భారత నావికాదళం విశాఖపట్నంలో నిర్వహిస్తున్న ఫ్లాగ్‌షిప్ నావికా విన్యాసమైన మిలాన్ 2024 12వ ఎడిషన్‌ను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తూర్పు నౌకాదళ కమాండ్ బేస్‌లో మిలాన్ గ్రామాన్ని కూడా ఆయన ప్రారంభించారు. “శాంతి పరిరక్షణలో సాయుధ దళాలు కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని మా చారిత్రక అనుభవం తెలియజేస్తుంది. ఇది నిరోధం, సంఘర్షణ నివారణ వంటి భావనలు,అభ్యాసాలలో కనిపిస్తుంది, ”అని మిలన్ నౌకాదళ వ్యాయామం యొక్క 12వ ఎడిషన్‌లో సింగ్ అన్నారు.
Gold Mine Collapses : వెనిజులాలో కూలిన బంగారు గని.. ప్రాణాలు పొగొట్టుకున్న డజన్ల కొద్ది ప్రజలు
అయితే.. నేడు విశాఖపట్నంలో సిటీ పరేడ్ ను నిర్వహించనున్నారు. ఆర్కే బీచ్‌లో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్, గవర్నర్ అబ్దుల్ నజీర్‌లు హాజరు కానున్నారు. నావికాదళం విన్యాసాలను తిలకించేందుకు నేడు లక్షల సంఖ్యలో జనం రానున్నారు. తొలి విమాన వాహక నౌక ఐేఎస్ విక్రాంత్ విశాఖపట్నం తొలిసారి రానుంది. విశాఖలోనే మరో వాహన యుద్ధనౌక విక్రమాదిత్య రానున్నారు.
TDP- Janasena Meeting: నేడు టీడీపీ- జనసేన సమన్వయ కమిటీ భేటీ.. సీట్ల పంపిణీపై కీలక చర్చ