కేంద్రం జోక్యంతో భారతీయ యాప్‌ల పునరుద్ధరణకు అంగీకరించిన గూగుల్..
సర్వీస్ ఫీజుల వివాదంతో గూగుల్ తన ప్లే స్టోర్ నుంచి భారతీయ యాప్‌లను తొలగించింది. అయితే, దీనిపై సదరు యాప్‌ల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఈ వివాదంతో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడంతో సమస్య కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గూగుల్ కంపెనీ అధికారులతో సమావేశమైన తర్వాత, తొలగించిన యాప్‌లను పునరుద్ధరించేందుకు గూగుల్ అంగీకరించినట్లు సమాచారం.
శుక్రవారం గూగుల్ 10 భారతీయ కంపెనీలకు చెందిన యాప్‌లను తొలగించింది. దీంతో ఒక్కసారిగా వివాదం ఏర్పడింది. నౌకరి, 99 ఎకర్స్, భారత్ మ్యాట్రిమోనీ వంటి ప్రసిద్ధ యాప్‌లను తొలగించింది. గూగుల్ యాప్‌లపై 11 నుంచి 26 శాతం వరకు రుసుము విధించడం వివాదానికి కారణమైంది. భారతీయ స్టార్టప్‌లు గూగుల్ అన్యాయమైన విధానాలు అవలంభిస్తోందని నిరసన వ్యక్తం చేస్తున్నాయి. 94 శాతం ఆండ్రాయిడ్ ఆధారిత మొబైల్స్ వాడుతున్న భారత్‌పై గూగుల్ ఆధిపత్యం చెలాయిస్తుందనే విమర్శలు ఉన్నాయి. తొలగించిన యాప్స్‌లో ఆల్ట్ బాలాజీ, భారత్ మాట్రిమోనీ, కుకు ఎఫ్ఎం, షాదీ. కామ్ వంటి పలు యాప్స్ ఉన్నాయి. ఈ యాప్స్ తొలగింపుపై స్టే విధించాలని గత నెల సంబంధిత కంపెనీలు సుప్రీంకోర్టును ఆశ్రయించగా కోర్టు అందుకు నిరాకరించింది. దీనిపై ఈ నెల 19న మరోసారి విచారణ జరగనుంది.
యాదాద్రి కాదు ఇకపై యాదగిరిగుట్టనే
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్బంగా యాదాద్రి పేరును యాదగిరి గుట్టగా మారుస్తూ త్వరలోనే జీఓ ఇస్తామని మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. కేటీఆర్ తండ్రి చాటు కొడుకు అంటూ సెటైర్లు వేశారు కోమటిరెడ్డి. నేను ఉద్యమాలు చేసి వచ్చానని, నాలెడ్జ్ లేని కేటీఆర్ గురించి మాట్లాడడం వేస్ట్ అంటూ చురకలు అంటించారు.
ఫ్లోర్ లీడర్ ఇవ్వకపోతే హరీష్ కూడా బీజేపీ లోకి పోతాడని, కాళేశ్వరం కట్టిన చీఫ్ డిజైనర్ కేసీఆర్ మేడిగడ్డ ఎందుకు పోలేదంటూ ఆయన ప్రశ్నలు వర్షం కురిపించారు. కాళేశ్వరం పనికిరాదని NDSA రిపోర్ట్ ఇచ్చిందని, ప్రజలే కేసీఆర్ నీ నామరూపాలు లేకుండా చేశారన్నారు. ఎంపీ అభ్యర్థులపై ఇంటర్నల్ సర్వే జరుగుతోందని, భువనగిరి నుండి పోటీ చేయమని రాహుల్ గాంధీకి చెప్పానని ఆయన వెల్లడించారు. భువనగిరి, ఖమ్మం, నల్గొండలో సౌత్ ఇండియాలో టాప్ మెజార్టీ వస్తుందని, మోడీ కంటే రాహుల్ గాంధీ ఎక్కువ మెజారిటీతో గెలుస్తారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించారు.
టీఎంసీ దౌర్జన్యాలు, ద్రోహానికి పర్యాయపదం.. మమత పార్టీపై పీఎం ఫైర్..
ప్రధాని నరేంద్రమోడీ మరోసారి తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)పై విరుచుకుపడ్డారు. పశ్చిమ బెంగాల్ నదియా జిల్లాలోని కృష్ణానగర్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన టీఎంసీని అవినీతి పార్టీగా ఆరోపించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బెంగాల్‌లోని 42 స్థానాలను గెలుచుకోవాలని రాష్ట్ర బీజేపీకి టార్గెట్ నిర్దేశించారు. కృష్ణానగర్‌లో జరిగిన ‘బిజోయ్ సంకల్ప సభలో’ ఆయన మాట్లాడుతూ.. మీరంతా ఇక్కడకు ఇంత భారీ సంఖ్యలో తరలిరావడం చూస్తుంటే ఎన్డీయే సర్కార్ 400 స్థానాలను కైవసం చేసుకుంటుందనే ఆత్మవిశ్వాసం కలుగుతోందని ప్రధాని అన్నారు. టీఎంసీ దౌర్జన్యాలు, కుటుంబ రాజకీయాలు, ద్రోహానికి పర్యాయపదమని విమర్శించారు. బెంగాల్ ప్రజలు రాష్ట్ర ప్రభుత్వ పనితీరును చూసి నిరాశ చెందారన్నారు. సందేశ్‌ఖలీ మహిళలపై లైంగిక వేధింపులను గురించి ప్రస్తావిస్తూ.. ఈ ప్రాంతంలోని బాధలో ఉన్న తల్లులు, సోదరీమణులకు మద్దతు ఇవ్వాల్సిందిపోయి, రాష్ట్ర ప్రభుత్వం నిందితుల పక్షాన ఉందని పీఎం ఆరోపించారు. అక్కడి మహిళలు న్యాయం కోసం గళమెత్తినా ప్రభుత్వం వినలేదని అన్నారు.
గౌతమ్ గంభీర్ తర్వాత బీజేపీకి మరో ఎంపీ షాక్..
బీజేపీ ఎంపీ జయంత్ సిన్హా ఆ పార్టీకి షాక్ ఇచ్చాడు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తాను పోటీ చేయనని, ఎన్నికల బాధ్యతల నుంచి తప్పించాలని పార్టీ చీఫ్ జేపీ నడ్డాను కోరారు. జయంత్ సిన్హా మాజీ కేంద్రమంత్రి పనిచేశారు, హజారీబాగ్‌కి బీజేపీ ఎంపీగా ఉన్నారు. తాను భారత్, ప్రపంచం ఎదుర్కొంటున్న వాతావరణ మార్పులపై దృష్టి పెట్టాలని అనుకుంటున్నట్లు వెల్లడించారు.
గతంలో నరేంద్రమోడీ క్యాబినెట్‌లో సిన్హా ఆర్థిక, పౌరవిమానయాన శాఖ సహాయమంత్రిగా పనిచేశారు. తనకు అవకాశాలు అందించిన ప్రధాని నరేంద్ర మోడీ మరియు కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు కృతజ్ఞతలు తెలిపారు. గత పదేళ్లుగా భారత్, హజారీబాగ్ ప్రజలకు సేవ చేసే భాగ్యం నాకు లభించిందని అన్నారు. దీనికి ముందు పార్టీ ప్రముఖ నాయకుడు, మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ కూడా జేపీ నడ్డాకు ఇదే రకమైన విజ్ఞప్తి చేశారు. తాను క్రికెట్‌పై దృష్టి పెట్టేందుకు తనను ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పించాలని కోరారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) రాబోయే ఎడిషన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కెకెఆర్) ఫ్రాంచైజీకి మెంటార్‌గా గంభీర్ వ్యవహరించనున్నారు. గంభీర్ ప్రస్తుతం తూర్పు ఢిల్లీ ఎంపీగా ఉన్నారు.
బీజేపీ లోక్‌సభ ఎన్నికల కోసం తొలి విడత అభ్యర్థులను ఈ రోజు ప్రకటిస్తుందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇద్దరు ఎంపీలు ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశం అయింది. బీజేపీ ఈ రోజు 100-120 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించబోతోంది. ఈ జాబితాలోనే ప్రధాని నరేంద్రమోడీతో పాటు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
పవన్‌కు మళ్లీ జోగయ్య లేఖ.. ఈసారి ఏం సలహా ఇచ్చారంటే!
జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు (Pawan kalyan) కాపు నేత, మాజీ మంత్రి హరిరామ జోగయ్య (Harirama Jogaiah) మరో లేఖ రాశారు. ఇటీవలే జనసేనానికి జోగయ్య సలహాలు.. సూచనలు ఇస్తూ లేఖ రాశారు. కానీ పవన్ మాత్రం తీవ్రంగా వ్యతిరేకించారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జరిగిన సభలో పవన్ మాట్లాడుతూ తనకు సలహాలు.. సూచనలు ఇవ్వొద్దని వార్నింగ్ ఇచ్చారు.
కానీ.. తాజాగా హరిరామ జోగయ్య మరో లేఖ రాశారు. పవన్ కళ్యాణ్ రాష్ట్ర అధికారంలో భాగస్వామి అయ్యేవరకు తన పోరాటం ఆగదని లేఖలో పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ ఎదుగుదలే తనకు ముఖ్యమని చెప్పుకొచ్చారు. తాను చచ్చేంత వరకు జనసేనతోనే ఉంటానని ప్రకటించారు. చంద్రబాబు, నారా లోకేష్ భవిష్యత్‌ను కోరుకునేవాళ్లే తనను విమర్శిస్తున్నారని చెప్పుకొచ్చారు. వీళ్లంతా జనసేన గొడుగు కింద ఉంటూ తెలుగుదేశం కోవర్టులుగా ఉంటారని ఆరోపించారు. పవన్‌కల్యాణ్‌ను కాదని.. చంద్రబాబు భవిష్యత్ కోరుకునే వారిని ఇంతకన్నా ఏమనాలని తెలిపారు. తనను ఎవరు ఏమన్నా.. తన పని మాత్రం చేసుకుంటూ పోతానని హరిరామ జోగయ్య లేఖలో తేల్చిచెప్పారు.
గుండెపోటుకు కోవిడ్ వ్యాక్సిన్ కారణం కాదు.. కేంద్ర ఆరోగ్య మంత్రి..
ఇటీవల కాలంలో పెరుగుతున్న గుండెపోటు మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్‌కి సంబంధం ఉందనే వార్తల నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా క్లారిటీ ఇచ్చారు. గుండెపోటుకు కోవిడ్ వ్యాక్సిన్‌లు కారణం కాదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) నిర్వహించిన అధ్యయనాన్ని ఉటంకిస్తూ మాండవియా శనివారం తెలిపారు. ఏఎన్ఐ డైలాగ్స్ 2024లో ఆయన మాట్లాడుతూ.. ఈ రోజు ఎవరికైనా స్ట్రోక్ వచ్చినట్లయితే, అది కోవిడ్ వ్యాక్సిన్ వల్లే అనే భావిస్తున్నారు, గుండెపోటుకు కోవిడ్ వ్యాక్సిన్ కారణం కానది ఐసీఎంఆర్ ఒక వివరణాత్మక అధ్యయనం తెలియజేసిందని అన్నారు.
గుండెపోటుకి జీవనశైలి, పొగాకు, మద్యపానం వంటి అనేక కారణాలు ఉన్నాయని ఆయన తెలిపారు. కొన్ని సార్లు తప్పుడు సమాచారం ప్రజల్లోకి వ్యాపిస్తుందని, కొంత సమయం తర్వాత అవగాహన వస్తుందని మాండవియా అన్నారు. కోవిడ్ వ్యాక్సిన్ కారణంగా యువకుల్లో హార్ట్ ఎటాక్ కేసులు పెరుగుతున్నాయనే వార్తలు వ్యాపిస్తున్న నేపథ్యంలో ఐసీఎంఆర్ అధ్యయనం నవంబర్, 2023లో వెలువడింది.
7న అనకాపల్లిలో వైఎస్సాఆర్ చేయూత కార్యక్రమం
ఈనెల 5, 7వ తేదీల్లో సీఎం జగన్ (CM Jagan) ఉమ్మడి విశాఖ జిల్లాలో పర్యటించనున్నట్లు మంత్రి గుడివాడ అమర్నాథ్ (Gudivada Amarnath) తెలిపారు. విశాఖలో మంత్రి మీడియాతో మాట్లాడారు. మార్చి 5న విజన్ ఫర్ వైజాగ్ పేరుతో పారిశ్రామిక వేత్తలు సమావేశమవుతున్నారని తెలిపారు. ఈ సమావేశానికి 2000 మంది హాజరుకానున్నారని పేర్కొన్నారు.
రానున్న రోజుల్లో వైజాగ్‌ను మరింతగా ఎలా అభివృద్ధి చేయనున్నారో సీఎం జగన్ వివరించనన్నారని మంత్రి తెలిపారు. రూ. 1500 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారని వెల్లడించారు. స్కిల్ డెవలప్‌మెంట్‌కు సంబంధించిన కార్యక్రమంలో కూడా సీఎం పాల్గొంటారని పేర్కొన్నారు.
పేదలకు గుడ్‌న్యూస్.. ఈ నెల 11న ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభం
ఆరు గ్యారంటీల అమల్లో భాగంగా మరో గ్యారెంటీ పై ఫోకస్ పెట్టింది రేవంత్ సర్కార్. ఇందిరమ్మ ఇండ్ల పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఇండ్లు లేని వారికి ఇంటి స్థలం, 5 లక్షలు, తెలంగాణ ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం పై కసరత్తు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటి వరకు ఇండ్లు లేని నిరుపేదలు ఎంతమంది ఉన్నారో.. ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్న వివరాలు తెలుసుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గతంలో ప్రభుత్వం మంజూరు చేసిన ఇండ్ల లబ్దిదారుల వివరాలు ముఖ్యమంత్రికి గృహ నిర్మాణ శాఖ అధికారులు అందజేశారు.
తెలంగాణ బీజేపీ ఎంపీ అభ్యర్థులు వీరే.. ఎవరెవరు ఎక్కడి నుంచి అంటే..
బీజేపీ మరోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చేందుకు పక్కా వ్యూహంతో వెళ్తోంది. మరికొన్ని రోజుల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనుండటంతో అన్ని పార్టీల కన్నా ముందుగానే బీజేపీ 195 మందితో తొలి జాబితాను విడుదల చేసింది. ప్రధాని నరేంద్రమోడీతో పాటు కేంద్రమంత్రులు అమిత్ షా, మన్సుఖ్ మాండవీయ, రాజీవ్ చంద్రశేఖర్, జ్యోతిరాదిత్య సింథియా, శివరాజ్ సింగ్ చౌహాన్ వంటి ప్రముఖ నేతలు తొలి లిస్టులోనే ఉన్నారు.
195 మందిలో 34 మంది మంత్రులు, 28 మంది మహిళలకు, 47 మంది యువతకు చోటు దక్కింది. సామాజిక వర్గాల పరంగా చూస్తే..ఎస్సీలకు 27, ఎస్టీలకు 18, ఓబీసీలకు 57 స్థానాలు కేటాయించారు. తెలంగాణలోని మొత్తం 17 ఎంపీ స్థానాలకు గానూ తొలివిడతలో 9 మంది పేర్లను ప్రకటించారు.
గోరంట్ల బుచ్చయ్య చౌదరిపై మంత్రి ఫైర్
టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరిపై (Gorantla butchaiah chaudhary) మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ (Chelluboina venugopal) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి మీడియాతో మాట్లాడారు. ఎన్నికల ముందే బుచ్చయ్య చౌదరి ఓటమిని అంగీకరించారని వ్యాఖ్యానించారు. రెండు పర్యాయాయాలు ఎమ్మెల్యేగా పని చేసినా రాజమండ్రి రూరల్ నియోజకవర్గ అభివృద్ధి మాత్రం శూన్యమని ఆరోపించారు. ఎన్నికల్లో గెలిచాక అమెరికాకు వెళ్లిపోవడం.. ఆ తర్వాత కరోనా సమయంలో ఇంటి నుంచి బయటకు రాకపోవడంతో గోరంట్ల ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని మంత్రి చెప్పుకొచ్చారు.
టిక్కెట్ కోసం అధిష్టానాన్ని మెప్పించడానికి అధికార పార్టీపై ఘాటు విమర్శలు చేస్తున్నారా? అని మంత్రి ప్రశ్నించారు. అధికారమంటే మీకు లాగా అహంకారం కోసం కాదు? సేవ కోసమే అన్నారు. ఇసుక ద్వారా ప్రభుత్వానికి నాలుగు వేల కోట్ల రూపాయలు జమ చేశామని.. ఇసుక దోపిడీకి పాల్పడింది టీడీపీ పార్టీనేనని ధ్వజమెత్తారు. నేషనల్ ట్రిబ్యునల్ అధారిటీ ఇసుక దోపిడీపై జరిమానా వేసింది తెలుగుదేశం హాయంలోనేనని తెలిపారు. తనపై ఇసుక దోపిడీ ఆరోపణ చేయటం విడ్డూరంగా ఉందన్నారు. వాలంటీర్ వ్యవస్థపై ప్రతిపక్షాలు ఏడుస్తున్నాయని.. ప్రతిపక్ష పార్టీలకు వాలంటీర్ వ్యవస్థ గురించి ఏం తెలుసు అని మంత్రి నిలదీశారు.
రవీంద్రభారతిలో దుద్దిళ్ల శ్రీపాదరావు 87వ జయంతి ఉత్సవాలు
రవీంద్రభారతిలో దుద్దిళ్ల శ్రీపాదరావు 87వ జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథులుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, హాజరైన శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, శాసన మండలి స్పీకర్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీపాదరావు చిత్రపటానికి నివాళులు అర్పించారు సీఎం, మంత్రులు. రవీంద్రభారతి ఆవరణలో ఏర్పాటు చేసిన శ్రీపాదరావు ఫోటో ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. మా తండ్రి జయంతి ఉత్సవాలను ప్రభుత్వం తరపున జరుపుతున్నందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు. దేశానికి స్పూర్తిదాయకమైన పీవి నర్సింహ రావు కు ప్రధాన శిష్యుడుగా ఉన్నారన్నారు. ప్రజల కోసం సేవ చేస్తూ మా నాన్న గారు ప్రాణాలు కోల్పోయారని, మా తండ్రి ఆశయాలకు నెరవేర్చేందుకు నేను రాజకీయాల్లోకి వచ్చానని ఆయన తెలిపారు.
జగన్‌తోనే బీసీల అభివృద్ధి సాధ్యం
ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డితోనే (CM Jagan) బీసీల అభివృద్ధి సాధ్యమని వైసీపీ రాజ్యసభ ఎంపీ, బీసీ నేత ఆర్.కృష్ణయ్య (R. Krishnaiah) తెలిపారు. విజయవాడలో జరిగిన బీసీ సంఘాల ఆత్మీయ సమావేశంలో ఆర్.కృష్ణయ్య పాల్గొని మాట్లాడారు. ఇంత కాలం 50 శాతం పదవుల కోసం కొట్లాడామని.. కానీ సీఎం జగన్ మాత్రం 70 శాతం పదవులు ఇస్తున్నారని ఆర్.కృష్ణయ్య కొనియాడారు. కర్ణాటక, తమిళనాడులో ఉన్న బీసీ ముఖ్యమంత్రులు కూడా 50 శాతం కూడా పదవులు ఇవ్వలేకపోతున్నారని విమర్శించారు. జగన్‌ను దేశం మొత్తం కీర్తిస్తోందని.. బీసీలంతా వాస్తవం తెలుసుకోవాలని సూచించారు.
జగన్ కుర్చీ మడతపెట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు
జగన్ (CM Jagan) పులివెందుల రాజకీయాలు, పంచాయితీలు చేస్తే కుర్చీ మడతపెట్టి ఇంటికి పంపిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) హెచ్చరించారు. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలోని దాచేపల్లిలో ఏర్పాటు చేసిన ‘రా.. కదలిరా’ సభలో నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయనకు చంద్రబాబు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడారు.
ఓడిపోవడానికి జగన్ సిద్ధంగా ఉన్నారని.. జగన్ సీట్లు ఇస్తానంటే కూడా వద్దని నాయకులు రాజీనామాలు చేస్తున్నారని తెలిపారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వైసీపీ నుంచి వెళ్లిపోతున్నారని చెప్పుకొచ్చారు. పల్నాడును అభివృద్ధి చేసే బాధ్యత టీడీపీ-జనసేనల ప్రభుత్వం తీసుకుంటుందన్నారు.