200 యూనిట్ల ఉచిత విద్యుత్తు ‘గృహ జ్యోతి’ పథకం అమల్లోకి రావడంతో తెలంగాణలోని విద్యుత్ పంపిణీ సంస్థలు శుక్రవారం నుంచి అర్హులైన కుటుంబాలకు ‘జీరో బిల్లులు’ జారీ చేయడం ప్రారంభించాయి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో ఒకటైన ఈ పథకంలో అర్హులైన లబ్ధిదారులకు విద్యుత్ పంపిణీ సంస్థల ఉద్యోగులు ప్రజల ఇళ్లకు వెళ్లి ‘జీరో బిల్లులు’ జారీ చేయడం కనిపించింది. తెల్ల రేషన్ కార్డులు (బీపీఎల్ కుటుంబాలు) కలిగి ఉండి, ఆధార్ కార్డులతో…
ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థల్లో (ఐటీఐ) ఖాళీగా ఉన్న 71 అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్ (ఏటీఓ) పోస్టులకు కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని ఉపాధి, శిక్షణ శాఖ డైరెక్టర్, ఐఏఎస్ డా. బి.నవ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
నేడు బీజేపీ తొలి జాబితా.. లిస్ట్‌లో మోడీ, అమిత్ షా! పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ముందుకు దూసుకుపోతుంది. ఇప్పటికే కొన్నిచోట్ల ప్రచారాలు కూడా మొదలెట్టింది. ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండంతో త్వరలోనే అభ్యర్థుల పేర్లను ఖరారు చేయనుంది. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఖరారు చేసేందుకు ప్రధాని మోడీ సారథ్యంలో పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) గురువారం సమావేశం అయింది. గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము…
మైలవరం టీడీపీలో పొలిటికల్ రచ్చ జరుగుతోంది. వసంత వర్సెస్ దేవినేనిగా మారిన మైలవరం నియోజకవర్గ రాజకీయాలు మారిపోయాయి. పోటా పోటీ కార్యక్రమాల దెబ్బకి టీడీపీ క్యాడర్లో హైరానా మొదలైనట్లు తెలుస్తోంది.
బీఆర్ఎస్ పార్టీ భారీ షాక్ తగిలింది. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల వేళ బీఆర్ఎస్కు చెందిన జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ బీజేపీలో చేరారు. కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సమక్షంలో బీజేపీలో చేరారు బీబీ పాటిల్.
బండి సంజయ్ కి ఏం తెలియదని, ఆయన ని అంత సీరియస్‌గా తీసుకోకండి అంటూ వ్యాఖ్యానించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మా ఆస్తులపై విచారణకి సిద్ధమన్నారు. అంతేకాకుండా.. అవినీతిపరుడైన వ్యక్తి నిజాయితీ గల మీద ఆరోపణలు చేయడం సరికాదని ఆయన హితవు పలికారు. ప్రజాస్వామ్యంలో మోడీ చర్యలు దుర్మార్గమని ఆయన విమర్శించారు. ప్రభుత్వాలు కూల్చడం దుర్మార్గమని, తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీ..…
టీడీపీని శాసించే స్థాయిలో ఉండి జనసేన 24 సీట్లకే పరిమితం కావడంపై మాజీ మంత్రి హరిరామ జోగయ్య తన లేఖలో స్పష్టం చేశారు. రాజ్యాధికారంలో పవన్ కల్యాణ్‌కు దక్కే ప్రాధాన్యత తెలుసుకునేందుకు చంద్రబాబును వివరణ కోరడంలో తప్పేంటంటూ పవన్ కళ్యాణ్‌కు బహిరంగ లేఖ రాశారు హరిరామ జోగయ్య.
భారత్ జీడీపీ గ్రోత్ 8.4 శాతం ఇది శుభవార్త అన్నారు బీజేపీ నేత కొండ విశ్వేశ్వర్ రెడ్డి. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి మోడీతో మంచి సంబంధాలు పెట్టుకున్నారన్నారు. ఈ ప్రభుత్వం అసెంబ్లీ లో హుందాగా వ్యవహరించింది… బూత్ లు మాట్లాడలేదన్నారు. ఈ రాష్ట్రంలో అభివృద్ది జరుగుతుంది అంటే మోడీ ప్రభుత్వం వల్లనే అన్నారు. ఈ ప్రభుత్వం 9 వేల కోట్లు అప్పులు తెచ్చుకునేందుకు సహకరించిందన్నారు. తెలంగాణ లో కరెంట్, ఇల్లు ,రోడ్లు, అభివృద్ది అన్ని…
ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణపట్నం పోర్టులో జరిగిన ఇద్దరు ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం అదానీ కృష్ణపట్నం పోర్టుకు ఇండోనేషియా నుంచి ఓ నౌక బొగ్గు లోడ్‌తో వచ్చింది. నౌకలోని ట్యాంకర్‌ను క్యాజువల్ ఉద్యోగులు క్లీన్ చేస్తుండగా గ్యాస్ లీక్ అయింది.
విజయనగరం జిల్లా బొబ్బిలి గున్నతోట వలస సమీపంలో రైల్వే పట్టాలపై మృతదేహం కలకలం రేపింది. ఆ మృతదేహం బొబ్బిలి పట్టణానికి చెందిన సచివాలయ వాలంటీర్ కిలారి నాగరాజుగా గుర్తించారు.