రైతుబంధు 5 ఎకరాలవరకు ఇవాళ రేపు పూర్తి చేస్తామని, ధరణిపై త్వరలో శ్వేత పత్రం విడుదల చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కోదండ రెడ్డి చెప్పిన దానికంటే ఎక్కువ అక్రమాలు ఉన్నాయని, నా దగ్గర ధరణికి చెంది మరింత సమాచారం ఉందని ఆయన పేర్కొన్నారు. అన్ని వివరాలతో బైట పెడతామని, మేము అధికారం చేపట్టిన రెండుమూడు రోజుల్లో power shut down చెయ్యాలని ప్లాన్ ఉండిందన్నారు మంత్రి పొంగులేటి. దానిని మేము అధికమించాం …ఆ పరిస్థితులనుంచి బైట పడ్డామని, తాగునీటి సమస్య రానీకుండా చూస్తామన్నారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కరానికి మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి తో చర్చించండి ….అన్ని సమస్యలు పరిష్కరిస్తామని ఆయన పేర్కొన్నారు.
అంతేకాకుండా..’ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ డబుల్ డిజిట్ ఎంపీ సీట్లు గెలవబోతున్నాం. బీఆర్ఎస్ మీద మేము కక్ష పూరితంగా కేసూలు పెడుతున్నామంటున్నారు. అవన్ని గత ప్రభుత్వంలో వారు అధికార దుర్వినియోగంతో చేసిన తప్పులు అన్ని కనబడుతున్నవి కూడా. మా ప్రభుత్వం ఏర్పడింది డిసెంబర్ లో రాబోయే ఎండాకాలం దృష్టిలో పెట్టుకొని నీటి నిల్వలు ఉంచాల్సిన బాధ్యత వారిపై ఉంది కాని చేయాల్సిన పనులు చేయకుండా భాద్యత విస్మరించి మాపై రాళ్ళేయడం తగదు. కాళేశ్వరం ఫలితం ఎవరికి దక్కిందో అందరికి తెలిసిందే. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీకి ఒకటి రెండు ఎంపీ సీట్లు గెలిస్తే గొప్ప అనుకోవాలి. కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ. ఇతర పార్టీల నుండి మా పార్టీలోకి రమ్మని మేం ఎవరిని అడగటం లేదు.
వారికై వారు స్వచ్చందంగా వస్తున్నారు. మేం గేట్లు ఎత్తలేదు. ఎత్తితే వరద ఆగదు. మేం చెప్పిందే చేస్తున్నం. గత పాలకుల అవినీతి మీద పోరాడుతూనే. డిస్టర్బ్ అయిన వ్యవస్థను దారిలో పెడుతున్నం. 5ఎకరాలకు రైతు బంధు అని చెప్పినట్టే ఇస్తున్నాం. జీతాల చెళ్ళింపుల్లో కొంత ఆలస్యం అయిన మాట వాస్తవమే. ఆ దిశగా పరిష్కారం కోసం పనిచేస్తున్నాం. నేను బీజేపీతో టచ్ లో ఉన్నాను అనడం కరెక్ట్ కాదు . కాచిన చెట్టుకే రాళ్ళ దెబ్బలు అని నన్ను ట్రోల్ చేస్తున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడేందుకు వెనుకాడబోము. మేడిగడ్డ విషయంలో బాధ్యులను వదలం రిజిస్ట్రేషన్ శాఖను ప్రక్షాళన చేస్తాం. ప్రభుత్వంలో ఏది రహస్యం లేదు. ధరణిని ప్రక్షాళన చేస్తాము …ఉపయోగ పడే అంశాలను ఉంచుతాం. మా ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ ఉండదు.’ అని మంత్రి పొంగులేటి అన్నారు.