జమ్మికుంట పట్టణంలోని వినాయక గార్డెన్ ఫంక్షన్ హాల్‌లో హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి వొడితల ప్రణవ్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా పాలన, ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీల అమలు కొరకై స్థానిక ప్రజలకు చేరడం కొరకు కాంగ్రెస్ పార్టీలో చేరారన్నారు. పార్టీలో ప్రాధాన్యత అందరికీ ఉంటుందని, ప్రజా పాలన నచ్చి కౌన్సిలర్ల, సర్పంచులు చేరారని ఆయన తెలిపారు. పార్టీలో కష్టపడ్డ వారికి పదవులు ఉంటాయని, రానున్న ఎంపీ, సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికల్లో సముచిత స్థానం కల్పిస్తామన్నారు. అందరినీ కలుపుకొని పోయి పార్టీని ముందుకు కొనసాగిస్తామని, సమ్మక్క – సారలమ్మ జాతర వస్తుంది. హుజురాబాద్ లో 11 నుండి 14 సమ్మక్క జాతరలు జరుగుతున్నాయన్నారు. దానికి సంభందించి చైర్మన్ ను ఎన్నుకొని ప్రజలకు ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు.వైద్యం, నీటి సౌకర్యాన్ని చేస్తున్నామని, కాంగ్రెస్ పార్టీ దళిత నాయకులు,దళితుల సంఘాలు దళిత బంధు విజ్ఞప్తి మేరకు ప్రభుత్వానికి సూచనలు ఇచ్చి దళిత బంధు రావడానికి నా వంతు కృషి చేస్తామన్నారు.
అంతేకాకుండా.. *ఉపఎన్నిక సమయంలో ఇచ్చిన ప్రొసీడింగ్స్ ఇచ్చిన కాపీలు ఏమయ్యాయి. బిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. మొన్న తీసుకున్న ప్రజా పాలన లో ఆరు గ్యారంటిలను ప్రతి గడపకు తీసుకొచ్చే భాధ్యత నాది. చెక్ డ్యాం మరమత్తుల విషయంలో వాటిని రిపేర్ చేయడానికి అవసరమయ్యే ఖర్చులను అధికారులు లెక్కలు వేస్తున్నారు.వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్య పూర్తీ కావడానికి దోహదం చేస్తున్నాం. కమలపూర్ లో నీళ్లు రావడానికి మా వంతు కృషి చేసాము.ప్రజలకు సేవ చేస్తాం. కల్వల ప్రాజెక్ట్ పై తీసుకున్న నిర్ణయాలు ఇప్పటికీ అమలుకాలేదు. కాగితాల వరకే హామీలు ఇచ్చారు. రానున్న ఎంపీ ఎలక్షన్ లో హుజూరాబాద్ నుండి భారీ మెజారిటీ వచ్చేలా కృషి చేస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వస్తే ప్రభుత్వం నుండి నిధులు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వము మారుతుంది, సి.ఎం. మారుతారు అనే మాటలు అపండి మారుతారనే అనే అపోహ సృష్టిస్తున్నారు.అంతర్గత సమావేశాలు జరుపుతున్నార? గెలుపు చూసుకొని విర్రవీగితే ఊరుకోరు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు.బీజేపి, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చూసి ప్రజలు విసిగి పోయారు…’ అని ఆయన వ్యాఖ్యానించారు.