కేటీఆర్ మతిభ్రమించి బీజేపి కాంగ్రెస్ ఒక్కటే అంటున్నారన్నారు ఎంపీ డాక్టర్ లక్ష్మణ్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్ డిప్రెషన్ లో ఎం మాట్లాడుతున్నారో తెలియడం లేదన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు ఎలా నిర్వహించాలి అనేది.. ఎన్నికల కమిషన్ పరిధిలోని అంశమని ఆయన పేర్కొన్నారు. బీజేపీ ఎప్పుడు నితీష్ కుమార్ పై వ్యక్తిగత విమర్శలు చేయలేదన్నారు. కుల గణన పై కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాన్ని ఆహ్వానిస్తున్నామన్నారు. తెలంగాణ, కర్ణాటక లో కాంగ్రెస్ హ్యాక్ చేసే గెలిచిందా? దిగ్విజయ్ సింగ్ చెప్పాలన్నారు లక్ష్మణ్. పార్లమెంట్ ఎన్నికల్లో జనసెనా తో పొత్తు ఉండదు…ఒంటరిగానే పోటీకి దిగుతామని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా.. పార్లమెంట్ ఎన్నికల్లో 10సీట్లు సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మొన్న మమత బెనర్జీ నేడు నితీష్ కుమార్ ఆ కూటమి నుంచి బయటికి వచ్చారని ఆయన అన్నారు. దేశం కోసం మోడీ పని చేస్తే.. కాంగ్రెస్ మాత్రం నెహ్రూ గాంధీల…కుటుంబాల కోసం పని చేస్తున్నాయని ఆయన వెల్లడించారు.
ఎన్నికల ప్రచారంలో భాగమే రేవంత్ దావోస్ పర్యటన అని, కూటమి బీటాల పరిణామమే బీహార్ రాజకీయాలు మారుతున్నాయన్నారు. కాంగ్రెస్స్ అంటేనే అవినీతి… అవినీతి అంటేనే కాంగ్రెస్ ఇవి రెండు పర్యాయ పదాలు అని, కర్ణాటకలో కాంగ్రెస్స్ ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు కాక ముందే అక్కడ ఆ ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకత వస్తుందన్నారు. లోక్ సభ ఎన్నికలకు కాంగ్రెస్ కి తెలంగాణ ఏటీఎం కాబోతుందని, కాళేశ్వరం లో జరిగిన అవినీతిని దోపిడీని బయట పెడతామన్నారన్నారు. కానీ ఇవాళ వారి గొంతులు మూగబోతున్నాయని, సీఎం ఏమో మొత్తం ప్రాజెక్ట్ పై విచారణ అంటాడు.. మంత్రి ఏమో మేదిగడ్డ వరకే ఎంక్వైరీ అంటుడని, గ్యారంటీ లు అమలు చేయకుండా పార్లమెంట్ ఎన్నికల కోడ్ బూచిగా చూపి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. రాహూల్ గాంధీ భారత్ జొడో న్యాయ యాత్ర కి బస్సు సైతం తెలంగాణ నుంచి ఇచ్చారని, మోడీ మూడోసారి ప్రధాని అవుతారని అక్కసుతో కాంగ్రెస్ తో పాటు .. కొన్ని ప్రాంతీయ పార్టీలు కలిసి విపక్ష కూటమి పెట్టాయన్నారు లక్ష్మణ్. మోడీ నీ ఓడించాలని అజెండా తప్పితే వారికి దేశ ప్రయోజకులు పట్టవని, ఆ కూటమి ఈరోజు బీటాలు వారుతుందన్నారు.