రాష్ట్రంలో మళ్లీ వచ్చేది వైసీపీ ప్రభుత్వమేనని ఆ పార్టీ గిద్దలూరు నియోజకవర్గ సమన్వయకర్త, ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి పేర్కొన్నారు. మండలంలోని బీసీ భవనంలో గురువారం సాయంత్రం నిర్వహించిన వైసీపీ శ్రేణుల ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
విజయ సంకల్ప యాత్ర రోడ్ షో సందర్బంగా వారసిగూడాలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏప్రిల్ మెుదటి వారంలో దేశ వ్యాప్తంగా ఎన్నికలు జరగనున్నాయని, ఈ దేశంలో అవీనితిరహిత, శాంతి భద్రతలు బడుగు బలహీనులకు సంక్షేమ పాలనకు అందించే విధంగా తొమ్మిదిన్నర ఏళ్ళుగా నరేంద్ర మోడీ ప్రభుత్వం పాలనను కొనసాగిస్తుందన్నారు. ఈ దేశం కోసం, పిల్లల భవిష్యత్, పేదల ప్రజల సంక్షేమం కోసం ఓటు వేసే విధంగా ప్రజలను చైతన్యం చేయడానికే…
విశాఖ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలంలో అప్పన్న స్వామి భక్తులకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. సింహాచలంలోని కేశ ఖండన శాలలో పైకప్పు పెచ్చులు కూలిపడ్డాయి.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మార్చి 4, 5 తేదీల్లో తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్న నేపథ్యంలో చేపట్టాల్సిన ఏర్పాట్లపై గురువారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ర్ట సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రధాన మంత్రి పర్యటనకు సంబంధించి జరుగుతున్న ఏర్పాట్ల వివరాలను ఆమె అడిగి తెలుసుకున్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను సిఎస్ ఆదేశించారు. ప్రధాన మంత్రి 4వ తేదీన ఆదిలాబాద్,…
బీజేపీ నేత భాస్కర్ గౌడ్ తన మీద తానే హత్య ప్రయత్నం చేయించుకున్నట్లు పోలీసుల గుర్తించారు. వివరాల్లోకి వెళితే.. బీజేపీ నేత భాస్కర్ గౌడ్ నామీద హత్య ప్రయత్నం జరిగిందని ఉప్పల్ పోలీసులను ఆశ్రయించారు. దీంతో.. కేసు నమోదు చేసుకొని ఉప్పల్ పోలీసులు విచారణ చేపట్టారు. విచారణలో భాస్కర్ గౌడ్ నిందితుడని తెలియడంతో అతనితో పాటు ఇంకో ఆరుగురిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. వారికి కోర్టు రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు పోలీసులు. ఈ నేపథ్యంలో…
తెలంగాణ కాంగ్రెస్‌లో ఏక్ నిరంజన్ తయారయ్యారా? అంతా తానై నడపాలనుకుంటున్నారా? ఢిల్లీ స్థాయిలో నా పరపతి అరచేతి మందాన ఉంది. మిగతా వాళ్ళని లెక్కచేయాల్సిన అవసరం ఏంటని అనుకుంటున్నారా? తనలాగే వచ్చిన వారిని కావాలని పక్కకు పెడుతున్నారా? ఇంతకీ ఎవరా నేత? ఎందుకలా ప్రవర్తిస్తున్నారు? సమన్వయ లోపం, పరస్పరం గోతులు తీసుకోవడం, కలహించుకోవడమన్నది కాంగ్రెస్ పార్టీలో కామన్. అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ గనుక మా పార్టీలో అలాగే ఉంటుంది. అదే మాకు బలం అని కూడా…
పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి కొడాలి నాని కౌంటర్ తాడేపల్లిగూడెం జెండా సభలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు. పవన్ కల్యాణ్ సీఎం జగన్‌ను తొక్కడం కాదు.. పవన్ కల్యాణ్‌ను నాశనం చేస్తున్న చంద్రబాబును 80 లక్షల పాదాలు తిరిగి లేవకుండా పాతాళానికి తొక్కుతాయన్నారు. కుక్క కాటుకు చెప్పు దెబ్బలా కాపు సామాజిక వర్గం చంద్రబాబుకి బుద్ధి చెబుతుందన్నారు. ప్రజలకు ఏం చేస్తారో చెప్పకుండా చంద్రబాబు, పవన్ కల్యాణ్…
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు ప్రచార కార్యక్రమాల్ని వేగవంతం చేశాయి. మార్చి 6 నుంచి సరికొత్త కార్యక్రమంతో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లనున్నారు.