Arvind Kejriwal: మరోసారి విశ్వాస పరీక్ష సిద్ధమైన కేజ్రీవాల్.. కారణం అదేనా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Motion of no confidence: ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీలో విశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టారు. ఇవాళ (ఫిబ్రవరి 17న) అసెంబ్లీలో ఈ తీర్మానంపై చర్చ జరగనుంది. అయితే, కేజ్రీవాల్ ఆరు నెలల క్రితం కూడా ఒకసారి విశ్వాస పరీక్షను ఎదుర్కొన్నారు. ఇక, తమ పార్టీ నేతలను బీజేపీ ప్రలోభాలకు గురి చేస్తుందని ఆయన ఇటీవల ఆరోపించారు. తమ ఎమ్మెల్యేలతో బీజేపీ టచ్ లో ఉంది.. వారికి ఒక్కొక్కరికి 25 కోట్ల రూపాయలను ఆఫర్ చేసిందన్నారు. దీంతో బీజేపీతో కలిస్తే తనపై కేసులు లేకుండా చేస్తామన్నారని ఇటీవల కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి.
Read Also: Health Tips : మొబైల్ ను చూస్తూ తింటున్నారా? అయితే ఇది మీ కోసమే..
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
ఇక, ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కేజ్రీవాల్ కు ఇప్పటికే ఈడీ అధికారులు ఆరు సార్లు నోటీసులు పింపింది. ఇటీవల జార్ఖండ్ సీఎంగా ఉన్న హేమంత్ సోరెన్ ను ఈడీ ఇలాగే నోటీసులిచ్చి అరెస్ట్ చేసింది.. దీంతో కేజ్రీవాల్ ను కూడా విచారణ పేరుతో అరెస్ట్ చేస్తారని ఆప్ నేతలు ఆరోపలు చేస్తుంది. అయితే, 70 మంది సభ్యుల అసెంబ్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి 62 మంది ఎమ్మెల్యేలుండగా బీజేపీ బలం రెండుకు పడిపోయింది. లెఫ్టినెంట్ గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగిలారన్న కారణంతో గురువారం ఆరుగురు బీజేపీ ఎమ్మెల్యేలను సెషన్ మొత్తానికీ సస్పెండ్ చేశారు. ఇక, శుక్రవారం విశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టిన తర్వాత కేజ్రీవాల్ మాట్లాడుతూ.. తమ ఎమ్మెల్యేలంతా తమతోనే ఉన్నారన్నారని చెప్పారు. కానీ వారెక్కడ జారిపోతారోననే భయంతోనే ఆయన మరోసారి బల పరీక్షకు దిగారని బీజేపీ నేతలు ఎద్దేవా చేశారు.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!