తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం జాతరకు అట్టహాసంగా ప్రారంభమైంది. నేటి నుంచి నాలుగు రోజుల పాటు జాతర కొనసాగనుంది. జాతరలో ముఖ్య ఘట్టమైన పగిడిద్దరాజు, గోవిందరాజులు నేడు గద్దెలపైకి రానున్నారు. అంతేకాకుండా.. మధ్యాహ్నం కన్నెపల్లి నుంచి గద్దెపైకి సారలమ్మను తీసుకురానున్నారు. అయితే.. మేడారం జాతరకు కోటిన్నర మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు అధికారులు. సాధారణ భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. మేడారం జాతరకు 6 వేల ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది…
స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. హైదరాబాద్ లో ఎంతంటే? మహిళలకు అదిరిపోయే గుడ్ న్యూస్.. స్వల్పంగా బంగారం ధరలు తగ్గాయి… అలాగే వెండి ధరలు కూడా భారీగా తగ్గినట్లు తెలుస్తుంది.. ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 10 రూపాయలు తగ్గి..రూ. 57,350 వద్ద ఉండగా, అలాగే 24 క్యారెట్ల పసిడి ధర పై రూ. 10 తగ్గి.. రూ. 62,560 వద్ద ఉంది.. అలాగే వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి..…
ఇవాళ కొడంగల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి రేవంత్ రెడ్డి నియోజకవర్గానికి రానున్నారు. ఈ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి నారాయణపేట్-కొడంగల్ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేయనున్నారు. కొడంగల్ లో వైద్య, నర్సింగ్, ఫిజియోథెరపీ కళాశాలల పనులకూ శ్రీకారం చుట్టనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. నియోజకవర్గంలో మొత్తం రూ.4369.143 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఇవాళ సాయంత్రం హెలికాఫ్టర్ లో కోస్గి చేరుకోనున్న సీఎం…
అంతరిక్షంలోకి అణ్వాయుధాలను పంపడాన్నికి తాము పూర్తి వ్యతిరేకమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చెప్పారు. అంతరిక్ష ఆధారిత యాంటీ శాటిలైట్ ఆయుధాలను రష్యా అభివృద్ధి చేస్తోందంటూ అమెరికా చేసిన ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు.
తెలంగాణలో నేడు రెండో రోజు బీజేపీ విజయ సంకల్ప యాత్రలు కొనసాగనున్నాయి. నారాయణపేట, మహబూబ్నగర్లో రోడ్ షోల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొననున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో కృష్ణమ్మ విజయ సంకల్ప యాత్రలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొంటారు. నారాయణపేట పట్టణం శాసన్ పల్లి రోడ్, లక్ష్మీ ఫంక్షన్ హల్ లో ఉదయం 9గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ధన్వాడలో రోడ్ షో, స్థానిక మహిళలతో కిషన్ రెడ్డి భేటీ కానున్నారు. దేవరకద్ర, లాల్…
కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను తిరస్కరించిన రైతులు ఇవాళ పాదయాత్రకు రెడీ అయ్యారు. ఈ క్రమంలో నేటి ఉదయం 11 గంటలకు పాదయాత్ర చేస్తామని రైతులు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
పండంటి రెండో బిడ్డకు జన్మనిచ్చిన టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, అనుష్క దంపతులు తమ కొడుకుకు 'అకాయ్' అని నామకరణం చేశారు. అయితే ఆ పేరుకు అర్థం ఏంటంటే ప్రకాశించే చంద్రుడని అర్థం. ఈ పేరు టర్కిష్ మూలానికి చెందినది. ఇక మొదటి కుమార్తెకు 'వామిక' అని పేరు పెట్టారు. వామిక అంటే దుర్గాదేవి అని అర్థం. శివుడిలో సగభాగమైన పార్వతీ దేవి మరోపేరు వామిక. అలాగే విరాట్-అనుష్క పేర్లు కలిసేలా ఈ పేరు ఉంది.
నిమ్మరసంతో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అంతేకాకుండా.. నిమ్మకాయ తొక్కల వల్ల కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మన ఆరోగ్యానికి నిమ్మరసం ఎంత ముఖ్యమో.. నిమ్మ తొక్కలు కూడా అంతే ముఖ్యమని చెబుతున్నారు. అద్భుతమై ప్రయోజనాలు అందిస్తాయి. సాధారణంగా పండ్లు, కూరగాయలపై ఉన్న తొక్కలు తీసి పారేస్తాం. కొన్ని కూరగాయల తొక్కలతో పచ్చళ్లు చేసుకుని తింటారు. అయితే సాధారణంగా నిమ్మకాయను మాత్రం మనం రసం కోసం వాడుతుంటాం. కానీ నిమ్మతొక్క వల్ల…
విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దంపతులు తమ రెండో బిడ్డకు తల్లిదండ్రులు అయ్యారు. ఫిబ్రవరి 15న అనుష్క శర్మ మగబిడ్డకు జన్మనిచ్చింది. తాజాగా ఈ విషయాన్ని విరాట్ కోహ్లీ సోషల్ మీడియాలో ప్రకటించారు. కాగా.. తన కుమారుడికి 'అయాయ్' అని నామకరణం చేశారని తెలిపారు. ఇంతకుముందు కోహ్లీ, అనుష్క దంపతులకు మొదటి సంతానంలో కూతురు వామిక జన్మనిచ్చింది.