జగిత్యాల రూరల్ మండలం తాటిపల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సమక్షంలో చేరికలు జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీకి ఎందుకు ఓటెయ్యాలి పదేళ్లలో ఒక్క జాబ్ అయినా ఇచ్చారా అని ఆయన ప్రశ్నించారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలేవీ అని ఆయన అన్నారు. ఓటు కోసం వస్తే.. బీజేపీ నేతలను నిలదీయాలని, 15లక్షలు వస్తే బీజేపీకి , రాకపోతే కాంగ్రెస్ కు ఓటయ్యాలన్నారు. రైతు…
రాజకీయ హింసాత్మక ఘటనలపై మూడు జిల్లాల ఎస్పీలను వివరణ కోరానని ఏపీ సీఈఓ ఎంకే మీనా పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరులో జరిగిన హత్య రాజకీయ హింసేనని జిల్లా ఎస్పీ చెప్పారన్నారు.
దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా 3 నెలల్లో 30వేల ఉద్యోగాలు ఇచ్చి యువత స్థితి గతులను మార్చి మాట తప్పని ప్రభుత్వంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని తెలంగాణ ప్రభుత్వం నిలిచిందని కూకట్ పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బండి రమేష్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 3నెలల్లో అన్ని వర్గాల అన్ని ప్రాంతాల అన్ని మతాల ప్రజలను కలుపుకొని 17కార్పోరేషన్ లు ఏర్పాటు చేయడం ద్వారా తెలంగాణ లో సమసమాజం స్థాపనకు ముఖ్యమంత్రి రేవంత్…
నంద్యాల జిల్లా బనగానపల్లె రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఎన్నికల రేసులో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బీసీ జనార్థన్ రెడ్డి దూసుకుపోతున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి చేతిలో అనూహ్యంగా ఓటమిపాలైన బీసీ జనార్థన్ రెడ్డి ఈసారి ఎలాగైనా బనగానపల్లెలో టీడీపీ జెండా ఎగురవేయాలని పట్టుదలగా ఉన్నారు.
లోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ అభ్యర్థులు తమ ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచారు. తాజాగా.. మాజీ క్రికెటర్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి యూసుఫ్ పఠాన్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. గురువారం పశ్చిమ బెంగాల్‌లోని తాను పోటీ చేస్తోన్న లోక్ సభ నియోజకవర్గం బెర్‌హమ్‌పోర్లో ఎన్నికల ప్రచారాన్ని షురూ చేశారు.
శ్రీహేమాచల లక్ష్మీనృసింహస్వామి ఆలయం పరిసరాల్లో కొంత కాలంగా గుప్త నిధుల కోసం తవ్వకాలు చేస్తున్నారు. దానికి సంబంధించిన పది మంది ముఠాను గురువారం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. గుట్టపై కొంత కాలంగా అటవీ అభివృద్ధి పనులు చేస్తున్న ఓ ఫారెస్ట్ అధికారితో పాటు అతని సహాయకునిగా పనిచేస్తున్న మల్లూరుకు చెందిన వ్యక్తి, తాడ్వాయి మండలం కాటాపురానికి చెందిన మరో వ్యక్తి, జిల్లాలోని పలు గ్రామాలకు చెందిన పది మంది ముఠాగా ఏర్పడి గుట్టపై గుప్తనిధుల కోసం…
నారా భువనేశ్వరి చేపడుతోన్న నిజం గెలవాలి కార్యక్రమంపై ఏపీ సీఈఓకు వైసీపీ ఫిర్యాదు చేసింది. ప్రత్తిపాడు టీడీపీ అభ్యర్థి రామాంజనేయులు దాడికి దిగారంటూ వైసీపీ ఫిర్యాదు చేసింది. ఏపీ సీఈఓ ఎంకే మీనాను ప్రత్తిపాడు వైసీపీ అభ్యర్థి బాలసాని కిరణ్, నవరత్నాలు వైస్ ఛైర్మన్ నారాయణ మూర్తి కలిశారు.
చిత్తూరు జిల్లా ఎస్ఆర్ పురం మండలం వెదురుకుప్పంలో పురుగుల మందు తాగి చంద్రశేఖర్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. అన్నదమ్ముల భూమి పరిష్కార విషయంలో పోలీసుల జోక్యం చేసుకుని.. చంద్రశేఖర్‌ను పోలీసులు కొట్టడంతో మనస్థాపానికి గురై పురుగుల మందు తాగి చంద్రశేఖర్ (50) ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది.
ఐపీఎల్ ఆరంభానికి మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. ఈ క్రమంలో ఒక జట్టు తర్వాత ఒక జట్టు షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నాయి. ఇప్పటికే సీఎస్కే బౌలర్ మహీష్ పతిరణ గాయం కారణంగా ఐపీఎల్ ఆరంభ మ్యాచ్ లకు దూరం కానుండగా.. తాజాగా రాజస్థాన్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడం జంపా లీగ్ నుంచి తప్పుకొంటున్నట్లు సమాచారం తెలుస్తోంది. వ్యక్తిగత కారణాల వల్ల ఈ ఐపీఎల్ కు దూరం కానున్నాడు.…
వడగళ్ల వానలతో పంటలు దెబ్బ తిన్న రైతులను ఆదుకుంటామన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఇవాళ ఆయన నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎకరానికి 10 వేలు నష్ట పరిహారం అందిస్తామన్నారు. ప్రతి గ్రామానికి అధికారులు వెళ్ళి రైతు వారీగా సర్వే చేస్తున్నారని, ఆ నివేదిక రాగానే రైతుల ఖాతాలకు ఆర్థిక సాయం అందిస్తామన్నారు మంత్రి జూపల్లి. వచ్చే ఖరీఫ్ నుంచి క్రాప్ ఇన్సూరెన్స్ అమలు చేస్తామని, ప్రీమియం పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందన్నారు. ధనిక…