సీఏఏపై చట్టపరంగా, రాజకీయంగా పోరాడుతామని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (CPI) రాజ్యసభ ఎంపీ, సీపీఐ కేరళ రాష్ట్ర కార్యదర్శి బినోయ్ విశ్వం గురువారం అన్నారు. సీఏఏ అమలును సవాల్ చేస్తూ ఆయన గురువారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
మాజీమంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి కీలక ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని తెలిపారు. ఇదిలా ఉంటే.. తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొన్నారు. ఐదేళ్లు బీఆర్ఎస్ ను వదిలేది లేదని తేల్చి చెప్పారు. ప్రస్తుతం తన వయసు 71 సంవత్సరాలని.. ఈ సమయంలో పార్టీ మారే అవకాశం లేదన్నారు. ఈ ఐదేళ్లు ప్రజా సేవ చేసి, రాజకీయాల నుంచి వైదొలుగుతానని మల్లారెడ్డి తెలిపారు.
మోడీ మీద నమ్మకంతో బీజేపీ చేవెళ్లలో భారీ మెజారిటీతో గెలుస్తుందని బీజేపీ చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. చేవెళ్లలో తమ ఫస్ట్ రౌండ్ ప్రచారం అయిపోయిందని పేర్కొన్నారు. చేవెళ్లలో సర్వే చేయించాం.. గెలిచేది బీజేపీయేనని అన్నారు. చేవెళ్ల సీటు మోడీదే.. ఇది రాసి పెట్టుకోవచ్చని ధీమా వ్యక్తం చేశారు. తమ పార్టీపై దుష్ప్రచారం జరుగుతోందని విశ్వేశ్వర్ రెడ్డి చెప్పారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అని అసెంబ్లీలో ఎన్నికల్లో కూడా అన్నారు.. లిక్కర్ కేసులో…
షార్ట్ వీడియో యాప్ టిక్‌టాక్‌ను నిషేధించే ప్రతిపాదన బుధవారం యుఎస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో ఆమోదించబడింది. టిక్‌టాక్‌పై నిషేధం తర్వాత చైనా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది
సాయంత్రం 5 గంటలకు ఎంప్లాయిస్ అసోసియేషన్‌తో కేబినెట్ సబ్ కమిటీ భేటీ కానుంది. జీవో 317, జీవో 46కు సంబంధించిన సమస్యలపై కమిటీ అధ్యయనం చేయనుంది. ఇటీవల MCRHRDలో ఉద్యోగ సంఘాలతో సీఎం రేవంత్ రెడ్డి జరిపిన చర్చల్లో 317, 46 జీవోలపై అధ్యానం చేయాలని సూచించారు. ఈ క్రమంలో.. దానికి సంబంధించిన సిఫార్సులతో కేబినెట్ సబ్ కమిటీతో చర్చలకు రావాలని ముఖ్యమంత్రి ఉద్యోగ సంఘాలకు సూచించారు.
పంజాబ్ నుంచి లోక్‌సభ ఎన్నికలకు 8 మంది అభ్యర్థులతో ఆమ్ ఆద్మీ పార్టీ తన మొదటి జాబితాను గురువారం ప్రకటించింది. ఈ జాబితాలో ఐదుగురు కేబినెట్ మంత్రులు ఉన్నారు.
తల్లిదండ్రులు పిల్లలను లింగ వివక్ష లేకుండా పెంచాలని.. అప్పుడే వారు ఉన్నత స్థాయికి వెళ్తారని స్త్రీ శిశు సంక్షేమ , పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మహిళా శిశు సంక్షేమ, సీనియర్ సిటిజన్స్ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు రవీంద్రభారతిలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో మంత్రి సీతక్కతో పాటు మహిళ శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి వాకాటి కరుణ పాటు పలువురు మహిళ అధికారిణిలు పాల్గొన్నారు.
: భారత్‌పై ప్రమాదకర ప్రణాళికలు రచిస్తున్న చైనా.. ఇప్పుడు భారత్ చుట్టూ పక్క దేశాల్లో సైనిక స్థావరాలను నిర్మించేందుకు సిద్ధమవుతోంది. భారత్‌కు పొరుగున ఉన్న శ్రీలంక, పాకిస్థాన్, మయన్మార్, చైనా, క్యూబా, స్నేహపూర్వక దేశమైన యూఏఈ, సీషెల్స్, తజికిస్థాన్, టాంజానియా వంటి దేశాలు కూడా సైనిక స్థావరాలను నిర్మించే అవకాశాలపై కసరత్తు చేస్తున్నాయని అమెరికా ఇంటెలిజెన్స్ కమ్యూనిటీ తాజా నివేదిక వెల్లడించింది.
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుండి రిజిస్ట్రేషన్ అయ్యే వాహనాలకు టీజీ అని రిజిస్ట్రేషన్ అవుతుందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుకూలంగా తీసుకున్న నిర్ణయం అని తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో వాహనాలన్నీ.. ఏపీ అని ఉంటే టీజీ అని మార్చుకున్న సందర్భం ఉందని పేర్కొన్నారు. జూన్ 2న రాష్ట్రం విడిపోయే సమయంలో టీజీ అని గెజిట్ ఇచ్చారని మంత్రి పొన్నం ప్రభాకర్…