పరిగి హైవే ఇచ్చింది మోడీ అని, ఎరువుల నుంచి శ్మశానం వరకు అన్ని మోడీ ఇచ్చినవేనన్నారు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చిప్ప పెట్టిపోయిండు, ఇప్పుడు ఈయన చిప్ప పట్టుకుని తిరుగుతున్నాడని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణకు ఇటీవల 9 వేల కోట్ల అప్పు మోడీ ఇచ్చారని, దిక్కులేని పార్టీలు, దిక్కు లేని సిద్ధాంతాలు ఉన్నాయన్నారు రేవంత్ రెడ్డి. మోడీకి పొత్తులు అవసరం లేదని, తెలుగు భాషను మార్చిన వ్యక్తి మోడీ. తెలుగు ప్రజల జీవన ప్రమాణాలు పెంచారు మోడీ అని ఆయన వ్యాఖ్యానించారు. గొప్ప నాయకులు సమాజంలో మార్పు తెస్తారని, మోడీకి కార్యకర్తలు అవసరమన్నారు.
Also Read : Diabetes Care : మధుమేహం నియంత్రణలో లేకుంటే ఇది ట్రై చేయండి
అప్ కి బార్ సత్రా బార్.. దేశం మొత్తం మోడీని చూసిందని ఆయన వ్యాఖ్యానించారు. అనంతరం కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణా రెడ్డి మాట్లాడుతూ… చేవెళ్ల పార్లమెంట్‌ను సీఎం ఇన్ఛార్ గా తీసుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ కు క్యాండిడేట్ లేక పక్క పార్టీ నుంచి క్యాండిడేట్ ను తెచ్చుకున్నాడని, ఒకాయన మూడు నెలల ముందు మంత్రి అయ్యారని ఆయన అన్నారు. తర్వాత ఎన్నికల్లో వాళ్ళ పార్టీ ఓడిపోయిందని, పదవుల కోసం మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరిండని ఆయన విమర్శలు గుప్పించారు. చిల్లు పడ్డ ముంతలో చిల్లర వేసి ఊపుతున్నారు కాంగ్రెస్ నేతలు అంటూ ఆయన ఎద్దెవా చేశారు. ఆరు గ్యారెంటీలు అని గల్లీ రాజకీయాలు చేశారని, ఇప్పుడు ఉన్నాయి ఢిల్లీ రాజకీయాలు అని, ఈ ఎన్నికల్లో నీ ఆరు గ్యారెంటీలు పని చేయవన్నారు.
Also Read : Delhi : ఢిల్లీలో పెను విషాదం.. యమునా నదిలో స్నానానికి వెళ్లిన నలుగురు స్నేహితులు మృతి