లోక్ సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితను అదుపులోకి తీసుకుంది. ఢిల్లీ నుంచి వచ్చిన 10 మంది ఈడీ అధికారులు సుమారు 3 గంటలకుపైగా తనిఖీలు చేసి.. కవితను అదుపులోకి తీసుకున్నారు. సోదాల్లో భాగంగా.. కవిత రెండు ఫోన్లతో పాటు ఇంట్లో ఉన్న 16 ఫోన్లను ఈడీ అధికారులు సీజ్ చేశారు.