బుధవారం సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్లో చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. రేవంత్ రెడ్డి తిట్టాలి అంటే చంద్రబాబుని తిట్టాలి.. నిందించాలి అంటే కాంగ్రెస్ పార్టీని నిందించాలని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ లోపాలు, చంద్రబాబు పాపాలు.. మహబూబ్ నగర్‌కి శాపాలు అంటూ ఆయన విమర్శించారు.
మేడ్చల్ మల్కారిగిరి జిల్లా దుండిగల్ పరిధిలోని మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి కళాశాలకు చెందిన భవనాలను అధికారులు కూల్చివేశారు.
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నియామకంపై హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఎమ్మెల్సీల పేర్లను మళ్లీ కేబినెట్లో ప్రతిపాదించి గవర్నర్‌కు పంపాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మళ్లీ కొత్తగా ఎమ్మెల్సీల నియామకం చేపట్టాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది.
పాకిస్థాన్‌లో జరిగే మహాశివరాత్రి వేడుకల్లో పాల్గొనేందుకు 62 మంది హిందువులు బుధవారం భారత్ నుంచి వాఘా సరిహద్దు మీదుగా లాహోర్ చేరుకున్నారు. మహాశివరాత్రి వేడుకల్లో పాల్గొనేందుకు భారత్ నుంచి బుధవారం నాడు మొత్తం 62 మంది హిందూ యాత్రికులు లాహోర్ చేరుకున్నారని ఎవాక్యూ ట్రస్ట్ ప్రాపర్టీ బోర్డు (ఈటీపీబీ) ప్రతినిధి అమీర్ హష్మీ తెలిపారు.
చెరువు కబ్జాలపై రంగారెడ్డి కలెక్టర్ సీరియస్ అయ్యారు. గండిపేట, నెక్నామ్ పూర్లోని ఇబ్రహీం చెరువులో బఫర్ జోన్లో నిర్మిస్తున్న విల్లాల కూల్చివేతకు ఆదేశాలు జారీ చేశారు. లేక్ వ్యూ విల్లాస్ పేరుతో నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలను రెవెన్యూ అధికారులు కూల్చివేస్తున్నారు.
కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన ఆరుగురు నిపుణుల కమిటీ నేటి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టును పరిశీలించనుంది. ఎన్డీఎస్ఏ ఛైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను సందర్శించనుంది.
విద్యుత్ సరఫరాలో తెలంగాణ డిస్కంలు కొత్త రికార్డు సృష్టించాయి. రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా రెండు డిస్కంల పరిధిలో మార్చి 6 వ తేదీన 298.19 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా చేశాయి.
తెలంగాణలోనే అతిపెద్ద ప్రసిద్ద పుణ్యక్షేత్రం మైనా వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారి దేవస్థానం మహా శివరాత్రి జాతర వేడుకలు ప్రారంభం అయ్యాయి. నేటి నుంచి మూడు రోజుల పాటు మహాశివరాత్రి జాతర ఉత్సవాలకు సుమారు 3 లక్షలకు పైగా భక్తులు వస్తారనే అంచనాతో ఏర్పాట్లు చేశారు.
హైదరాబాద్ నుంచి రామగుండం వెళ్లే రాజీవ్ రహదారిపై రూ.2232 కోట్లతో నిర్మించే భారీ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి గురువారం సీఎం రేవంత్ రెడ్డి అల్వాల్‌లోని టిమ్స్ సమీపంలో నేడు భూమిపూజ చేయనున్నారు.