ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమయ్యారు. దాదాపు గంటకు పైగా వీరి మధ్య చర్చలు కొనసాగాయి. కాగా.. తెలంగాణలోని జాతీయ రహదారుల నిర్మాణం, అభివృద్ధి పనులపై సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. అందులో భాగంగా.. 15 రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా ఆధునీకరించాలని సీఎం విజ్ఞప్తి చేశారు.
ఇండియా కూటమికి ఒకదాని తర్వాత ఒకటి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. పశ్చిమ బెంగాల్, బీహార్ తర్వాత లోక్సభ స్థానాల పరంగా దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో ఇప్పుడు ప్రతిపక్ష కూటమికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ మధ్య పొత్తు చర్చలు విఫలమయ్యాయి. సోమవారం రాత్రి జరిగిన చర్చలు అర్థాంతరంగానే ముగిసాయి. మొరాదాబాద్ డివిజన్లో కీలకమైన మూడు సీట్ల విషయంలో రెండు పార్టీలు మాకంటే మాకు అన్నట్లుగా వ్యవహరించాయి. దీంతో కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ మధ్య పొత్తు…
తెలంగాణలో బీజేపీ విజయ సంకల్ప యాత్రలు చేపట్టింది. ఇందులో భాగంగా.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కృష్ణమ్మ యాత్రను మక్తల్ కృష్ణ గ్రామంలో కేంద్రమంత్రి పురుషోత్తం రూపాలతో కలిసి కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2013లో ఇదే కృష్ణా నుంచి తెలంగాణ పోరు యాత్ర ప్రారంభించామని తెలిపారు. ఆ తర్వాత కాంగ్రెస్ మెడలు వంచి తెలంగాణ తెచ్చామని చెప్పారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ అన్ని పార్లమెంట్ స్థానాలు బీజేపీ గెలవాలి అని శపథం…
Tribal Welfare Officer: లంచం కేసులో అరెస్ట్ అయిన ట్రైబల్ వెల్ఫేర్ అధికారి జ్యోతి అస్వస్థత గురయ్యారు. దీంతో ఏసీబీ అధికారులు ఆమెను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టో కమిటీ రెండవ సమావేశం అయింది. మ్యానిఫెస్టో కమిటీ కమిటీ ఛైర్మన్ పల్లంరాజు అధ్యక్షతన ఈ భేటీ కొనసాగుతుంది. ఈ మీటింగ్ లో తులసిరెడ్డి, జంగా గౌతం, తాంతియాకుమారి, మస్తాన్ వలి, రమాదేవి, ఉషానాయుడు తదితర నాయకులు ఉన్నారు.
కుటుంబ రాజకీయాలు చేసేవారు.. కేవలం వాళ్లకు లబ్ధి కలిగేలా మాత్రమే చేశారు అంటూ ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపణలు గుప్పించారు. త్వరలో వికసిత్ కశ్మీర్ కల సాకారం అవుతుంది అని చెప్పుకొచ్చారు. జమ్మూ కశ్మీర్ నుంచి ఇలాంటి కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది అని పేర్కొన్నారు. మోడీ గ్యారంటీ అంటే ఇలా ఉంటుందన్నారు.
గత కొద్దీ రోజులగా దేశవ్యాప్తంగా రైతులు చేస్తున్న నిరసనను కేంద్ర ప్రభుత్వం త్వరగా అర్థం చేసుకోవాలి అని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. అందరికీ అన్నం పెట్టే రైతును ఆదుకోవాలని కేంద్రాన్ని ఏపీ- తెలంగాణ రైతుల తరఫున డిమాండ్ చేస్తున్నామన్నారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ త్వరలో ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ వారంలోనే ఆయన హస్తిన టూర్ ఉంటుందని చెబుతున్నారు పార్టీ శ్రేణులు. కాగా.. ఎన్నికల తర్వాత మొదటిసారి ఢిల్లీకి వెళ్తున్నారు. ఆయన మూడు నెలల సమయం తర్వాత ఢిల్లీకి వెళ్తున్నారు. ఎన్నికలు జరిగిన తర్వాత కేసీఆర్ అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. తుంటి నొప్పితో బాధపడిన కేసీఆర్.. ఇప్పుడిప్పుడే కోలుకుని నడవగలుగుతున్నారు. అంతేకాకుండా.. మొన్న నల్గొండలో జరిగిన బహిరంగ సభలో కూడా పాల్గొన్నారు.
మేడిగడ్డ డ్యామ్ ను బూచిగా చూపెట్టి పదే పదే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ విరుచుకుపడ్డారు. ఒక్క 3 ఫిల్లర్లు కుంగాయి.. అయితే వాటిని పునరుద్ధరణ పనులు చేయకుండా.. నాటి తమ ప్రభుత్వం పై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మేడిగడ్డ డ్యామ్ పై మాకు అనుమానం వస్తుంది.. ఎందుకంటే వాళ్ళు కుంగిన ఫిల్లర్ల దగ్గరకు మళ్ళీ నీళ్లు వదులుతున్నారని తెలిపారు.
రాయలసీమ ప్రాంతంలో బీసీలు అధికంగా ఉన్నారని.. వారికి పార్టీలు తగిన ఎమ్మెల్యే స్థానాలు కేటాయించాలని ఆలిండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ (AIOBCSA) నేషనల్ ప్రెసిడెంట్ కిరణ్ కుమార్ తెలిపారు. తిరుపతిలో ఈరోజు ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎమ్మిగనూరులో అధికంగా ఉండే కుర్ణి శాలివాళ్ళకి, తిరుపతిలో అధికంగా ఉండే యాదవులకు, కర్నూల్ ప్రాంతంలో కురుబ సామాజిక వర్గానికి, అనంతపూరం జిల్లాలో అధికంగా ఉండే వాల్మీకి బోయ సామాజిక వర్గానికి తగిన ప్రాముఖ్యమైన…