కాసేపటి క్రితమే ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేసింది. ఈ క్రమంలో కవిత ఇంటికి కేటీఆర్, హరీష్ రావు వెళ్లారు. ఈడీ అధికారులతో కేటీఆర్ వాగ్వాదానికి దిగారు. ట్రాన్సిట్ వారెంట్ లేకుండా కవితను ఎలా అరెస్ట్ చేస్తారని కేటీఆర్ ప్రశ్నించారు. కనీసం తమ న్యాయవాదినైనా అనుమతించాలి కదా అని వాదించారు. సుప్రీంకోర్టులో అండర్‌టేకింగ్ ఇచ్చి ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించిన కేటీఆర్.. సుప్రీంకోర్టులో కేసు విచారణ ఉండగా ఈడీ చర్యలు సరికాదన్నారు. కోర్టు ద్వారా ఈడీ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. అధికారులు కేటీఆర్ ను సముదాయించే ప్రయత్నం చేశారు.
CAA: సీఏఏపై అమెరికా గాయని ప్రశంసల వర్షం.. ఏమన్నారంటే?
కవిత అరెస్ట్ పై మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. 8.45 ఫ్లైట్ కి ఢిల్లీకి తీసుకెళ్తామని చెప్పారన్నారు. అరెస్ట్ చేద్దామనే సోదాల పేరుతో వచ్చారు.. ముందే ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుని… ప్రీ ప్లాన్డ్ గా చేసిన అరెస్ట్ ఇది అని ఆయన ఆరోపించారు.
Tamota Price : భారీగా పెరుగుతున్న టమోటా ధరలు.. కిలో ఎంతంటే?
మరోవైపు.. ఈడీ అధికారులతో సంపూర్ణంగా సహకరిస్తామని కవిత మరియు పార్టీ లీడర్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈడీ అక్రమ అరెస్టును న్యాయపరంగా శాంతియుతంగా ప్రజాస్వామ్యంగా ఎదుర్కొంటామని పార్టీ నాయకులు తెలిపారు. అరెస్టుని అడ్డుకోవద్దని.. పార్టీ కార్యకర్తలు శాంతియుతంగా వ్యవహరించాలని కేటీఆర్, హరీష్ రావు, ఇతర పార్టీ సీనియర్ నాయకులు కోరారు.