ప్రజలకు సేవ చేయాలనే తపనతో ఉద్యోగం చేస్తున్న వాలంటీర్లపై ప్రతిపక్షాలు దారుణంగా విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. ఒంగోలులో పేదలకు ఇళ్ల పట్టాల విషయంలో విషం చిమ్ముతున్నారన్న ఆయన.. అర్హులను సచివాలయ అధికారులే ఎంపిక చేశారన్నారు.
పెళ్లి జరుగుతున్న అమ్మాయి సోదరుడు గతంలో తమ అమ్మాయిని ఎత్తుకొని వెళ్ళాడని ఆరోపణలతో తాజాగా పెళ్లి మండపంలోకి వెళ్లి గొడవ చేసిన ఘటన ఇది. పెళ్లి మంటపంలో అమ్మాయి పెళ్లి జరగకుండా చేయడానికి ఒక వర్గం వారు ప్రయత్నాలు చేయడంతో పెళ్లికూతురు పెళ్లి నీ అడ్డు కునేందుకు యత్నం చేశారు..దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి యువకులని చెదరగొట్టారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. Pawan Singh: బీజేపీకి షాక్ ఇచ్చిన భోజ్పురి నటుడు.. ఇది…
పొటోషూట్ పేరుతో రప్పించి కెమెరాల ఓ యువ ఫొటోగ్రాఫర్ను దారుణంగా హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఆదిలాబాద్ నియోజకవర్గానికి 3500 ఇళ్లు నిరుపేదలకు అందించనున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఇచ్చిన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించాలన్నారు. భారత్ జోడో యాత్రతో కాంగ్రెస్ అంటేనే గ్యారంటీలకు గ్యారెంటీ అన్నారు. ధరణితో దొరలకే లబ్దిచేకురిందన్నారు మంత్రి సీతక్క. కాంగ్రెస్ కు వారెంట్ లేదన్న బీఆర్ఎస్ఎటు పోయిందన్నారు. పేదలకు కట్టిన ఇల్లు ఇవ్వని ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమన్నారు. సొంత ఆస్తులు పెంచుకున్న ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమన్నారు. గత ప్రభుత్వాలు జిల్లాకు అన్యాయం చేశాయన్నారు. చట్టాలను…
విశాఖలోని ఆనందపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక భారీ కంటైనర్ పట్టుబడింది. ఈరోజు ఉదయం శ్రీకాకుళం జిల్లా పలాసలో వేకువజామున ఒక కంటైనర్ గంజాయి లోడుతో వెళ్తున్నట్లు సమాచారం అందుకున్న ఎస్ఈబీ పోలీసులు తనిఖీలు చేపట్టారు.
Wine Shops: త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు ప్రలోభాలకు గురికావద్దని, ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా చూడాలని జిల్లా ఎన్నికల అధికారి జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ అన్నారు.
అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణీలు, బాలింతలకు సరైన పౌష్టికాహారం అందించేలా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పౌష్టికాహార లోపం, రక్తహీనతతో రాష్ట్రంలో గర్బిణులు, బాలింతలు, చిన్నారులు అనారోగ్యం పాలవుతున్నట్లు ఎన్హెచ్ఎఫ్ఎస్ వెల్లడించిన గణాంకాలు ఆందోళనకరంగా ఉన్నాయని అన్నారు. ఆరోగ్య ప్రమాణాలు పెరగాల్సింది పోయి, దిగజారటం సరైంది కాదని ముఖ్యమంత్రి అన్నారు. అందుకే అంగన్ వాడీ కేంద్రాల ద్వారా పౌష్ఠికాహారం అసలైన లబ్ధిదారులకు అందుతుందా.. లేదా పక్కాగా అధికారులు పర్యవేక్షించాలని సీఎం సూచించారు. కేవలం…
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్ధిగా బండి సంజయ్ కుమార్ పేరును జాతీయ నాయకత్వం ప్రకటించిన నేపథ్యంలో బండి సంజయ్ స్పందించారు. నా జీవితం కరీంనగర్ ప్రజలకే అంకితమన్నారు బండి సంజయ్. బీజేపీ కరీంనగర్ ఎంపీ అభ్యర్ధిగా తనని ప్రకటించినందుకు మోడీకి ధన్యవాదాలు తెలిపారు. మీరు గర్వపడేలా పోరాటాలు చేసిన.. కరీంనగర్ ప్రజల అభ్యున్నతి కోసం నిరంతరం పాటుపడతా అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. కరీంనగర్ నుండి భారీ మెజారిటీ గెలిపించి సత్తా చాటండని, కేంద్రం నుండి…