బడ్జెట్పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలో సమాధానం ఇచ్చారు. బడ్జెట్లో కేటాయించిన ప్రతి రూపాయిని అన్ని వర్గాలకు చేరాలన్నదే మా ప్రయత్నమని ఆయన పేర్కొన్నారు. అంబేడ్కర్ స్ఫూర్తిగా రాజ్యాంగ పీఠికను గుర్తు చేశామన్నారు. ఇచ్చిన హామీలు, అమలు, బడ్జెట్ ఉందా లేదా అనేది అంచనా లేకపోవడంతో పదేళ్లు ఇబ్బంది జరిగిందన్నారు.
బీజేపీ తెలంగాణలో మెజార్టీ సీట్లు సాధిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ అనుకూల వాతావరణం ఉందని, ప్రజలు మోడీ పాలన కోరుకుంటున్నారని ఆయన స్పష్టం చేశారు. లేని అంశాలను కావాలని తెరమీదకు తెస్తూ.. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాయని మండిపడ్డారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అవినీతి రాజకీయాలు మరోసారి బహిర్గతం అయ్యాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలక్టోరల్ బాండ్లను బీజేపీ లంచం, కమీషన్ల కోసమే స్వీకరించేందుకు సాధనంగా మార్చుకుందని ఆరోపించాడు.
ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంథోని అల్బనీస్ మరోసారి పెళ్లి చేసుకునేందు రెడీ అయ్యాడు. జోడీ హైడన్ తో తన ఎంగేజ్మెంట్ కూడా జరిగిపోయిందని అతడు అధికారికంగా వెల్లడించారు.
తెలంగాణ రాష్ట్రములో ఉన్న 197 వ్యవసాయ మార్కెట్ కమిటీలకు నూతన కార్య వర్గములు ఏర్పాటు చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలియజేసారు. ఈ మేరకు ఈ నెల 12న ఇప్పటికీ కొనసాగుతున్న 123 మార్కెట్ కమిటీలను రద్దు చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయడమైనదని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో నిరాధరణకు గురైన వ్యవసాయ మార్కెట్ కమిటీలకు పునర్వైభవం తెచ్చే దిశలో ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు కాబోయే కమిటీలకు సహాయ సహకారాలు…
నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో మరోసారి చిరుతపులి సంచారం కలకలం రేపింది. శ్రీశైలం ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో రెడ్ల సత్రం వద్ద స్థానికులకు చిరుతపులి కనిపించింది. చిరుతపులిని చూసిన భక్తులు, స్థానికులు చిరుతపులి వీడియోలు సెల్ ఫోన్లో చిత్రీకరించారు.
వద్దిరాజు రవిచంద్రను రాజ్యసభ స్థానానికి కేసీఆర్ నామినేట్ చేశారు. రాజ్యసభ అభ్యర్థిగా వద్దిరాజు రవిచంద్ర పేరును బీఆర్ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్ రావు ప్రతిపాదించారు. బుధవారం పార్టీ సీనియర్ నేతలతో చర్చించి రవిచంద్ర అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. రవిచంద్ర గురువారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. భారత ఎన్నికల సంఘం తెలంగాణ నుంచి మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలను నిర్వహిస్తోంది, వీటికి ఫిబ్రవరి 27న పోలింగ్ జరుగుతుంది. నామినేషన్ పత్రాల దాఖలుకు ఫిబ్రవరి 15 చివరి తేదీ. బీఆర్ఎస్…
తన రాజకీయ జీవితం జగన్ పెట్టిన భిక్ష అని నరసరావు పేట వైసీపీ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. తాను రాజకీయాలకు వచ్చేటప్పటికి ఒంటరినని తెలిపారు. కోటప్పకొండ శివుడు సాక్షిగా చెబుతున్నా.. నాకు ఎవరూ లేకపోయినా తండ్రి లాగా, సాక్షాత్తు దైవంలాగా సీఎం జగన్ నన్ను ఆదరించారని ఆయన వెల్లడించారు.