కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్ అయ్యారు. ఇవాళ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కిషన్ రెడ్డి.. మాటలు అవమానించే విధంగా ఉన్నాయన్నారు. భువనగిరి ఖిల్లా మీద రోప్ వే వేసుకుందాం అని 200 కోట్లు అడిగానని.. కిషన్ రెడ్డి కనీసం స్పందించలేదని ఆయన మండిపడ్డారు. నాలుగు ఏండ్ల నుండి ఫైల్ దగ్గర పెట్టుకున్నాడని, సొంత రాష్ట్రానికి 200 కోట్లు తెచ్చుకోలేక పోయాడని కోమటిరెడ్డి ధ్వజమెత్తారు. కిషన్ రెడ్డి కాంగ్రెస్ మీద మాట్లాడటం సరికాదని, టచ్ చేసి చూడు మా ప్రభుత్వంని పడగొడతాం అన్నట్టు మాట్లాడుతున్నాడని ఆయన వ్యాఖ్యానించారు. కేబినెట్ మంత్రిగా 200 కోట్లు అవ్వలేని వాడివి.. ఏం మాట్లాడుతున్నావని, గడ్కరీ దగ్గర 3000 కోట్ల పనులు తెచ్చుకున్నానన్నారు. కానీ కిషన్ రెడ్డి 200 కోట్లు ఇవ్వలేదని, పిచ్చి మాటలు మాట్లాడకు కిషన్ రెడ్డి.. అవసరం అయితే ప్రధాని ని కలుస్తామని, నేషనల్ హైవే లు తెస్తామని, కాంగ్రెస్ అబద్ధాలు చెప్పి రాలేదన్నారు.
అంతేకాకుండా..’మోడీ మాట్లాడిన మాటలు ఆడియో చూపెట్టమని అంటావా. 20 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు ..ఇచ్చారా. 500 గ్యాస్..1200 చేసింది మీరు. బ్లాక్ మని తెస్తా అన్నాడు.. జనం బ్యాంకుల్లో ఖాత డబ్బులు కొట్టేశాడు మోడీ. రైతులు ధర్నా చేసినా పట్టించుకోలేదు. త్వరలోనే రెండు.. మూడు రోజుల్లో రెండు హామీలు అమలు చేస్తాం. కిషన్ రెడ్డి మూసి గురించి ఎందుకు ఆలోచన చేయడం లేదు. నమామి గంగా కి 4 వేల కోట్లు పెట్టారు. మూసి కి ఎందుకు నిధులు ఇవ్వలేదు మరి. బీఆర్‌ఎస్ కేసుల నుండి తప్పించుకోవడానికి బీజేపీ తో లోపాయి కారి ఒప్పందం. లోపాయకారి ఒప్పందం లో భాగంగా కేసీఆర్ ఢిల్లీ వెళ్తున్నారు. ఇదే విషయం ఢిల్లీలో ఓ బీజేపీ నాయకుడు చెప్పారు. శత్రువు దగ్గరికి.. వెళ్లి కేటీఆర్‌ని సీఎం గా ఆశీర్వదించండి అన్నారు అంటేనే దోస్తీ కుదిరినట్టు. బీఆర్‌ఎస్ ఖతం అయ్యే పార్టీ. కేఆర్‌ఎంబీ అంటే కేటీఆర్.. హరీష్ రావుకి తెలియదు. మొదటి అసెంబ్లీ సమావేశాలలో కేసీఆర్ సీట్ల కేటీఆర్ కూర్చున్నాడు. రెండు సెషన్ లో ఎందుకో కూర్చోలేదు. హరీష్ ని ముందు పెట్టారు. కేఆర్‌ఎంబీ, జీఆర్‌ఎంబీకి 200 కోట్లు నిధులు పెట్టారు. మీరు అప్పగించకపోతే.. నిధులు ఎందుకు పెట్టారు. బుద్దున్న గాడిద ఎవడైనా సరే.. ఎస్‌ఎల్‌బీసీ ని పూర్తి చేసే వాడు. పదేళ్ళలో ఎందుకు పూర్తి చేయలేదు. వెలిగొండ లో జగన్ రెండు టన్నెల్ మూడేళ్ళలో పూర్తి చేశారు.’ అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.