చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశంలో కర్నూల్ ఎంపీ సంజీవ్ కుమార్ చేరారు. పార్టీ కండువా కప్పి సంజీవ్ కుమార్ ను సాదరంగా చంద్రబాబు ఆహ్వానించారు. ఈ సందర్భంగా సంజీవ్ కుమార్ మాట్లాడుతూ.. పొయ్యిమీద కాలుతున్న కుండను ముట్టుకునే ప్రయత్నం చేస్తే చెయ్యి కాలుతుందన్నారు. నాతో సహా రాష్ట్ర ప్రజలు వైసీపీను ఓసారి ముట్టుకుని ఆ తప్పు చేశారని ఆయన విమర్శించారు. రెండో చెయ్యి కూడా కాల్చుకోవద్దని ప్రజల్ని కోరుతున్నానన్నారు సంజీవ్ కుమార్. కర్నూల్ అభివృద్ధి, రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు…
ఏపీపీఎస్సీ గ్రూప్-1లో అక్రమాలపై సీబీఐతో విచారణ జరపాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ పెద్దల హస్తంతోనే పరీక్షలు, నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆయన ఆరోపించారు. ఐపీఎస్ అధికారులు గౌతమ్ సవాంగ్, సీతారామాంజనేయులపై కేసు నమోదు చేయాలని ఆయన అన్నారు. సర్వీస్ కమిషన్ను సీఎం జగన్ వైసీపీ కార్యాలయంగా మార్చి నాశనం చేశాడని చంద్రబాబు మండిపడ్డారు. లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని, ఏపీపీఎస్సీ పెద్దలు…
ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు మండలం మునగపాడులో ప్రేమజంట ఆత్మహత్య కి పాల్పడింది. జి.కొండూరు మండలం మునగపాడు కి చెందిన ఇల్లా వెంకటేశ్వర్లు ఇద్దరు మహిళల్ని పెళ్ళి చేసుకున్నాడు. మొదటి భార్య చందర్లపాడు మండలం ఏటూరు లో నివాసముంటుండగా, రెండవ భార్యతో మునగపాడు లో నివాసముంటున్నాడు వెంకటేశ్వర్లు. అయితే.. వెంకటేశ్వర్లు మొదటి భార్య కుమారుడి కొడుకు (వెంకటేశ్వర్లు మనవడు) ఇల్లా దుర్గాప్రసాద్(17), రెండవ భార్య చిన్న కూతురు(వెంకటేశ్వర్లు కుమార్తె) ఇల్లా పావని(18) మధ్య ప్రేమ చిగురించింది. విషయం తెలియడంతో…
ఎన్ఆర్ఐ, భూస్వాములు, పెత్తందార్లకు టీడీపీ పార్టీ టిక్కెట్లు కేటాయించిందన్నారు ఎమ్మెల్యే శంకరనారాయణ. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా టీడీపీ నాయకుల ప్రవర్తన ఉందన్నారు. మహిళ ఓటర్లను ప్రలోభ పెట్టే విధంగా టీడీపీ నాయకుల చర్యలున్నాయన్నారు ఎమ్మెల్యే శంకరనారాయణ. టీడీపీ వారు ఎన్ని ప్రలోభాలు పెట్టిన.. మహిళలు అంతా వ్తెసీపీ పక్షాన ఉన్నారన్నారు. కేశవ్ ఎన్ని జిమ్మికులు చేసిన వ్తెసీపీ విజయాన్ని అడ్డుకోలేరని, నియోజకవర్గ ప్రాంత సమస్యలు పట్ల స్పందించిన దాఖాలాలు లేవని ఆయన వ్యాఖ్యానించారు. రెండు రోజుల…
పిట్బుల్ సహా విదేశీ కుక్క జాతులను నిషేధించాలని కేంద్రం సిఫారసు.. పలు విదేశీ కుక్క జాతులను నిషేధించాలని కేంద్రం సిఫార్సు చేసింది. పెటా ఇండియా అభ్యర్థన తర్వాత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇల్లిగల్ ఫైటింగ్, దాడులకు ఎక్కువగా ఉపయోగించే విదేశీ కుక్క జాతుల అమ్మకం, పెంపకం లేదా వాటిని కలిగి ఉండటంపై నిషేధం విధించాలని కేంద్రం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు బుధవారం లేఖ రాసింది. మానవుకులు ప్రమాదాలను తీసుకువస్తున్న పిట్ బుల్స్ వంటి…
గంటా శ్రీనివాసరావు నివాసంలో నేడు కీలక సమావేశం నిర్వహించనున్నారు. ముఖ్యనేతలతో రాజకీయ భవిష్యత్పై గంటా శ్రీనివాస రావు చర్చించనున్నారు. చీపురుపల్లి నుంచి మంత్రి బొత్సపై పోటీ చేయాలని గంటాకు హైకమాండ్ ఆదేశం పంపింది. అయితే.. నిన్న చంద్రబాబును కలిసిన గంటా శ్రీనివాస రావు విశాఖ జిల్లాలో సీటు ఇవ్వాలని కోరారు. పోటీ చేస్తే చీపురుపల్లి లేదంటే పార్టీ కోసం పనిచేయాలన్న హైకమాండ్ చెప్పడంతో… చీపురుపల్లి పోటీపై ఆసక్తి చూపట్లేదు. ఈ నేపథ్యంలోనే అనుచరులతో సమావేశం తర్వాత తుది…
మహిళల ఆర్థిక స్వావలంభన లక్ష్యంగా జగనన్న ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలను అమలు చేస్తూ అండగా నిలుస్తోంది. బీసీ, ఎస్ సి, ఎస్ టి, మైనారిటీ మహిళలకు భరోసానిచ్చేలా వైఎస్ఆర్ చేయూత, కాపు మహిళల అభ్యున్నతికి కాపు నేస్తం అమలు చేస్తున్న ప్రభుత్వం తాజాగా అగ్రవర్ణ పేద మహిళలకు ఈబిసి పథకాన్ని రూపొందించింది. అగ్ర వర్ణాలలోని పేద మహిళలకు మెరుగైన జీవనోపాధి, ఆర్థిక సాధికారతే లక్ష్యంగా రెడ్డి, కమ్మ, క్షత్రియ, బ్రాహ్మణ, ఆర్య…
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జమ్మికుంట తహసీల్దార్ రజనీని అధికారులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే జమ్మికుంట తహసీల్దార్ ఆస్తులపై ఏసీబీ కీలక ప్రకటన చేసింది. మార్కెట్ విలువ ప్రకారం 20 కోట్ల వరకు ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. లోక్సభ ఎన్నికల్ల పోటీ చేసే మరో ఇద్దరు బీఆర్ఎస్ అభ్యర్థుల పేర్లను మాజీ సీఎం కేసీఆర్ ప్రకటించారు. చేవెళ్ల నుంచి కాసాని జ్ఞానేశ్వర్, వరంగల్ ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ కడియం కావ్య పేరును ప్రకటించారు.