జేడీయూ అధినేత నితీష్‌కుమార్ సరికొత్త రికార్డ్ సృష్టించబోతున్నారు. బీహార్లోనే కాదు దేశంలోనే నితీష్ హిస్టరీ క్రియేట్ చేయబోతున్నారు. ఇప్పటికే ఆయన 8 సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయగా.. తాజాగా మరోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేసేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో ఆయన దేశంలోనే అత్యధిక సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నాయకుడిగా చరిత్ర సృష్టించబోతున్నారు.
వరంగల్‌కు మంజూరైన సైనిక్ స్కూల్ ను రీ లోకేట్ చేసి సికింద్రాబాద్ కంటోన్మెంట్లో పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తుందన్నారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం తమ పలుకుబడిని ఉపయోగించి దేశవ్యాప్తంగా ప్రారంభించే 100 సైనిక్ స్కూళ్లలో అదనంగా ఒకటి రాష్ట్రానికి తీసుకురావాలన్నారు. జిల్లాకు చెందిన మంత్రులు ఎమ్మెల్యేలు కొత్తగా విద్యాసంస్థలు తేకున్నా పర్వాలేదు , రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి వరంగల్‌లోనే సైనిక్ స్కూల్ ను నెలకొల్పాలని, గత ప్రభుత్వం మంజూరు…
ఫిబ్రవరి రెండోవారంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు పెట్టే అవకాశం ఉంది. ఫిబ్రవరి 6 నుంచి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నట్లు సమాచారం తెలుస్తోంది. ఈ సమావేశాలు 4 రోజుల నుంచి 5 రోజుల పాటు నిర్వహించాలనే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉంది. ఈ క్రమంలో.. ఇప్పటికే అన్ని శాఖల నుంచి ఆర్థికశాఖ అంచనాలు తెప్పించుకుంది. కాగా.. ఎన్నికల ముందు చివరి సమావేశాలు కావడంతో కీలక ప్రకటనలు ప్రకటించే ఛాన్స్ ఉంది. ఇదిలా ఉంటే.. ఎన్నికల ముందు…
వైసీపీ రెబల్ ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ అనర్హత వేటుపై రేపు విచారణ జరగనుంది. మండలి చైర్మన్ పంపించిన నోటీసులకు ప్రత్యక్షంగా హాజరై అఫిడవిట్ సమర్పించనున్నారు వంశీ. డిస్క్వాలిఫికేషన్ తనకు ఎందుకు వర్తించదో చెప్పేందుకు అవసరమైన సమాధానం ఇప్పటికే సిద్ధం చేసుకున్నారు. రెబల్ ఎమ్మెల్సీ ఇచ్చే వివరణతో మండలి చైర్మన్ సంతృప్తి చెందకపోతే అనర్హత వేటు ఖాయం అవుతుంది. ఒకవేళ అదే సాధ్యమైతే అనర్హత నిర్ణయాన్ని కోర్టులో చాలెంజ్ చేసేందుకు సన్నద్ధం అవుతున్నారు ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్.
కరీంనగర్లో సర్పంచులపై కక్ష సాధింపు చర్యలు.. నూతన పంచాయతీ భవనాలు ప్రారంభించుకోకుండా సర్క్కులర్ ఇవ్వడమా? అని అన్నారు ఎంపీ బండి సంజయ్ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కూలీ పనులు చేసే దుస్థితి సర్పంచులది…ఇదే ప్రజాస్వామ్యమా? అని ఆయన ప్రశ్నించారు. నేను సీఎంకు లేఖ రాసినా స్పందన లేదన్నారు బండి సంజయ్. బీఆర్ఎస్ మాదిరిగానే జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వం రాచరికంగా వ్యవహరిస్తోందని, చేసిన పనులకు బిల్లులివ్వరు… కనీసం రికార్డుల్లోకి ఎక్కివ్వరని ఆయన మండిపడ్డారు. ఇట్లయితే సర్పంచులుగా…
శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం పాలసముద్రం సమీపంలోని నాసిన్ అకాడమీలో ఆదివారం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సంస్థలోని క్యాంటీన్ లో మంటలు చెలరేగాయి. దీంతో సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. మరోవైపు నాసిన్ కేంద్రంలో అగ్ని ప్రమాదం పై అధికారులు విచారణ చేపట్టారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా.. ఇటీవలే నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ అండ్ ఇన్ డైరెక్ట్ టాక్సిస్…
జేడీయూ అధినేత నితీష్‌కుమార్‌కు ప్రధాని మోడీ ఫోన్ చేశారు. బీజేపీ మద్దతుతో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న నితీష్‌కు మోడీ అభినందనలు తెలిపారు. ఆదివారం సాయంత్రం 5గంటలకు ముఖ్యమంత్రిగా తొమ్మిదో సారి నితీష్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. నితీష్‌తో పాటు బీజేపీకి చెందిన ఇద్దరు ఉపముఖ్యమంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే జేడీయూకు మద్దతిస్తున్న మరో ఆరుగురు కూడా మంత్రులుగా ప్రమాణం చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా స్పీకర్ పదవి కూడా బీజేపీకే దక్కనున్నట్లు సమాచారం.
ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయ పార్టీలు ప్రచారాల్లో స్పీడు పెంచాయి. ఈ క్రమంలో.. తిరుపతిలో యాదవ సంఘాలతో వైసీపీ, టీడీపీ పోటాపోటీ సమావేశాలు నిర్వహించింది. యాదవ, కురుబ సమ్మేళనం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, మేయర్ డాక్టర్ శిరీష, డిప్యూటీ మేయర్ అభినయ్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ.. తిరుపతి నగరం ఎన్నడూ లేని విధంగా మహా నగరంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు.
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి పై తీవ్ర స్దాయిలో విమర్శలు చేశారు సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం. తనకు తెలియకుండా సత్యవేడు నేతలతో సమావేశం పెట్టడం, కనీస సమాచారం ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దిరెడ్డికి దమ్ము, ధైర్యం ఉంటే నగరి తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి నియోజక వర్గ నేతలతో సమావేశాన్ని ఆయన ఇంటిలో పెట్టాగలరా అని సవాల్ విసిరారు. పెద్దిరెడ్డి రిజర్వడ్ నియోజకవర్గాలంటే అంతా చిన్నచూపా అని మండిపడ్డారు. పెద్దిరెడ్డి కంటే సీనియర్ లీడర్ తానని.. తనలా…
బీహార్ సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలింది. ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో కూడిన మహాకూటమి సర్కార్ పడిపోయింది. గత వారం రోజులుగా చోటుచేసుకున్న రాజకీయ సంక్షోభానికి ముగింపు పలుకుతూ ముఖ్యమంత్రి పదవికి ఆదివారం ఉదయం నితీష్ రాజీనామా చేశారు.