ఇకనైనా తెలంగాణకు పట్టిన దరిద్రం కేసీఆర్ కుటుంబం. మీ అరాచకాలను, అహంకారంపై పోరాడి తరిమి కొట్టింది బీజేపీయే. కారు సర్వీసింగ్ కు పోయిందట… తాగి కారు నడిపే మీ అయ్యలాంటోళ్ల వల్లే కారు షెడ్డుకు పోయింది. రిపేర్ కు కూడా పనికిరాకుండా పోయింది. పాత సామానోళ్లు కూడా ఆ డొక్కు కారును కొనే పరిస్థితి లేదు.
Also Read
- CJP: ‘‘శివాజీ పార్క్లో అడుగుపెట్టనివ్వం’’.. సీజేపీకి ముంబై స్థానికుల ఝలక్!
- Jammu Kashmir: CISF క్యాంపులో కలకలం..హెడ్ కానిస్టేబుల్ కాల్పుల్లో నలుగురు జవాన్లు మృతి
- Pawan Kalyan: పల్లె సీమల్లో అభివృద్ధి పరుగులు.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..
- AP Govt: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రూ.35కే కేజీ ఉల్లిపాయలు.. నెలకు 2 కేజీలు..
కేటీఆర్ కు దమ్ముంటే బీఆర్ఎస్ పాలనలో ఏ గ్రామానికి ఎన్ని నిధులిచ్చారో చెప్పాలి. మేం రాబోయే ఎన్నికల్లో మోదీ చేసిన అభివ్రుద్ధి, ఏ గ్రామానికి ఎన్ని నిధులిచ్చారనే వివరాలను పూర్తి స్థాయిల్ ప్రజల్లోకి తీసుకెళతాం… ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ది మూడో స్థానమే…రాసి పెట్టుకోండి. మాజీ ఎంపీ వినోద్ కుమార్ నాన్ లోకల్. ఆయన ఏనాడూ కరీంనగర్ ప్రజలను పట్టించుకోలేదు. ఏనాడూ ప్రజలను కలవలేదు. ఎన్నికలొస్తున్నాయని తెలిసి డ్రామాలాడుతున్నడు.. ఆయన మాటలను ఎవరూ పట్టించుకోరు.’ అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Alwal Case: అల్వాల్ మైనర్ బాలిక సామూహిక లైంగిక దాడి కేసులో షాకింగ్ ట్విస్ట్..
-
CJP: ‘‘శివాజీ పార్క్లో అడుగుపెట్టనివ్వం’’.. సీజేపీకి ముంబై స్థానికుల ఝలక్!
-
Khairatabad By Polls : ఉప ఎన్నికపై అధికార పార్టీ వ్యూహం ఏంటి?
-
OTR: కొత్తగూడెం బీఆర్ఎస్లో సరికొత్త సమీకరణాలు..
-
Jammu Kashmir: CISF క్యాంపులో కలకలం..హెడ్ కానిస్టేబుల్ కాల్పుల్లో నలుగురు జవాన్లు మృతి
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!