పిల్లి కారణంగా జపాన్‌లోని ఓ నగరం అప్రమత్తమైంది. జపాన్‌లోని ఒక మహానగరమైన పుకుయామా వణికిపోతోంది. ఏం వార్త వినాల్సి వస్తోందోనని జనం హడలెత్తిపోతున్నారు. కారణమేమిటంటే.. ఆ పిల్లి ప్రమాదకరమైన రసాయనాల ట్యాంక్‌లో పడి అక్కడి నుంచి కనిపించకుండాపోవడమే.
ప్రత్యామ్నాయ ఆదాయం పెంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో లాజిస్టిక్స్ విభాగ నెట్‌వర్క్‌ను మరింతగా విస్తరిస్తున్నామని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. వినియోగదారులకు వేగవంతమైన సేవలందించేందుకు త్వరలోనే పార్శిళ్లను ఇంటి వద్దనే పికప్, డెలివరీ చేస్తామని ఆయన చెప్పారు. హైదరాబాద్‌లోని దిల్సుఖ్నగర్ బస్ స్టేషన్ ప్రాంగణంలో గురువారం నూతనంగా ఏర్పాటు చేసిన లాజిస్టిక్స్ మోడల్ కౌంటర్‌ను సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ ప్రారంభించారు. కొత్త కౌంటర్లో ఒక పార్శిల్‌ను బుకింగ్ చేసి రశీదును వినియోగదారుడికి ఆయన అందజేశారు.…
డీఎంకే మాజీ కార్యకర్త జాఫర్ సాదిక్ ఇటీవల అరెస్టయిన అంతర్జాతీయ డ్రగ్ కార్టెల్‌తో తనకు సంబంధం ఉందన్న ఆరోపణలపై అన్నాడీఎంకేకు చెందిన ఎడప్పాడి కరుప్ప పళనిస్వామి (ఈపీఎస్), రాష్ట్ర బీజేపీ చీఫ్ కె.అన్నామలైపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గురువారం పరువు నష్టం దావా వేశారు.
రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి ఇంట్లో కమ్మ సంఘం ప్రతినిధులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మన అనే వాళ్ళు ఉంటడం చాలా ముఖ్యం.. మిమ్మలిని చూసి గర్వ పడుతున్నా అని అన్నారు. కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ.. అందరికీ న్యాయం చేస్తుందని తెలిపారు. ఎక్కడో మిస్ కమ్యూనికేషన్ అయింది.. లేకుంటే కమ్మ సామాజిక వర్గానికి న్యాయం చేస్తారన్నారు. రేవంత్ దృష్టికి తీసుకుపోతాను.. న్యాయం చేస్తారు అనే నమ్మకం ఉందని పేర్కొన్నారు. రైతు బిడ్డగా సెలవుల్లో…
మన శరీరంలో కిడ్నీలు చాలా ముఖ్యమైన భాగం. ఇవి మనల్ని ఆరోగ్యంగా ఉంచడానికి అనేక విధులను నిర్వహిస్తాయి. కిడ్నీలు శరీరంలోని వ్యర్థ పదార్థాలను తొలగించడం ద్వారా రక్తాన్ని శుద్ధి చేయడంలో సహాయపడుతాయి. అంతేకాకుండా, మూత్రపిండాలు మన రక్తపోటును నియంత్రించడంలో కూడా సహాయపడతాయి.
Bode Prasad : ఏపీలో ఎన్నికల హడావిడి మొదలైంది. వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు టీడీపీ జనసేనతో పొత్తు పెట్టుకుంది. అంతేకాకుండా.. ఈ పొత్తులోకి బీజేపీ కూడా వచ్చి చేరడంతో కూటమిగా మారింది. అయితే.. ఇటీవల కూటమిలో పార్టీల మధ్య సీట్ల పంపకాలపై తుది నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఆయా పార్టీల అధిష్టానాలు అభ్యర్థులను ఫైనల్ చేసేందుకు కసరత్తు చేస్తోంది. అయితే.. ఇటీవల కాలంలో నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేలను, ప్రజల్లో ఉంటున్న నాయకులకు టిక్కెట్లు ఇవ్వకుండా.. వారిని మరో…
ఏపీ సీఎం జగన్ నేడు నంద్యాల జిల్లాలో పర్యటించారు. మహిళా సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో చేపడుతున్న కార్యక్రమాల్లో భాగంగా నిధుల విడుదల చేశారు సీఎం జగన్. మహిళా సాధికారత సామాజిక న్యాయానికి సంబంధించిన అంశం మాత్రమే కాదని, ఆర్థిక అనివార్యత కూడా అనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం ఆర్థికంగా వెనుకబడిన ఓసీ వర్గాల మహిళలకు ఈబీసీ నేస్తం ద్వారా ఆర్ధిక సాయం చేస్తోంది. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. పేదరికానికి కులం ఉండదన్నారు.…
టీడీపీ అభ్యర్థుల రెండో జాబితాపై ఉత్కంఠ నెలకొంది. 94 మంది అభ్యర్థులతో గ్రాండ్ ఓల్డ్ పార్టీ ఇప్పటికే తొలి జాబితాను ప్రకటించింది. కానీ కొంతమంది సీనియర్లు వారి భవిష్యత్తుపై అనేక ప్రశ్నలను లేవనెత్తే జాబితాలో చోటు దక్కించుకోలేకపోయారు. కూటమి పార్టీల నేతల మధ్య పోటీ కూడా ఇందుకు ప్రధాన కారణం. ఇప్పుడు టీడీపీ 34 మంది అభ్యర్థులతో రెండో జాబితాను ప్రకటించింది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు ఎవరనే దానిపై మరింత క్లారిటీ వచ్చింది. సస్పెన్షన్‌కు గురైన…
టీడీపీ రెండో జాబితా విడుదల టీడీపీ అభ్యర్థుల రెండో జాబితాపై ఉత్కంఠ నెలకొంది. 94 మంది అభ్యర్థులతో గ్రాండ్ ఓల్డ్ పార్టీ ఇప్పటికే తొలి జాబితాను ప్రకటించింది. కానీ కొంతమంది సీనియర్లు వారి భవిష్యత్తుపై అనేక ప్రశ్నలను లేవనెత్తే జాబితాలో చోటు దక్కించుకోలేకపోయారు. కూటమి పార్టీల నేతల మధ్య పోటీ కూడా ఇందుకు ప్రధాన కారణం. ఇప్పుడు టీడీపీ 34 మంది అభ్యర్థులతో రెండో జాబితాను ప్రకటించింది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు ఎవరనే దానిపై మరింత…
కృష్ణాజిల్లా గుడివాడలో దళిత సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో గుడివాడ నెహ్రూ చౌక్ సెంటర్లో భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు చేశారు. బౌద్ధ విధానంలో ఎమ్మెల్యే కొడాలి నాని, ఎస్సీ కమిషన్ చైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ.. అంబేద్కర్ దిక్సూచిగానే వైఎస్సార్సీపీ పని చేస్తుందని ఆయన తెలిపారు. గుడివాడ నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహా ఏర్పాటుకు శంకుస్థాపన చేసే మహాభాగ్యం తనకు రావడం పూర్వజన్మ సుకృతమని…