రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అజాత శత్రువు అని.. టీడీపీలో చేరుతున్నారంటే జిల్లాలో ఎంతో ఉత్సాహం కనబడుతోందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. వేమిరెడ్డి రాకతో నెల్లూరు జిల్లాలో ఈజీగా గెలవబోతున్నామని ఆయన అన్నారు. పేద ప్రజలకు సేవ చేయాలని టీడీపీలోకి వచ్చిన వేమిరెడ్డి దంపతులను సాదరంగా ఆహ్వానిస్తున్నామని చంద్రబాబు వారిని పార్టీలోకి ఆహ్వానించారు.
రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి శనివారం టీడీపీలో చేరారు. టీడీపీ కండువాతో ఆయనను చంద్రబాబు నాయుడు తమ పార్టీలోకి ఆహ్వానించారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణి ప్రశాంతి రెడ్ది, నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ కూడా టీడీపీలో చేరారు.
మేదరమెట్ల జాతీయ రహదారి పక్కన 4వ చివరి సిద్దం మహాసభ నిర్వహిస్తున్నామని వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. సిద్ధం సభ అనంతరం ఎన్నికల ప్రచారం మెుదలవుతుందన్నారు.
పారిశ్రామిక వేత్త వల్లగట్ల రెడ్డప్ప ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. మదనపల్లెకు చెందిన పారిశ్రామికవేత్త రెడ్డప్పకు బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు పురంధేశ్వరి. ఈ చేరిక కార్యక్రమంలో కిరణ్ కుమార్ రెడ్డి, సోము వీర్రాజు పాల్గొన్నారు.
ముద్రగడ పద్మనాభం కుటుంబం రాజకీయ భవితవ్యంపై తర్జన భర్జన జరుగుతోంది. ముద్రగడ కుమారుడు గిరికి వైసీపీ పెద్దలు టచ్లోకి వెళ్లినట్లు సమాచారం. రాజకీయ అంశాలపై ఆయనతో చర్చించినట్లు తెలుస్తోంది. వైసీపీ నుంచి వచ్చిన ప్రపోజల్పై ముద్రగడ కుమారుడు గిరి తన తండ్రితో చర్చించారని తెలిసింది.
హైదరాబాద్లో టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ.. చంద్రబాబు సమక్షంలో టీడీపీ చేరానని తెలిపారు.
వచ్చే ఎన్నికల్లో చీపురుపల్లి నుంచి మంత్రి బొత్స సత్యనారాయణపై పోటీ చేయాలన్న టీడీపీ అధిష్ఠానం ప్రతిపాదనను దాదాపుగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తిరస్కరించారు. ఆయన తన అయిష్టాన్ని ఇప్పటికే ప్రదర్శిస్తూ అధిష్ఠానం ముందు తన నిర్ణయాన్ని చెప్పినట్లు తెలిసింది.
మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ టీడీపీ చేరారు. హైదరాబాద్లోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి వసంత కృష్ణప్రసాద్ వెళ్లారు. చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీలో చేరారు.
ఈ ఏడాది ఉష్ణోగ్రతలు భారీగా పెరగనున్నాయని భారత వాతావరణ శాఖ శుక్రవారం తెలిపింది. ఎల్నినో పరిస్థితులు కొనసాగే సూచనలు ఉన్నందున ఈ ఏడాది వేసవి ప్రారంభం నుంచే ఉష్ణోగ్రతలు పెరిగిపోనున్నాయని వెల్లడించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాల్లో సాధారణం కంటే అధికంగా వడగాలులు ఉంటాయని అంచనా వేసింది.
అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం వంగలి గ్రామంలో నిర్మించనున్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం, ఎనర్జీ(ఐఐపీఈ-పెట్రోలియం యూనివర్సిటీ) భవన సముదాయ నిర్మాణానికి ప్రధాని నరేంద్రమోడీ నేడు వర్చువల్గా భూమిపూజ చేయనున్నారు.