Home
Telugu News
Telugu News News
-
Top Headlines @9PM : టాప్ న్యూస్
ఇరాన్లో ఓ కొడుకు ఘాతుకం.. తుపాకీ కాల్పుల్లో 12 మంది మృతి ఇరాన్లో (Iran Firing) ఓ వ్యక్తి ఘాతుకానికి తెగబడ్డాడు. తుపాకీతో కాల్పులకు తెగబడడంతో తండ్రితో సహా 12 మంది బంధువులు ప్రాణాలు కోల్పోయారు. అనంతరం నిందితుడ్ని భద్రతా బలగాలు కాల్చి చంపాయి. కుటుంబంలో కలహాలు చోటుచేసుకోవడంతో ఓ కుమారుడు విచక్షణ కోల్పోయి రైఫిల్ తీసుకుని కాల్పులకు పాల్పడ్డాడు. దీంతో తండ్రి, సోదరులు.. మొత్తం 12 మంది బంధువులు ప్రాణాలు వదిలారు. అనంతరం ఇరాన్‌లోని దక్షిణ-మధ్య… -
Pawan Kalyan: రేపు విశాఖకు జనసేనాని..
రేపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖకు వెళ్లనున్నారు. రేపు, ఎల్లుండి విశాఖలోనే పర్యటించనున్నారు. ఉత్తరాంధ్ర ముఖ్య నేతలతో పవన్ వరుస భేటీలు నిర్వహించనున్నారు. అంతేకాకుండా.. నాగబాబు పోటీపై ఈ పర్యటనలో పవన్ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఇకపోతే.. అసెంబ్లీ ఎన్నికల్లో విజయనగరం, విశాఖల నుంచి జనసేన సీట్లు ఆశిస్తుంది. అంతేకాకుండా.. భీమిలీ, యలమంచిలి, చొడవరం, పెందుర్తి, గాజువాక స్థానాలపై జనసేన కన్ను పడింది. -
Hair Grow : జుట్టు పెరుగుదలకు కోసం హోం రెమెడీ..!
జుట్టు రాలడం అనేది చాలా మందికి ప్రధాన సమస్య. జుట్టు రాలడం అనేక కారణాల వల్ల సంభవించవచ్చు. చుండ్రు, ఒత్తిడి మరియు కొంత విటమిన్ లోపం వల్ల జుట్టు రాలిపోతుంది. ఖచ్చితమైన కారణాన్ని కనుగొని, పరిష్కారాన్ని కనుగొనడం అవసరం. చుండ్రు మరియు జుట్టు రాలడాన్ని నివారించడానికి మీరు ఇంట్లో ప్రయత్నించే హెయిర్ ప్యాక్ ఇక్కడ ఉంది. దీనికి మీకు కావలసిందల్లా ఉల్లిపాయ రసం, కొబ్బరి నూనె మరియు కలబంద. అవి జుట్టు పెరుగుదలను ప్రోత్సహించే పదార్థాలను కలిగి… -
Chandrababu: ప్రజల్లో జగన్ రెడ్డి పై తీవ్ర అసహనం కనిపిస్తుంది..
బాపట్ల జిల్లా ఇంకొల్లులో నిర్వహించిన రా కదలిరా సభలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగించారు. వైసీపీపై కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ నీ పని, నీ పార్టీ పని ఫినిష్ అని విమర్శించారు. ఈ సభకు వచ్చిన జనాన్ని చూస్తే నీకు నిద్ర పట్టదు.. నీ అవినీతి డబ్బు, అధికార దుర్వినియోగం ఆపుతుందా అని దుయ్యబట్టారు. ప్రజల్లో జగన్ రెడ్డి పై తీవ్ర అసహనం కనిపిస్తుందని తెలిపారు. ఇదిలా ఉంటే.. ఈ సభ కోసమని.. సభా ప్రాంగణానికి… -
TTD: తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఎల్లుండి నుంచి మే నెల దర్శన టిక్కెట్లు
తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) శుభవార్త చెప్పింది. ఎల్లుండి నుంచి ఆన్లైన్లో మే నెల దర్శన టిక్కెట్లను టీటీడీ విడుదల చేయనుంది. మే నెలకు సంబంధించిన ఆర్జిత సేవలు, ప్రత్యేక ప్రవేశ దర్శనం, అంగ ప్రదక్షిణం, వసతి గదుల కోటా విడుదలకు సంబంధించిన షెడ్యూల్‌ను ప్రకటించింది. మే నెలకు సంబంధించిన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన ఆర్జిత సేవల ఆన్ లైన్ లక్కీడిప్ కోసం రిజిస్ట్రేషన్ ఈ నెల 19న ఉదయం… -
ASP’s Transfer : తెలంగాణలో 12 మంది ఏఎస్పీల బదిలీ..
తెలంగాణలో బదిలీల పర్వం కొనసాగుతోంది. తెలంగాణ పోలీసు శాఖలో బదిలీలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే భారీగా డీఎస్పీలు, ఏఎస్పీలను బదిలీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరో 12 మంది అడిషనల్ ఎస్పీలకు స్థానచలనం కలిగించింది. ఈ మేరకు డీజీపీ రవిగుప్తా శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం.. నిజామాబాద్ అడిషనల్ డీసీపీగా ఎస్ రమేశ్, ఆదిలాబాద్ అడిషనల్ ఎస్పీగా సురేందర్ రావు, హైదరాబాద్ ట్రాఫిక్-3 అడిషనల్ డీసీపీగా రామారావు, సైబరాబాద్ క్రైమ్ అడిషనల్ డీసీపీగా… -
YCP: లోకేశ్ ‘కుర్చి మడత పెట్టి’ వ్యాఖ్యలపై వైసీపీ కౌంటర్ ఎటాక్..
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నిన్న విజయనగరం నెల్లిమర్ల శంఖారావం సభలో మాట్లాడుతూ.. ‘నువ్వు చొక్కాలు మడత పెట్టి మా మీదకు వస్తే.. మేము నీ కుర్చీ మడత పెట్టి, నీకు సీటు లేకుండా చేస్తాం’ అని అన్నారు. వేదికపై లోకేశ్ స్వయంగా కుర్చీని మడతపెట్టి చూపించాడు. ఈ క్రమంలో వైసీపీ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. జగన్ దెబ్బకు లోకేష్ నాలుక, చంద్రబాబు కుర్చీ ఎప్పుడో… -
Sriharikota: GSLV-F14 రాకెట్ ప్రయోగం విజయవంతం..
GSLV-F14 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. ఈ వాహననౌక ఇన్సాట్-3డీఎస్ ఉపగ్రహాన్ని నింగిలోకి మోసుకెళ్లింది. అనంతరం 2,275 కిలోల బరువు ఉన్న ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశ పెట్టింది. తిరుపతి జిల్లా సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి సాయంత్రం 5.35 గంటలకు ప్రయోగించారు. -
JP Nadda : ఈ సారి తెలంగాణలో అధికారంలోకి వస్తాం
ఢిల్లీలో బీజేపీ జాతీయ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా జేపీ నడ్డా మాట్లాడుతూ.. ఈ సారి తెలంగాణలో అధికారంలోకి వస్తామన్నారు. కొన్ని సార్లు ఓటమిలో కూడా గెలుపు ఉంటుందని, తెలంగాణలో ఆ మేరకు విజయం సాధించామని ఆయన అన్నారు. గతంలో తెలంగాణ లో బీజేపీకి ఒక శాసనసభ్యుడే ఉన్నాడు.. బీజేపీ ఓటు శాతం అప్పుడు 7.1 శాతం కాగా, ఇప్పుడది రెట్టింపై 14 శాతానికి పెరిగి 8 మంది శాసనసభ్యులు గెలుపొందారన్నారు జేపీ నడ్డా. తెలంగాణలో ఈ… -
IND vs ENG: మూడో రోజు ముగిసిన ఆట.. భారత్ ఆధిక్యం ఎంతంటే..?
భారత్-ఇంగ్లాండ్ మధ్య రాజ్ కోట్లో మూడో టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. కాగా... ఈరోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 322 పరుగుల ఆధిక్యంలో ఉంది. రెండో ఇన్నింగ్స్ లో ఓపెనర్ యశస్వి జైస్వాల్ సెంచరీతో అదరగొట్టగా.. శుభ్‌మన్ గిల్ అర్ధ సెంచరీ చేయడంతో టీమిండియా భారీ స్కోరును నమోదు చేసింది. ఇక ఈరోజు ఆటముగిసే సమయానికి భారత్ స్కోరు 196/2 ఉంది.
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!