బండి సంజయ్ కి ఏం తెలియదని, ఆయన ని అంత సీరియస్‌గా తీసుకోకండి అంటూ వ్యాఖ్యానించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మా ఆస్తులపై విచారణకి సిద్ధమన్నారు. అంతేకాకుండా.. అవినీతిపరుడైన వ్యక్తి నిజాయితీ గల మీద ఆరోపణలు చేయడం సరికాదని ఆయన హితవు పలికారు. ప్రజాస్వామ్యంలో మోడీ చర్యలు దుర్మార్గమని ఆయన విమర్శించారు. ప్రభుత్వాలు కూల్చడం దుర్మార్గమని, తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీ.. బీఆర్‌ఎస్ ఉండవని ఆయన వ్యాఖ్యానించారు.
బీజేపీ ఒకటి.. రెండు సీట్లు గెలవచ్చని, ఎస్‌ఎల్‌బీసీ రెండు ఏళ్లలో పూర్తి అయ్యిందన్నారు. బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్ట్ ఏడాదిన్నర లో పూర్తి చేస్తామన్నారు. అరవింద్.. సంజయ్ పెద్ద నాయకులు అని, ఎమ్మెల్యేలుగానే ఓడిపోయారని, ఎంపీలుగా గెలుస్తారా..? అని ఆయన చురకలు అంటించారు. బ్రేకింగ్స్ కోసమే ఇద్దరు మాట్లాడతారన్నారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాజీ మంత్రి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై నిప్పులు చెరిగారు. కేటీఆర్ నీది రేవంత్ స్థాయి కాదని, కేటీఆర్ సిరిసిల్లలో రాజీనామా చేయమని చెప్పండన్నారు. నేను పోటీ చేసి గెలిచి వస్తానని ఆయన సవాల్ విసిరారు. ఓడిపోతే.. నేను రాజకీయాలకు దూరంగా ఉంటానని, 10 ఏండ్లు వందల కోట్లు ఖర్చు పెట్టి 30 వేలతో నే గెలిచావన్నారు. కేటీఆర్ ఓడిపోతే కేసీఆర్ పార్టీ ని మూసేసుకుంటా అని చెప్పాలన్నారు.
Simhachalam: అప్పన్న స్వామి భక్తులకు త్రుటిలో తప్పిన పెను ప్రమాదం